సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి రోజు ఆటముగిసింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో సఫారీ పేసర్లు భారత బ్యాటర్లకు చుక్కలు చూపించారు. నిప్పులు చెరిగే బంతులను సంధించారు. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు పెను ప్రమాదం తప్పింది.
ఏమి జరిగిందంటే?
భారత తొలి ఇన్నింగ్స్ 44 ఓవర్‌లో మూడో బంతిని గంటకు 148 కిలోమీటర్ల వేగంతో ప్రోటీస్ యువ పేసర్ కోయిట్జీ బౌన్సర్‌గా సంధించాడు. శార్ధూల్ ఆ బంతిని ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచనా వేయడంలో శార్ధూల్ విఫలమయ్యాడు. దీంతో బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. ఠాకూర్ నుదిటిపై వాపు వచ్చింది. మైదానంలో నొప్పితో విల్లావిల్లాడు.
వెంటనే ఫిజియో వచ్చి కంకషన్ టెస్టు చేశాడు. ఆ తర్వాత శార్దూల్ మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించాడు. రబాడ వేసిన ఓవర్‌లో మళ్లీ బంతి శార్ధూల్ చేతికి తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయితే దెబ్బ తగిలిన తర్వాతి బంతికే శార్దూల్ (33 బంతుల్లో 24) ఔటయ్యాడు.
చదవండి: IND vs SA 1st Test: టీమిండియాతో తొలి టెస్టు.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment