రోహిత్‌ను తప్పించడంపై కోచ్ వ్యాఖ్యలు.. రితిక స్పందన (PC: BCCI/IPL)
Rohit Sharma's Wife Ritika Burns Internet With Her Reply: ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పుపై ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భావోద్వేగాలకు కట్టుబడి తమ నిర్ణయాన్ని మార్చుకోలేమని.. ఇది పూర్తిగా ఆటకు సంబంధించిన విషయమని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరొందాడు.
రికార్డు స్థాయిలో ముంబై ఇండియన్స్‌ను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత హిట్‌మ్యాన్ సొంతం. అయితే, ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ఫ్రాంఛైజీ అతడిని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించింది.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్‌ను అరంగేట్రంలోనే విజేతగా నిలిపిన హార్దిక్ పాండ్యాను తిరిగి సొంతగూటికి రప్పించుకుని.. అతడిని కెప్టెన్‌ను చేసింది. ఈ విషయంపై రోహిత్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోవర్లను కూడా కోల్పోయింది.
ఈ నేపథ్యంలో కోచ్ మార్క్ బౌచర్ స్మాష్ స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్‌లో తాజాగా ఈ విషయంపై స్పందించాడు. ‘‘ఇది పూర్తిగా క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయం. హార్దిక్‌ను తిరిగి రప్పించి ఆటగాడిగా కొనసాగించాలనే తొలుత భావించాం.
కానీ ప్రస్తుతం జట్టు పరివర్తన చెందే దశలో ఉంది. అయితే, ఇండియాలో చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నారు.
అయితే, ఉద్వేగాలకు అతీతంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా చెప్పినట్లుగానే ఇది పూర్తిగా క్రికెటింగ్ డెసిషన్. రోహిత్‌లోని ఆటగాడిని మరోసారి అత్యుత్తమ స్థాయిలో చూడాలనుకుంటున్నాం.
అతడు ఆటను పూర్తిగా ఆస్వాదిస్తూ.. స్వేచ్ఛగా పరుగులు రాబట్టనివ్వండి’’ అని మార్క్ బౌచర్ పేర్కొన్నాడు. కాగా గత రెండు సీజన్లలో రోహిత్ శర్మ బ్యాటర్‌గా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచకలేకపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ పనిభారం తగ్గించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బౌచర్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ మారగా.. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే స్పందించింది. ఇందులో చాలా వరకు తప్పులే మాట్లాడారంటూ ఆమె కామెంట్ చేసింది.
చదవండి: Sania Mirza: ఆ అవకాశం మనం ఇవ్వకూడదు: అందమైన ఫొటోలతో సానియా సందేశం
Comments
Please login to add a commentAdd a comment