
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తొలి సారి దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలని అడుగు పెట్టిన టీమిండియాకు మరోసారి నిరాశే ఎదరైంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ సంచలన వాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓడపోవడం తానను చాలా బాధించందని మహ్మద్ షమీ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భారత బ్యాటింగ్ యూనిట్ పూర్తి స్ధాయిలో విఫలమయ్యందని షమీ చెప్పాడు.
"మా బ్యాటర్లు కీలక సమయాల్లో విఫలమయ్యారు. దీని కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను మా జట్టును కోల్పోయింది. ఈ సిరీస్‌లో మా బౌలింగ్ యూనిట్ చాలా బాగా రాణించింది. కాబట్టి ప్రోటిస్ జట్టుకు భారత్ గట్టి పోటీ ఇచ్చింది. డిఫెండ్ చేయడానికి మాకు ఇంకా 50-60 పరుగులు ఉండి ఉంటే, మేము ఖచ్చితంగా చివరి రెండు టెస్టుల్లో గెలిచే అవకాశం కలిగి ఉండేవాళ్లం. త్వరలోనే మా జట్టు కోలుకుంటుందని నేను భావిస్తున్నాను" షమీ పేర్కొన్నాడు. ఇక సిరీస్‌లో రాహుల్ తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేదు.
Comments
Please login to add a commentAdd a comment