దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు.. 21 ఏళ్ల త‌ర్వాత! | SouthAfrica record highest successful ODI run chase in Paarl as India lose series | Sakshi
Sakshi News home page

SA vs IND: దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు.. 21 ఏళ్ల త‌ర్వాత!

Published Sat, Jan 22 2022 1:25 PM | Last Updated on Sat, Jan 22 2022 2:14 PM

SouthAfrica record highest successful ODI run chase in Paarl as India lose series - Sakshi

పార్ల్ వేదిక‌గా భారత్‌తో జ‌రిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా కైవ‌సం చేసుకుంది. కాగా భార‌త్ నిర్ధేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ప్రోటిస్ సునాయాసంగా ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు వికెట్ల ప‌డ‌గొట్ట‌డంలో విఫ‌ల‌మయ్యారు. ద‌క్షిణాఫ్రికా విజ‌యంలో ఓపెన‌ర్లు మలాన్, డికాక్ కీల‌క పాత్ర పోషించారు.

కాగా పార్ల్ వేదిక‌గా వ‌న్డే క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక పరుగుల ఛేజింగ్ కావ‌డం గ‌మ‌నార్హం. అంత‌కుముందు 2001లో శ్రీలంకపై 248 పరుగుల టార్గెట్‌ను సౌతాఫ్రికా చేధించింది. ఇక టెస్ట్, వ‌న్డే సిరీస్‌ల‌ను కోల్పోయిన టీమిండియా.. కేప్ టౌన్ వేదిక‌గా జనవరి 23న‌ జరిగే చివరి వ‌న్డేలో గెలిచి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని భావిస్తోంది.

చ‌ద‌వండి: SA vs IND: 'భార‌త్ గెల‌వాలంటే అత‌డు జ‌ట్టులోకి రావాలి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement