దక్షిణాఫ్రికాతో టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయి టీమిండియా ఘోర పరాభావం పొందిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. చివరి రెండు టెస్టుల్లో ఓటమి చెంది సిరీస్‌ను అతిథ్య జట్టుకు అప్పగించింది. అదే విధంగా మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ప్రోటిస్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో వెటరన్ దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సేవలను టీమిండియా కోల్పోయిందని స్టెయిన్ పేర్కొన్నాడు.
“భారత్ ఖచ్చితంగా సర్ రవీంద్ర జడేజా లాంటి వారి సేవలను కోల్పోయింది. అతను అద్భుతమైన క్రికెటర్. అతను తన స్పిన్ మయాజాలంతో ఆటను మలుపు తిప్పగలడు. అదే విధంగా జడ్డూ.. బ్యాట్‌తో కూడా రాణించగలడు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక భారత పేస్ బౌలింగ్ గురించి మాట్లాడూతూ.. ‘‘భారత్‌కు బౌలింగ్‌లో కొంత సమస్య ఉన్న మాట వాస్తవం. బుమ్రాకి బ్యాకప్‌గా ఒక మంచి బౌలర్ కావాలి. వారికి గంటకు 140-145 కిమీ స్పీడ్‌లో బౌలింగ్ చేయగల బౌలర్ అవసరం. ఇక టెస్టు సిరీస్‌లో షమీ కూడా అద్భుతంగా రాణించాడు" అని స్టెయిన్ పేర్కొన్నాడు.
చదవండి: AUS vs SL: శ్రీలంక జట్టులో కీలక పరిణామం.. కోచ్‌గా లసిత్ మలింగ!
Comments
Please login to add a commentAdd a comment