Mark Boucher
-
IPL 2025: ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మహేళ జయవర్దనే మళ్లీ నియమితుడయ్యాడు. జయవర్దనే 2017 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. 2017, 2019, 2020 ఎడిషన్లలో టైటిళ్లు అందించాడు. అనంతరం జయవర్దనే ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ద క్రికెట్‌గా నియమితుడయ్యాడు. తిరిగి అతను 2025 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.జయవర్దనే ప్రస్తుత హెడ్ కోచ్ మార్క్ బౌచర్ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నాడు. బౌచర్ 2023, 2024 ఎడిషన్లలో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. బౌచర్ ఆథ్వర్యంలో ఎంఐ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. నూతన హెడ్ కోచ్‌గా జయవర్దనే నియామకాన్ని ఎంఐ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ స్వాగతించారు. జయవర్దనే నాయకత్వ లక్షణాలు, క్రికెట్ పరిజ్ఞానం ముంబై ఇండియన్స్‌కు లబ్ది చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదే సందర్భంగా ఆకాశ్ మార్క్ బౌచర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. గత రెండు సీజన్లలో అతను అందించిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో బౌచర్ సభ్యుడిగా కొనసాగుతడని పేర్కొన్నాడు.బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే..టీ20 వరల్డ్ కప్-2024లో టీమిండియాను విజేతగా నిలపడంతో కీలక పాత్ర పోషించిన బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరనున్నాడు. మాంబ్రే ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ రాజస్థాన్ రాయల్స్‌తో చేరిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ఇంకా టీమిండియాతోనే కొనసాగుతున్నాడు.చదవండి: ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్ట్‌లు.. సీనియర్లపై వేటు -
IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్-2024 చేదు అనుభవాలనే మిగిల్చింది. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించి.. సారథ్య బాధ్యతలను ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించింది.గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి పాండ్యాను ట్రేడ్ చేసుకుని మరీ.. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసింది. ఇదిలా ఉంటే.. బ్యాటర్‌గానూ హిట్‌మ్యాన్ ఈసారి తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.అదొక్కటి హైలైట్తాజా ఎడిషన్‌లో మొత్తంగా ముంబై తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 417 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్‌పై చేసిన సెంచరీ ఒక్కటి హైలైట్‌గా నిలవగా.. లీగ్ దశలో ఆఖరిదైన లక్నో మ్యాచ్‌లోనూ రోహిత్ అర్ధ శతకం(38 బంతుల్లో 68) సత్తా చాటాడు. ఇవి మినహా రోహిత్ నుంచి ఆశించిన మేర మెరుపులు రాలేదు.ఇదిలా ఉంటే.. మేనేజ్మెంట్, హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన కారణంగా రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్‌ను వీడతాడనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేకేఆర్ కోచ్ అభినవ్ ముకుంద్తో మాట్లాడుతూ రోహిత్ వీటికి బలం చేకూర్చాడు.వచ్చే ఏడాది మెగా వేలంఇక ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మార్క్ బౌచర్ సైతం తాజాగా ఈ విషయంపై స్పందించాడు. లక్నోతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఓడిన అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్న ఎదురైంది.ఇందుకు బదులిస్తూ.. ‘‘తనకు సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకోగల సమర్థుడు. వచ్చే ఏడాది మెగా వేలం జరుగబోతోంది. ఏం జరుగనుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు? రోహిత్ శర్మతో నేను గత రాత్రి మాట్లాడాను. ఈ సీజన్లో వైఫల్యాల గురించి చర్చించాం. తదుపరి ఏమిటని అడిగాను.ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ‘వరల్డ్‌కప్’.. అని సమాధానమిచ్చాడు’’ అని మార్క్ బౌచర్ పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలను బట్టి.. రోహిత్ శర్మ వచ్చే ఏడాది ముంబైని వీడటం ఖాయమని ఫిక్సయిపోయారు అతడి అభిమానులు.తగిన శాస్తి జరిగిందంటూపనిలో పనిగా.. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగించినందుకు ముంబై యాజమాన్యానికి తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మొత్తంగా ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. కాగా జూన్ 1 నుంచి ఆరంభమయ్యే టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్. -
ముంబై కోచ్ పై రోహిత్ భార్య ఆగ్రహం
-
‘రోహిత్ బ్యాటర్‌గా రాణించాలని కెప్టెన్సీ తప్పించాం’
ఐపీఎల్లో రోహిత్ శర్మ యథేచ్ఛగా పరుగులు చేయాలనే ఉద్దేశంతోనే కెప్టెన్సీ నుంచి తప్పించినట్లు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ వివరించాడు. ‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. కానీ జట్టు కోసం తప్పలేదు. రోహిత్ గత రెండు సీజన్లుగా జట్టును సమర్థంగా నడిపించాడు. ఇందులో సందేహం లేదు. కానీ పరుగులు చేయడంలో వెనుకబడ్డాడు. ఇప్పుడు అతను ఏ ఒత్తిడి లేకుండా తనకిష్టమైన ఓపెనింగ్ పాత్రలో మెరిపించేందుకు మా నిర్ణయం దోహదం చేస్తుంది’ అని బౌచర్ అన్నాడు. -
అందుకే రోహిత్‌ను ముంబై కెప్టెన్‌గా తప్పించామన్న కోచ్.. రితిక ఫైర్
Rohit Sharma's Wife Ritika Burns Internet With Her Reply: ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పుపై ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భావోద్వేగాలకు కట్టుబడి తమ నిర్ణయాన్ని మార్చుకోలేమని.. ఇది పూర్తిగా ఆటకు సంబంధించిన విషయమని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరొందాడు. రికార్డు స్థాయిలో ముంబై ఇండియన్స్‌ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత హిట్‌మ్యాన్ సొంతం. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ఫ్రాంఛైజీ అతడిని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్‌ను అరంగేట్రంలోనే విజేతగా నిలిపిన హార్దిక్ పాండ్యాను తిరిగి సొంతగూటికి రప్పించుకుని.. అతడిని కెప్టెన్‌ను చేసింది. ఈ విషయంపై రోహిత్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోవర్లను కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో కోచ్ మార్క్ బౌచర్ స్మాష్ స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్‌లో తాజాగా ఈ విషయంపై స్పందించాడు. ‘‘ఇది పూర్తిగా క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయం. హార్దిక్‌ను తిరిగి రప్పించి ఆటగాడిగా కొనసాగించాలనే తొలుత భావించాం. కానీ ప్రస్తుతం జట్టు పరివర్తన చెందే దశలో ఉంది. అయితే, ఇండియాలో చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నారు. అయితే, ఉద్వేగాలకు అతీతంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా చెప్పినట్లుగానే ఇది పూర్తిగా క్రికెటింగ్ డెసిషన్. రోహిత్లోని ఆటగాడిని మరోసారి అత్యుత్తమ స్థాయిలో చూడాలనుకుంటున్నాం. అతడు ఆటను పూర్తిగా ఆస్వాదిస్తూ.. స్వేచ్ఛగా పరుగులు రాబట్టనివ్వండి’’ అని మార్క్ బౌచర్ పేర్కొన్నాడు. కాగా గత రెండు సీజన్లలో రోహిత్ శర్మ బ్యాటర్‌గా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచకలేకపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ పనిభారం తగ్గించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బౌచర్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ మారగా.. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే స్పందించింది. ఇందులో చాలా వరకు తప్పులే మాట్లాడారంటూ ఆమె కామెంట్ చేసింది. చదవండి: Sania Mirza: ఆ అవకాశం మనం ఇవ్వకూడదు: అందమైన ఫొటోలతో సానియా సందేశం View this post on Instagram A post shared by Smash Sports (@smashsportsinc) -
'బ్యాటింగ్ ఆర్డర్ గురించి బాత్రూంలో చర్చించుకున్నాం'
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఆఖరి బంతికి విజయం సాధించింది. అయితే ఇదే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సమయంలో సూర్యకుమార్ గాయపడిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ కొట్టిన భారీ సిక్సర్‌ను అడ్డుకునే ప్రయత్నంలో కంటి పైభాగాన్ని బంతి చీల్చుకొని వెళ్లింది. దీంతో సూర్య కంటికి కుట్లు కూడా పడ్డాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య గోల్డెన్ డకౌట్ అయి విమర్శలు మూటగట్టుకున్నాడు. కానీ ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మార్క్ బౌచర్ మాత్రం సూర్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. కంటికి గాయమైన తర్వాత కూడా తనకు ఆటపై ఉన్న నిబద్ధత కనిపించిందని.. అందుకే ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు బాత్రూంలో కలిసినప్పుడు తాను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని పేర్కొన్నాడు. యూ ట్యూట్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బౌచర్ ఇలా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ''ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సమయంలో సూర్యకు గాయం కావడంతో బ్యాటింగ్ ఆర్డర్లో కింద పంపించాలని నిర్ణయించాం. అప్పటికి సూర్య తన కంటి బాగానికి ఐస్‌ప్యాక్ అప్లై చేస్తున్నాడు. ఒకవేళ పరిస్థితి అనుకూలంగా లేకుంటే అతని ప్లేస్‌లో మరో ఆటగాడిని ఇంపాక్ట్ కింద వాడుకుందామని చెప్పాను. మరి ఇది విన్నాడో లేదో తెలియదు కానీ ఆ తర్వాత సూర్య, నేను బాత్రూం వెళ్లే దారిలో కలిశాం. ఆ సమయంలో సూర్య నా దగ్గరికి వచ్చి మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ ఆర్డర్ మారే ఆలోచన లేదు.. నాలుగో స్థానంలోనే వస్తా అని నమ్మకంగా చెప్పాడు. అతని కాన్ఫిడెంట్‌కు నేను ఫిదా అయ్యా. సూర్య ఆడకున్నా పర్వాలేదు.. అతను నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ దిగుతాడు అని ఫిక్స్ అయ్యాం. '' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గి సీజన్లో బోణీ చేసిన ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్ కేకేఆర్‌తో ఏప్రిల్ 16న వాంఖడేలో ఆడనుంది. చదవండి: ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్.. తొలుత ఎవరూ కొనలేదు, ఇప్పుడు తెలిసొచ్చింది..! -
ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా మార్క్ బౌచర్
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ శుక్రవారం(సెప్టెంబర్ 16) తమ కొత్త కోచ్‌ను ఎంపిక చేసింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అందరు ఊహించనట్లుగానే దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్నే ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ పదవి వరించింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ అధికారిక ట్విటర్లో ప్రకటించింది. "మా కొత్త హెడ్ కోచ్‌ను పరిచయం చేస్తున్నాం. పల్టన్స్.. మన వన్ ఫ్యామిలీలోకి లెజెండ్‌ను స్వాగతించండి" అంటూ ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. మార్క్ బౌచర్ ఎంపికపై రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ స్పందిస్తూ.. '' ముంబై ఇండియన్స్‌లోకి మార్క్ బౌచర్‌ను స్వాగతించడానికి సంతోషిస్తున్నా. ఫీల్డ్‌లో ప్లేయర్‌గా, బయట కోచ్‌గా ఎంతో నైపుణ్యం సాధించి తన టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన మార్క్ బౌచర్ రాకతో ముంబై ఇండియన్స్ బలోపేతమైంది. టీమ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాడన్న నమ్మకముంది" అని చెప్పుకొచ్చాడు. హెడ్‌కోచ్ పదవి రావడంపై మార్క్ బౌచర్ స్పందింస్తూ.. "ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా నియమితమవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆ టీమ్ చరిత్ర, వాళ్ల ఘనతలు ప్రపంచంలోని బెస్ట్ స్పోర్టింగ్ ఫ్రాంఛైజీల్లో ఒకదానిగా ముంబై ఇండియన్స్‌ను నిలబెడతాయి. ఈ సవాలుకు నేను సిద్ధంగా ఉన్నా. గొప్ప నాయకత్వం, గొప్ప ప్లేయర్స్‌తో ముంబై బలంగా ఉంది. ఈ టీమ్‌కు నా సలహాలు అందించడానికి ఎదురుచూస్తున్నా" అని తెలిపాడు. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌కు బౌచర్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటి వరకూ హెడ్ కోచ్‌గా ఉన్న మహేల జయవర్దనె సెంట్రల్ టీమ్‌కు ప్రమోట్ కావడంతో ఆ స్థానం ఖాళీ అయింది. జయవర్దనేతో పాటు జహీర్‌ఖాన్‌ను కూడా ఆ టీమ్ సెంట్రల్ టీమ్‌కు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్‌లోనూ టీమ్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూడు టీమ్స్‌ను కలుపుతూ ఒక సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేశారు. వాటి బాధ్యతలనే జయవర్దనే, జహీర్‌ఖాన్‌లకు అప్పగించారు. కాగా బౌచర్ ఈ మధ్యే సౌతాఫ్రికా కోచ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమితో బౌచర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే అతడు టీ20 వరల్డ్‌కప్ వరకూ ఆ టీమ్‌తో కొనసాగనున్నాడు. కాగా దక్షిణాఫ్రికా తరపున దాదాపు 15 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన మార్క్ బౌచర్ అత్యుత్తమ వికెట్ కీపర్‌గా ఎదిగాడు. ప్రొటిస్ తరపున బౌచర్ 147 టెస్టులు, 295 వన్డేలు ఆడాడు. బౌచర్ కెరీర్లో ఐదు టెస్టు సెంచరీలు సహా ఒక వన్డే సెంచరీ ఉంది. ఇక వికెట్ కీపర్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 999 స్టంపింగ్స్, 952 క్యాచ్‌లు తీసుకొని కొత్త చరిత్ర సృష్టించాడు. 2012లో సోమర్‌సెట్‌తో మ్యాచ్ ఆడుతుండగా.. పొరపాటున ఎడమ కంటిలోకి బెయిల్ దూసుకెళ్లింది. దీంతో కంటిచూపు దెబ్బతినడంతో బౌచర్ అర్థంతరంగా తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. Presenting आपले नवीन Head Coach - 𝐌𝐀𝐑𝐊 𝐁𝐎𝐔𝐂𝐇𝐄𝐑 💙 Paltan, drop a 🙌 to welcome the 🇿🇦 legend to our #OneFamily 👏#DilKholKe #MumbaiIndians @markb46 @OfficialCSA pic.twitter.com/S6zarGJmNM — Mumbai Indians (@mipaltan) September 16, 2022 చదవండి: ప్రైవేట్ లీగ్స్ మోజులో సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు -
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా మార్క్ బౌచర్!
ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తమ కోచింగ్ స్టాప్‌లో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్థనేను ముంబై ఇండియన్స్ (ఎంఐ) గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పదవి అప్పజెప్పగా...క్రికెట్ ఆపరేషన్ డైరక్టర్ జహీర్ ఖాన్‌ను ఎంఐ గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా పదనోత్నతి కల్పించింది. ఈ క్రమంలో జయవర్థనే స్థానంలో ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మార్క్ బౌచర్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై కేప్‌టౌన్ ప్రాధాన కోచ్‌గా బౌచర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తొలుత వార్తలు వినిపించాయి. అయితే తాజగా ముంబై కేప్‌టౌన్ హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ సైమన్ కటిచ్ నియమితడయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా బౌచర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ముంబై గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ జయవర్థనే.. బౌచర్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ విషయంపై మరో వారం రోజుల్లో ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం దక్షిణాప్రికా హెడ్‌కోచ్‌గా ఉన్న బౌచర్.. టీ20 ప్రపంచకప్ అనంతరం తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ఇక గతంలో కూడా ఐపీఎల్లో కోచ్‌గా పనిచేసిన అనుభవం బౌచర్‌కు ఉంది. 2016లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపింగ్ సలహాదారుగా అతడు పనిచేశాడు. చదవండి: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ కీలక నిర్ణయం! -
క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్
Mark Boucher To Step Down As SA Head Coach: ఇంగ్లండ్ చేతిలో 1-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ అనంతరం జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు మార్క్ బౌచర్ నిన్న (సెప్టెంబర్ 12) ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) సైతం ధృవీకరించింది. 2019 డిసెంబర్లో సౌతాఫ్రికా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బౌచర్.. గత మూడేళ్ల కాలంలో సౌతాఫ్రికాకు అపురూప విజయాలు అందించాడు. సౌతాఫ్రికాను ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో (ప్రస్తుతం) నిలిపాడు. బౌచర్ హయాంలో సఫారీ టీమ్ 11 టెస్టులు, 12 వన్డేలు, 23 టీ20ల్లో విజయం సాధించింది. ఇందులో ఈ ఏడాది టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ (2-1) విజయం కూడా ఉంది. సీఎస్ఏతో బౌచర్ కాంట్రాక్ట్ 2023 వరల్డ్ కప్ వరకు ఉన్నప్పటికీ.. త్వరలో ప్రారంభంకానున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ ఫ్రాంచైజీ కోచింగ్ బాధ్యతలు చేపట్టే నిమిత్తం సీఎస్ఏతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. బౌచర్ దక్షిణాఫ్రికా కోచ్‌గా తన చివరి ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్‌లో ఆడనున్నాడు. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 11 వరకు జరుగనున్న 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌లు బౌచర్‌కు సౌతాఫ్రికా కోచ్‌గా ఆఖరివి. అనంతరం జరగనున్న టీ20 ప్రపంచకప్ (అక్టోబరు 16 నుంచి నవంబరు 13) తర్వాత అతను సౌతాఫ్రికా కోచ్ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలగనున్నాడు. -
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు క్లీన్చిట్
జాతి వివక్ష ఆరోపణల నుంచి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు విముక్తి లభించింది. అతనితో పాటు ప్రస్తుత కోచ్, మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్, ఏబీ డివిలియర్స్‌లకు కూడా క్లీన్చిట్ ఇచ్చారు. స్మిత్ తదితరులు జట్టులోని నల్లజాతి క్రికెటర్లపై వివక్షకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించలేదని... ఎన్సెబెజా నేతృత్వంలోని సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. -
'వాళ్లు మళ్లీ జట్టుకు ఎంపికవుతారో లేదో తెలియదు'
దక్షిణాఫ్రికా పలువురు స్టార్ ఆటగాళ్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌తో కన్నా ఐపీఎల్-2022లో ఆడటానికి ప్రాధాన్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కగిసో రబాడ , లుంగీ ఎన్గిడి, మార్కో జెన్సన్, ఐడెన్ మార్క్రామ్, రాసి వాన్ డెర్ డుస్సెన్ ఐపీఎల్-2022లో పాల్గొన్నారు. కాగా ఈ తమ జట్టు ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ ఆదినుంచే ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. అదే విధంగా ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ తమ ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. అయితే తమ జట్టును కాదని క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనడానికి వెళ్ళిన ఆటగాళ్ళపై చర్యలు తీసుకువడానికి దక్షిణాఫ్రికా క్రికెట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్లో ఆడుతున్న ప్రోటీస్ ఆటగాళ్లు తమ స్థానాలను జట్టులో కోల్పోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ చేసిన వాఖ్యలు.. ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టైంది. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ అనంతరం విలేకరుల సమావేశంలో ఎల్గర్ మాట్లాడాడు. ఆ క్రమంలో ఐపీఎల్లో పాల్గోన్న ఆటగాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించగా.. దానికి బదులుగా "దక్షిణాఫ్రికా తరఫున ఆడేందుకు వీరు మళ్లీ జట్టుకు ఎంపిక అవుతారో లేదో నాకు తెలియదు. అది ఇప్పుడు నా చేతుల్లో లేదు అని ఎల్గర్ పేర్కొన్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. చదవండి: IPL 2022: 'అది కోహ్లి బ్యాటింగ్ కాదు.. అతడిలో పవర్ తగ్గింది' -
ఆ విషయం విని షాక్‌కు గురయ్యాను: దక్షిణాఫ్రికా హెడ్ కోచ్
టెస్ట్ సిరీస్‌లో భాగంగా జొహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. అయితే తొలి టెస్ట్‌లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికాకు క్వింటన్ డి కాక్ రూపంలో బిగ్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. డికాక్ తన టెస్ట్ రిటైర్మెంట్ను ఆకస్మికంగా ప్రకటించి అందరనీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ విషయంపై దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తాజాగా స్పందించాడు. డికాక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు తెలిపాడు. అయితే అతడు ఇంత త్వరగా రిటైర్ అవుతుడాని ఎవరూ ఊహించలేదని బౌచర్ పేర్కొన్నాడు. టెస్ట్ ఫార్మాట్లో డికాక్ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడని అతడు ప్రశంసించాడు. "ఆ వయస్సులో డికాక్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరూ ఊహించ లేదు. ఇప్పటికీ మేము అదే షాక్‌లో ఉన్నాము. అతడి వ్యక్తిగత కారణాలను మేము గౌరవిస్తాము. మేము ఇప్పుడు సిరీస్ మధ్యలో ఉన్నాము. సిరీస్‌పై దృష్టిసారించాలి. డికాక్ స్ధానంలో వచ్చిన యువ ఆటగాళ్లపై దృష్టి పెట్టాలి. అద్భతమైన టెస్ట్ కెరీర్‌ను కలిగి ఉన్నాడు. డికాక్ స్ధానంలో కైల్ వెర్రెయిన్ జట్టులోకి రానున్నాడు. అతడు తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. అతడికి తుది జట్టులో చోటు దక్కపోయిన చాలా కాలం నుంచి జట్టుతోనే ఉన్నాడు. కాబట్టి ఆ అనుభవంతో ముందుకు సాగుతాడని భావిస్తున్నాను" అని బౌచర్ పేర్కొన్నాడు. కాగా మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0తో భారత్ ముందుంజలో ఉంది. ఇక రెండో టెస్ట్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. చదవండి: SA vs IND: ఇది గెలిస్తే... ప్రపంచాన్నే గెలిచినట్లు -
SA Vs Ind: ఓవైపు భారత్‌తో సిరీస్.. మరోవైపు హెడ్‌కోచ్‌పై విచారణ
Racism In Cricket South Africa: ఆటగాళ్లుగా ఉన్న సమయంలో నల్ల జాతీయుల క్రీడాకారులపట్ల వివక్ష ప్రదర్శించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్లపై సౌతాఫ్రికా క్రికెట్ (సీఎస్ఏ) అధికారికంగా విచారణ ప్రారంభించనుంది. ప్రస్తుతం స్మిత్ సీఎస్ఏ డైరెక్టర్‌గా, బౌచర్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నారు. క్రికెట్లో జాతివివక్షకు సంబంధించి సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ (ఎస్‌జేఎన్) ఇటీవల ఇచ్చిన నివేదికలో వీరిద్దరి పేర్లను ప్రస్తావించారు. ఎస్‌జేఎన్ ఇచ్చిన నివేదికకు కొనసాగింపుగా ఈ అంశంపై సీఎస్ఏ మరింత సమగ్రంగా విచారణ జరపాలని నిర్ణయించింది. నివేదికలో పై ఇద్దరితో పాటు ఏబీ డివిలియర్స్ పేరు కూడా ఉంది. కాగా మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ నిమిత్తం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. డిసెంబరు 26 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. ఓవైపు సిరీస్ కొనసాగుతుండగానే.. మరోవైపు ప్రస్తుత హెడ్‌కోచ్, డైరెక్టర్‌పై సీఎస్ఏ అధికారిక విచారణకు ఆదేశించడం గమనార్హం. చదవండి: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! IND VS SA: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా.. క్రికెట్ అభిమానులకు నిరాశే.. కష్టమే ఇక! -
వృద్ధిమాన్ సాహా ఓపెనర్‌గా పనికిరాడు: దక్షిణాఫ్రికా కోచ్
Mark Butcher Comments On Wriddhiman Saha: ఐపీఎల్ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచింది. దీంతో ఫ్లేఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసాయి. అయితే ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌కు ఆ జట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో దూరమయ్యాడు. ఈ క్రమంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌తో కలిసి వృద్ధిమాన్ సాహా హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. అయితే వృద్ధిమాన్ సాహా ఇన్నింగ్స్‌ను ఆరంభించడంపై దక్షిణాఆఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన సాహా వరుసగా 7,1,18, పరుగుల మాత్రమే సాధించాడు. "వృద్ధిమాన్ సాహా వాస్తవానికి మంచి వికెట్ కీపర్ కమ్ బ్యాట్సమన్. అయితే సాహా ఓపెనింగ్‌లో ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. తన బ్యాటింగ్ ఆర్ఢర్లో మార్పు చేస్తే అతడు అధ్బుతంగా ఆడగలడు" అని ఓ క్రికెట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పాడు. చదవండి: Gautam Gambhir: చెన్నై ప్లేఆఫ్స్ చేరాక ధోని ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి! -
'నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నా.. క్షమించండి'
డర్బన్: తాను క్రికెట్ ఆడే రోజుల్లో జాతివివక్షకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ స్పందించాడు. తన ప్రవర్తనపై బౌచర్ క్షమాపణలు చెప్పాడు. విషయంలోకి వెళితే.. దక్షిణాఫ్రికాకు క్రికెట్ ఆడుతున్న సమయంలో బౌచర్ నల్లజాతీయ సహచరులను ఉద్దేశించి పాటలు పాడి, వారిని మారుపేర్లతో పిలిచి అవమానించాడు. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్ పాల్ అడమ్స్.. తాను జాతి వివక్షకు గురయ్యానంటూ ఆరోపణలు చేశాడు. ఈ అంశానికి సంబంధించి బౌచర్ 14 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాన్ని దక్షిణాఫ్రికా సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీకి సమర్పించాడు. చదవండి: WI Vs PAK: చెలరేగిన షాహిన్ అఫ్రిది.. విండీస్ 150 ఆలౌట్ ''ఆరోజుల్లో నేను నల్లజాతీయులపై ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతున్నా.. ఆరోజు నేను ఆరోపణలు చేసినవారిలో పాల్ అడమ్స్ కూడా ఉన్నాడు. అడమ్స్‌ను మారుపేరుతో పిలుస్తూ పాటలు పాడాను.. ఇది బాధాకరం. ఈ విషయంలో మరింత సున్నితంగా వ్యవహరించాల్సింది. ఏది ఏమైనా నా అమర్యాద ప్రవర్తనకు క్షమాపణలు చెబుతున్నా. ఆ కాలంలో జట్టు, సహాయ సిబ్బంది, సెలక్టర్లు, సీఎస్ఏ మరింత సున్నితంగా వ్యవహరించాల్సింది. జట్టు సభ్యులందరూ స్వేచ్చగా మాట్లాడే వాతావరణం కల్పించాల్సింది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మార్క్ బౌచర్ దక్షిణాఫ్రికా తరపున 147 టెస్టుల్లో 5515 పరుగులు, 295 వన్డేల్లో 4686 పరుగులు, 25 టీ20ల్లో 268 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా 532 క్యాచ్‌లు.. 555 స్టంపింగ్స్ చేశాడు. 2012లో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ బెయిల్ కంటికి తగలడంతో దురదృష్టవశాత్తూ ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం బౌచర్ సౌతాఫ్రికా క్రికెట్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: Ajinkya Rahane: ‘నా గురించి చర్చించడం మంచిదేగా’ -
డివిలియర్స్ అందుకే ఒప్పుకోలేదు.. కానీ సరైన నిర్ణయం
జోహన్నెస్‌బర్గ్: విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయడం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న 37 ఏళ్ల డివిలియర్స్ అనూహ్యంగా 2018 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుంచే అతని పునరాగమనంపై పదే పదే వార్తలు వచ్చాయి. అతని మాజీ సహచరులు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్‌లు బోర్డులో కీలకపాత్ర పోషిస్తుండటంతో ఈ ఏడాది భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున కచ్చితంగా ఆడతాడనే ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను తోసి పుచ్చుతూ సీఎస్ఏ చేసిన ప్రకటనతో డివిలియర్స్ కెరీర్ ముగిసినట్లు స్పష్టమైపోయింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ డివిలియర్స్ అంశంపై స్పందించాడు. ''ఏబీ విషయంలో ఇది నిజంగా దురదృష్టకరం. 2018లో అతను తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవించాం. కానీ తనకు మళ్లీ ఆడాలని ఉందనే కోరికను బయటపెట్టాడు. జట్టులోకి అతని పునరాగమనం కోసం బోర్డు సభ్యులతో చాలాసార్లు చర్చించాం. కానీ అనూహ్యంగా కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు తాను ఇక జట్టులోకి రాకపోవచ్చు అనే సంకేతాలు డివిలియర్స్ బోర్డుకు పంపించడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగిసిపోయింది. ఆ విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. అతను ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ టీ20ల్లో బెస్ట్ ఫినిషర్‌గా నిలుస్తూ వచ్చాడు. అందుకు ఐపీఎల్ చక్కటి ఉదాహరణ. ఒక బోర్డులో సభ్యునిగా ఉత్తమంగా రాణిస్తున్న ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చే బాధ్యత నాపై ఉంది. ఏబీ డివిలియర్స్ విషయంలో కూడా అదే భావించాను. అతను జట్టులో ఉంటే ఆటగాళ్లకు మంచి ఎనర్జీ ఉంటుంది. కానీ ఏబీ నిర్ణయాన్ని మేం గౌరవించాల్సిందే. ఇక ఈ విషయాన్ని మరిచిపోయి ముందుకు సాగుదాం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఏబీ డివిలియర్స్ 2004లో టెస్టు మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అనతికాలంలోనే విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ మిస్టర్ 360 అనే పేరును ఏబీ సార్థకం చేసుకున్నాడు.అంతేగాక దక్షిణాఫ్రికాకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఏబీ తన 15 ఏళ్ల కెరీర్లో దక్షిణాఫ్రికా తరపున 114 టెస్టుల్లో 8765, 228 వన్డేల్లో 9557, 78 టీ20ల్లో 1672 పరుగులు సాధించాడు. ఇందులో టెస్టుల్లో 22 సెంచరీలు.. వన్డేల్లో 22 సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లోనూ డివిలియర్స్ తన ప్రత్యేకతను చూపించాడు. ఆరంభంలో ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన ఏబీడీ ఆర్సీబీకి వెళ్లిన తర్వాత ఫ్యాన్స్‌కు మరింత దగ్గరయ్యాడు. ఐపీఎల్లో ఎన్నో భీకరమైన ఇన్నింగ్స్‌లు ఆడిన డివిలియర్స్ ఇప్పటివరకు మొత్తంగా 176 మ్యాచ్‌లాడి 5056 పరుగులు చేశాడు. చదవండి: డివిలియర్స్‌పై కీలక ప్రకటన చేసిన దక్షిణాఫ్రికా బోర్డు ఇండియాకు వచ్చెయ్.. పంత్ స్థానంలో ఆడు! -
వాయిదా పడితే నేనాడేది కష్టమే
జొహన్నెస్‌బర్గ్: కోచ్ మార్క్‌బౌచర్ కోరిక మేరకు పునరాగమనం చేస్తానన్న దక్షిణాఫ్రికా ‘మిస్టర్ 360’ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ టి20 ప్రపంచకప్ వాయిదా పడితే మాత్రం ఆడేది అనుమానమేనన్నాడు. ఆసీస్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్ అక్టోబర్‌లో జరగాల్సి ఉంది. అయితే ప్రపంచాన్ని కోవిడ్–19 చుట్టేయడంతో ప్రతీ టోర్నీ వాయిదా లేదంటే రద్దు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ఆఫ్రికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘ఆరు నెలల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడెలా చూసేది. ఒకవేళ ప్రపంచకప్ వచ్చే ఏడాదికి వాయిదా పడితే ఎన్నో మారిపోతాయి. ఇప్పుడైతే నేను వందశాతం ఆడేందుకు సిద్ధమే. కానీ వచ్చే ఏడాది నా శరీరం సహకరిస్తుందో లేదో! కాబట్టి తప్పుడు ఆశల్ని కల్పించను’ అని అన్నాడు. బౌచర్ (కోచ్) అడిగినప్పుడు ఆసక్తి కనబరిచానని, ఇప్పుడు వాయిదా పడితే మాత్రం పునరాగమనం కష్టమేనన్నాడు. ‘నేను వందశాతం ఫిట్‌గా ఉంటేనే ఆడతాను. లేదంటే ఆడను. కొందరిలా... 80 శాతం ఫిట్నెస్ ఉన్నా ఆడేందుకు రెడీ అనే సంకేతాలు ఇచ్చే వ్యక్తిని కాదు’ అని ఏబీ స్పష్టం చేశాడు. గత వన్డే ప్రపంచకప్‌కు ముందు, తర్వాత తలెత్తిన వివాదం మరోసారి రేగేందుకు తనకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నాడు. 2018లో రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్ గత మెగా ఈవెంట్ ఆడేందుకు ఆసక్తి కనబరిచినా... దక్షిణాఫ్రికా జట్టు ససేమిరా అంది. ఈ మేటి బ్యాట్స్‌మన్ లేని సఫారీ జట్టు ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఏబీని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు దక్షిణాఫ్రికాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
కోచ్ వ్యాఖ్యలు ఏబీని బాధించాయా?
కేప్‌టౌన్: తన రీఎంట్రీపై దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఆశలు వదులుకున్నట్లే కనబడుతోంది. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వాయిదా పడటంతో ఏబీ డైలమాలో పడ్డాడు. ప్రధానంగా కరోనా మహమ్మారి కారణంగా మొత్తం క్రీడా ఈవెంట్లన్నీ రద్దు కావడంతో ఏబీ ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వరల్డ్ టీ20 కూడా వాయిదా పడితే మాత్రం తన రీఎంట్రీపై ఆలోచన చేయాల్సిందేనన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఆడటానికి సిద్ధంగా ఉన్నా, టీ20 వరల్డ్‌కప్ ఏడాది పాటు వాయిదా పడితే తాను ఆడటంపై గ్యారంటీ ఉండదన్నాడు. `ప్రస్తుత పరిస్థితులు క్రికెట్‌కు అనుకూలంగా లేవు. ఒకవేళ మెగాటోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడితే అనేక మార్పులు వస్తాయి. నేను జట్టుకు తిరిగి అందుబాటులో ఉండాలనుకున్నా. ఈ అంశంపై నా సన్నిహితుడు, కోచ్ మార్క్ బౌచర్‌తో మాట్లాడా. నేను వంద శాతం ఫిట్‌గా ఉంటేనే ఆడతాను. నేను కచ్చితంగా ఆడతాననే తప్పుడు సంకేతాలు ఇవ్వలేను. అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది. నా శరీరం అనుకూలించి అన్నీ కుదిరితే ఆడతా. ఇక్కడ మాత్రం గ్యారంటీ అయితే లేదు’ అని ఏబీ తెలిపాడు. (ఏబీ ఫామ్‌లో ఉంటేనే: బౌచర్) 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఏబీ.. 2019 జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాలని యత్నించాడు.అయితే అది కుదరకపోవడంతో వరల్ఢ్ టీ20 ఆడాలని నిశ్చయించుకున్నాడు. దక్షిణాఫ్రికా హెడ్ కోచ్‌గా మార్క్ బౌచర్ నియామకం జరగడంతో డివిలియర్స్ రీఎంట్రీ షురూ అయ్యింది. దీనిపై డివిలియర్స్ రావాలనుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసిన బౌచర్.. టీ20 వరల్డ్‌కప్‌కు అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టును తయారు చేయాలని యత్నిస్తున్నాడు. దాంతోనే కోచ్ పగ్గాలు చేపట్టిన వెంటనే తన సహచర క్రికెటర్లలో ఒకడైన ఏబీతో స్వయంగా మాట్లాడి మరీ ఒప్పించాడు. కోచ్ వ్యాఖ్యలు ఏబీని బాధించాయా? ఈ ఏడాది ఫిబ్రవరిలో సఫారీ కోచ్ మార్క్ బౌచర్ మాట్లాడుతూ ఏబీ ఫామ్‌లో ఉంటేనే టీ20 వరల్డ్‌కప్‌కు తీసుకుంటామంటూ యూటర్న్ తీసుకున్నాడు. తొలుత జట్టులో స్థానంపై భరోసా కల్పించిన బౌచర్.. ఏబీ తన రోల్‌కు న్యాయం చేయగలడని భావిస్తేనే చోటు కల్పిస్తామన్నాడు. ఆ వరల్డ్‌కప్‌కు అత్యున్నత జట్టును సిద్ధం చేస్తున్నామన్న బౌచర్.. ఇక్కడ ఎటువంటి ఇగోలకు తావులేదన్నాడు. ఏబీ ఫామ్‌లో ఉండి సరైన వాడు అనుకుంటే టీ20 వరల్డ్‌కప్‌లో అతని ఎంపిక ఉంటుందని తేల్చి చెప్పాడు. అంటే ఏబీ ఫామ్‌లో లేకపోతే మాత్రం జట్టులో కష్టం అనేది బౌచర్ మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యలు కచ్చితంగా ఏబీని బాధించే ఉంటాయి. కాగా, టీ20 వరల్డ్‌కప్ కంటే ముందు ఐపీఎల్ ఉండటంతో ఏబీ అప్పట్లో ఏమీ మాట్లాడలేదు. ఐపీఎల్లో తన మార్కు ఆట చూపెట్టి కోచ్ బౌచర్‌కు బ్యాట్‌తోనే సమాధానం చెబుదామని ఏబీ భావించి ఉండొచ్చు. కానీ ఐపీఎల్ ఇప్పట్లో జరిగే పరిస్థితులు లేకపోవడంతో ఏబీని టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయడం కష్టం. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ పూర్తిగా రద్దైతే ఏబీ ఫామ్ ఎలా బయటకొస్తుంది. ఏబీ తాజా మాటల్ని బట్టి ఐపీఎల్ జరగదనే ఫిక్స్ అయిపోయినట్లున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో చోటుపై పెదవి విప్పడానికి ఇదే కారణం కావొచ్చు. ఎలాగూ తన స్థానంపై కోచ్ నుంచి గ్యారంటీ లేదు.. అటువంటప్పుడు తాను ఆడటం కుదరని పని ఏబీ గ్రహించే ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. -
కరోనా ఎఫెక్ట్ : మాస్క్‌తో చహల్
ధర్మశాల : కరోనా ఎఫెక్ట్ క్రీడలకు కూడా తాకిందనడంలో ఎటువంటి సందేహం లేదు. టోక్యో ఒలింపిక్స్ 2020తో పాటు పలు రకాల క్రీడలు కరోనా వైరస్ దాటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్‌పై కూడా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ముఖానికి మాస్క్ తొడిగిన ఫోటో ఒకటి తన ట్విటర్లో షేర్ చేశాడు. ప్రసుత్తం చహల్ ఫోటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాహల్ ముఖానికి మాస్క్ వేసుకోవడంతో అతనికి వైరస్ ఏమైనా సోకిందా అని అభిమానులు కంగారు పడిపోయారు. కానీ అదేం లేదంటూ చాహల్ తేల్చేశాడు. (ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పఠాన్) మన జాగ్రత్తలో మనం ఉంటే ఎలాంటి వైరస్లు అయినా మన దగ్గరకు రాలేవని చహల్ ట్విటర్లో అభిప్రాయపడ్డాడు. కరోనా ప్రభావం తగ్గేవరకు ఇతరులతో షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటివి చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. కాగా దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు జట్లు మొదటి వన్డే జరిగే ధర్మశాలకు చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాయి. కాగా చహల్ ఒకరోజు ఆలస్యంగా జట్టుతో కలిశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ధర్మశాలకు వెళ్లే సమయంలో న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ముఖానికి మాస్క్ వేసుకొని ఇలా దర్శనమిచ్చాడు. (క్లార్క్‌కు వచ్చిన నష్టం ఏంటో ?) మరోవైపు స్వదేశానికి చేరుకున్న ప్రొటీస్ జట్టు ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ మాట్లాడుతూ.. ప్రసుత్తం కరోనా వైరస్ నేపథ్యంలో ఆటగాళ్ల పట్ల తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆటగాళ్లతో పాటు స్టేడియంకు వచ్చే ప్రేక్షకులతోనూ ఎలాంటి కరచాలనం చేయకుడదని జట్టును ఆదేశించినట్టు బౌచర్ వెల్లడించారు. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు ఒక మెడికల్ హెల్త్ సూపర్వైజర్ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కాగా ఇరు జట్ల మధ్య మొదటి వన్డే ధర్మశాల వేదికగా జరగనుంది. కరోనా వైరస్ దాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం లక్షకు పైగా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 4వేలకు పైగా చేరుకుంది. ఇక భారత్‌లో ఇప్పటివరకు 50 కోవిడ్ కేసులు నమోదైనట్లు తేలింది.(కోవిడ్ గుప్పిట్లో ఇటలీ) 😷 😷 ✈️✈️ pic.twitter.com/BnCyJCuf4V — Yuzvendra Chahal (@yuzi_chahal) March 10, 2020 -
ఏబీ ఫామ్‌లో ఉంటేనే: బౌచర్
కేప్‌టౌన్: 2018లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న సంగతి తెలిసిందే. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే సందర్భంలో వర్క్ లోడ్ ఎక్కువ అయ్యిందని భావించిన డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అటు తర్వాత గతేడాది వన్డే వరల్డ్‌కప్ జరిగిన తరుణంలో మళ్లీ జట్టు తరఫున ఆడటానికి డివిలియర్స్ ప్రయత్నాలు కూడా చేశాడు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇటీవల దక్షిణాఫ్రికా హెడ్ కోచ్‌గా మార్క్ బౌచర్ నియామకం జరగడంతో డివిలియర్స్ రీఎంట్రీ షురూ అయ్యింది. దీనిపై డివిలియర్స్ రావాలనుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసిన బౌచర్.. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టును తయారు చేయాలని యత్నిస్తున్నాడు. దాంతోనే తన సహచర క్రికెటర్లలో ఒకడైన ఏబీతో స్వయంగా మాట్లాడి మరీ ఒప్పించాడు. దీనిలో భాగంగానే తాను టీ20లతో పాటు వన్డేలకు సైతం అందుబాటులో ఉంటానని ఏబీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం డివిలియర్స్‌కే రీఎంట్రీ నిర్ణయంపై బౌచర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా టీ20 వరల్డ్‌కప్‌కు ఏబీ ఫామ్‌లో ఉంటేనే జట్టులోకి తీసుకుంటామనే సంకేతాలు ఇచ్చాడు. అతని జాబ్‌కు న్యాయం చేయగలడని భావిస్తే అతన్ని టీ20 వరల్డ్‌కప్‌లో కొనసాగిస్తామన్నాడు.టీ20 వరల్డ్‌కప్‌కు అత్యుత్తమ జట్టు ఉండాలనే లక్ష్యంతోనే కసరత్తు చేస్తున్నాం. ఒక మంచి జట్టు ఉంటేనే వరల్డ్‌కప్‌ను సాధించడం జరుగుతుంది. ఒక పోటీ ఇచ్చే జట్టునే సిద్ధం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నా. ఏబీ ఫామ్‌లో ఉండి సరైన వాడు అనుకుంటే టీ20 వరల్డ్‌కప్‌లో అతని ఎంపిక ఉంటుంది. ఇక్కడ ఇగోలకు తావులేదు’ అని బౌచర్ తెలిపాడు. అంటే ఏబీ ఫామ్‌లో లేకపోతే మాత్రం జట్టులో కష్టం అనేది బౌచర్ మాటల్ని బట్టి అర్థమవుతుంది. అయితే టీ20 వరల్డ్‌కప్ కంటే ముందు ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఏబీ సత్తాచాటితే మాత్రం అప్పుడు అతనికి ఎటువంటి ఢోకా ఉండకపోవచ్చు. -
ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ..!
కేప్‌టౌన్: గతేడాది ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న సంగతి తెలిసిందే. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే సందర్భంలో వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయిందని భావించిన డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను జాతీయ జట్టు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అటు తర్వాత ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్ జరిగిన తరుణంలో మళ్లీ జట్టు తరఫున ఆడటానికి డివిలియర్స్ ప్రయత్నాలు కూడా చేశాడు.తాజాగా దక్షిణాఫ్రికా హెడ్ కోచ్‌గా మార్క్ బౌచర్ నియామకం జరగడంతో డివిలియర్స్ రీఎంట్రీ షురూ అయ్యేలా కనబడుతోంది. ఈ విషయంపై తన సహచరుడు, సన్నిహితుడు ఏబీని అడుగుతానని బౌచర్ వెల్లడించాడు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు అత్యుత్తమ ఆటగాళ్లతో జట్టును ఉంచడమే తన ముందున్న లక్ష్యమని బౌచర్ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఏబీతో చర్చలు జరుపుతానని తెలిపాడు. అతనొక అత్యుత్తమ ఆటగాడని, ఇంకా జాతీయ జట్టుకు ఆడే సత్తా ఉందన్నాడు. తానెందుకు ఏబీ రిటైర్మెంట్ను పునః సమీక్షించుకోమని చర్చించుకూడదని మీడియాను ఎదురు ప్రశ్నించాడు. ఏబీతో పాటు మరికొంతమంది రిటైర్డ్ ఆటగాళ్లతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. తాను ప్రస్తుతం చేపట్టిన పదవే అత్యుత్తమ ఆటగాళ్లను వెలికి తీయడం అన్నాడు. శనివారం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బౌచర్ నియామకం జరిగింది. దక్షిణాఫ్రికా తాత్కాలిక డైరెక్టర్ గ్రేమ్ స్మిత్.. బౌచర్‌ను కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. 2023 వరకూ బౌచర్ సఫారీల కోచ్‌గా కొనసాగనున్నాడు.