
దుబాయ్: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో 11 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను గెలిపించిన పేసర్ కగిసొ రబడ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 902 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. భారత స్పిన్నర్ అశ్విన్ రెండు స్థానాల్ని మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి ఎగబాకాడు. జడేజా మూడో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు.
బ్యాటింగ్ ర్యాంకుల్లో భారత కెప్టెన్ కోహ్లి రెండో స్థానంలో, పుజారా ఆరో ర్యాంకులో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment