దక్షిణాఫ్రికా పలువురు స్టార్ ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌తో కన్నా ఐపీఎల్-2022లో ఆడటానికి ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కగిసో రబాడ , లుంగీ ఎన్గిడి, మార్కో జెన్‌సన్, ఐడెన్ మార్క్‌రామ్, రాసి వాన్ డెర్ డుస్సెన్ ఐపీఎల్-2022లో పాల్గొన్నారు. కాగా ఈ తమ జట్టు ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ ఆదినుంచే ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.
అదే విధంగా ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ తమ ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. అయితే తమ జట్టును కాదని క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనడానికి వెళ్ళిన ఆటగాళ్ళపై చర్యలు తీసుకువడానికి దక్షిణాఫ్రికా క్రికెట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఆడుతున్న ప్రోటీస్ ఆటగాళ్లు తమ స్థానాలను జట్టులో కోల్పోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా తాజాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ చేసిన వాఖ్యలు.. ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టైంది. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ అనంతరం విలేకరుల సమావేశంలో ఎల్గర్ మాట్లాడాడు. ఆ క్రమంలో ఐపీఎల్‌లో పాల్గోన్న ఆటగాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించగా.. దానికి బదులుగా "దక్షిణాఫ్రికా తరఫున ఆడేందుకు వీరు మళ్లీ జట్టుకు ఎంపిక అవుతారో లేదో నాకు తెలియదు. అది ఇప్పుడు నా చేతుల్లో లేదు అని ఎల్గర్ పేర్కొన్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది.
చదవండి: IPL 2022: 'అది కోహ్లి బ్యాటింగ్ కాదు.. అతడిలో పవర్ తగ్గింది'
Comments
Please login to add a commentAdd a comment