డర్బన్: తాను క్రికెట్ ఆడే రోజుల్లో జాతివివక్షకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ స్పందించాడు. తన ప్రవర్తనపై బౌచర్ క్షమాపణలు చెప్పాడు. విషయంలోకి వెళితే.. దక్షిణాఫ్రికాకు క్రికెట్ ఆడుతున్న సమయంలో బౌచర్ నల్లజాతీయ సహచరులను ఉద్దేశించి పాటలు పాడి, వారిని మారుపేర్లతో పిలిచి అవమానించాడు. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్ పాల్ అడమ్స్.. తాను జాతి వివక్షకు గురయ్యానంటూ ఆరోపణలు చేశాడు. ఈ అంశానికి సంబంధించి బౌచర్ 14 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాన్ని దక్షిణాఫ్రికా సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ కమిటీకి సమర్పించాడు.
చదవండి: WI Vs PAK: చెలరేగిన షాహిన్ అఫ్రిది.. విండీస్ 150 ఆలౌట్
''ఆరోజుల్లో నేను నల్లజాతీయులపై ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతున్నా.. ఆరోజు నేను ఆరోపణలు చేసినవారిలో పాల్ అడమ్స్ కూడా ఉన్నాడు. అడమ్స్‌ను మారుపేరుతో పిలుస్తూ పాటలు పాడాను.. ఇది బాధాకరం. ఈ విషయంలో మరింత సున్నితంగా వ్యవహరించాల్సింది. ఏది ఏమైనా నా అమర్యాద ప్రవర్తనకు క్షమాపణలు చెబుతున్నా. ఆ కాలంలో జట్టు, సహాయ సిబ్బంది, సెలక్టర్లు, సీఎస్‌ఏ మరింత సున్నితంగా వ్యవహరించాల్సింది. జట్టు సభ్యులందరూ స్వేచ్చగా మాట్లాడే వాతావరణం కల్పించాల్సింది'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక మార్క్ బౌచర్ దక్షిణాఫ్రికా తరపున 147 టెస్టుల్లో 5515 పరుగులు, 295 వన్డేల్లో 4686 పరుగులు, 25 టీ20ల్లో 268 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా 532 క్యాచ్‌లు.. 555 స్టంపింగ్స్ చేశాడు. 2012లో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ బెయిల్ కంటికి తగలడంతో దురదృష్టవశాత్తూ ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం బౌచర్ సౌతాఫ్రికా క్రికెట్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment