టెస్ట్ సిరీస్‌లో భాగంగా జొహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. అయితే తొలి టెస్ట్‌లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికాకు క్వింటన్ డి కాక్ రూపంలో బిగ్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. డికాక్ తన టెస్ట్ రిటైర్మెంట్‌ను ఆకస్మికంగా ప్రకటించి అందరనీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ విషయంపై దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తాజాగా స్పందించాడు. డికాక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు తెలిపాడు. అయితే అతడు ఇంత త్వరగా రిటైర్ అవుతుడాని ఎవరూ ఊహించలేదని బౌచర్ పేర్కొన్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో డికాక్ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడని అతడు ప్రశంసించాడు.
"ఆ వయస్సులో డికాక్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరూ ఊహించ లేదు. ఇప్పటికీ మేము అదే షాక్‌లో ఉన్నాము. అతడి వ్యక్తిగత కారణాలను మేము గౌరవిస్తాము. మేము ఇప్పుడు సిరీస్ మధ్యలో ఉన్నాము. సిరీస్‌పై దృష్టిసారించాలి. డికాక్ స్ధానంలో వచ్చిన యువ ఆటగాళ్లపై దృష్టి పెట్టాలి. అద్భతమైన టెస్ట్ కెరీర్‌ను కలిగి ఉన్నాడు. డికాక్ స్ధానంలో కైల్ వెర్రెయిన్ జట్టులోకి రానున్నాడు. అతడు తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. అతడికి తుది జట్టులో చోటు దక్కపోయిన చాలా కాలం నుంచి జట్టుతోనే ఉన్నాడు. కాబట్టి ఆ అనుభవంతో ముందుకు సాగుతాడని భావిస్తున్నాను" అని బౌచర్ పేర్కొన్నాడు. కాగా మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0తో భారత్ ముందుంజలో ఉంది. ఇక రెండో టెస్ట్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment