దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గర్‌పై వేటు పడింది. తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి ఎల్గర్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తప్పించింది. అతడి స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న టెంబా బవుమాను దక్షిణాఫ్రికా క్రికెట్ నియమించింది. అయితే దక్షిణాఫ్రికా కొత్త టెస్టు సారథిగా బాధ్యతలు చేపట్టనున్న బవుమా.. టీ20 కెప్టెన్సీ మాత్రం గుడ్‌బై చెప్పనున్నాడు.
అతడు కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే సారథిగా వ్యవహరించనున్నాడు. అదే విధంగా టీ20ల్లో ప్రోటీస్ కెప్టెన్‌గా మార్‌క్రమ్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. కాగా రెడ్‌బాల్ క్రికెట్‌లో సఫారీ జట్టు కెప్టెన్ అయిన తొలి నల్ల జాతీయుడిగా బవుమా రికార్డు సృష్టించనున్నాడు. ఇక ఎల్గర్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 17 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. 17 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 7 ఓటములు, ఒకడ్రా ఉన్నాయి.
అయితే వరుసగా ఇంగ్లండ్ ఆస్ట్రేలియా సిరీస్‌లలో దక్షిణాఫ్రికా ఓటమి పాలవ్వడంతో ప్రోటీస్ సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లలో మాత్రం ఎల్గర్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఆకట్టుకోలేదు. తన స్థాయికి తగ్గట్టు రాణించడం విఫలమయ్యాడు. కాగా స్వదేశంలో వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా సెలక్షన్ కమిటీ.. ఈ కీలక మార్పు చేసింది. ఫిబ్రవరి 28 నుంచి సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
విండీస్‌తో టెస్టులకు ప్రోటీస్ జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, డీన్ ఎల్గర్, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, అన్రిచ్ నోర్ట్జే, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ,ర్యాన్ రికెల్టన్
చదవండి: IPL 2023: మూడేళ్ల తర్వాత హోంగ్రౌండ్‌లో.. ఎస్‌ఆర్‌హెచ్ షెడ్యూల్ ఇదే
Introducing the new #Proteas Test captain - Temba Bavuma 💪
— Proteas Men (@ProteasMenCSA) February 17, 2023
He remains captain of the ODI side while he has opted to relinquish the captaincy of the T20I side. #BePartOfIt pic.twitter.com/WgsbHhEgss
Comments
Please login to add a commentAdd a comment