టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. గత కొన్ని నెలలుగా టెస్టులు ఆడనప్పటికీ, సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో షమీ అద్భుతంగా రాణిస్తున్నాడని అతడు పేర్కొన్నాడు. షమీని జేమ్స్ ఆండర్సన్, డేల్ స్టెయిన్ వంటి దిగ్గజాలతో పోల్చాడు. "ప్రపంచంలోనే మహ్మద్ షమీ బౌలింగ్ యాక్షన్ అత్యుత్తమైనది. షమీ అద్భుతమైన లైన్-లెంగ్త్ బౌలింగ్ చేస్తాడు. నేను ఇప్పటి వరకు చాలా మంది ఆటగాళ్లను చూశాను. కానీ షమీ లాంటి మణికట్టు స్థానం ఉన్న బౌలర్‌ను చూడలేదు. ఏ బౌలరైనా ఒక్కోసారి తన మణికట్టు స్దానాన్ని కోల్పోయి బౌలింగ్ చేయడం చూసే ఉంటాం.
జేమ్స్ ఆండర్సన్, స్టెయిన్ వంటి స్టార్ బౌలర్లు కూడా మణికట్టు స్దానాన్ని కోల్పోయి పరుగులు సమర్పించుకోడవం చూశాం. కానీ షమీ ఆలా బౌలింగ్ చేయడం నేను ఎప్పడూ చూడలేదు. దక్షిణాఫ్రికా బౌలర్ల గురించి మాట్లాడుతూ.. వారు చాలా కాలంగా టెస్ట్ క్రికెట్ ఆడలేదు. లైన్ - లెంగ్త్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. టీ20 ప్రపంచకప్ తర్వాత షమీ కూడా ఆడలేదు. ఇంగ్లండ్‌తో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. కానీ అతడి బౌలింగ్‌లో ఎటువంటి మార్పు రాలేదు" అని యూట్యూబ్ ఛానల్‌లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. ఇక తొలి టెస్ట్‌లో ప్రోటాస్ బ్యాటర్లకు షమీ చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఆరు వికెట్లు షమీ పడగొట్టాడు.
చదవండి: SA Vs IND: బుమ్రాకి బౌలింగ్ ఎలా చేయాలో సూచనలు చేసిన కోహ్లి..
Comments
Please login to add a commentAdd a comment