దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమి చెందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఇక భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్.. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో సారథిగా జట్టును విజయపథంలో రాహుల్ నడిపించలేక పోయాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. జట్టు క్లిష్ట పరిస్ధితుల్లో ఉన్నప్పుడు రాహుల్ వ్యూహాలను రచించడంలో విఫలమయ్యాడని గవాస్కర్ తెలిపాడు.
“ఈ సిరీస్‌లో రాహుల్ కెప్టెన్‌గా పూర్తి స్ధాయిలో విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికా భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పుడల్లా రాహుల్ తన వ్యూహాలకు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేయకుండా ఆపడంలో రాహుల్ నిర్ణయాలు నాకు సంతృప్తి పరచలేదు. బహుశా అతడికి అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా అతడికి అంత అనుభవంలేక పోవడమే దీనికి కారణం కావచ్చు. ఇక బ్యాటింగ్‌లో కూడా రాహుల్ విఫలమయ్యాడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment