
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ యథేచ్ఛగా పరుగులు చేయాలనే ఉద్దేశంతోనే కెప్టెన్సీ నుంచి తప్పించినట్లు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ వివరించాడు. ‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. కానీ జట్టు కోసం తప్పలేదు.
రోహిత్ గత రెండు సీజన్లుగా జట్టును సమర్థంగా నడిపించాడు. ఇందులో సందేహం లేదు. కానీ పరుగులు చేయడంలో వెనుకబడ్డాడు. ఇప్పుడు అతను ఏ ఒత్తిడి లేకుండా తనకిష్టమైన ఓపెనింగ్ పాత్రలో మెరిపించేందుకు మా నిర్ణయం దోహదం చేస్తుంది’ అని బౌచర్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment