'ధోనికి బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేశా' | Enjoyed bowling to Dhoni at Kanpur, says Rabada | Sakshi
Sakshi News home page

'ధోనికి బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేశా'

Published Mon, Oct 26 2015 3:48 PM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

'ధోనికి బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేశా'

'ధోనికి బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేశా'

ముంబై: ఐదు వన్డేల సిరీస్ ల భాగంగా కాన్పూర్ లో జరిగిన తొలి వన్డే చివరి ఓవర్ లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బౌలింగ్ చేయడాన్ని తాను బాగా ఎంజాయ్ చేశానని దక్షిణాఫ్రికా పేసర్ రబడా తెలిపాడు. ఆ ఓవర్ లో విజయానికి 11 పరుగులు చేయాల్సిన తరుణంలో  ధోని నాలుగు బంతులు ఆడి పెవిలియన్ చేరాడు.  కేవలం రబడా వేసిన ఓవర్ లో మూడు పరుగులు మాత్రమే రాబట్టిన ధోని పెవిలియన్ కు చేరాడు.  దాంతో ధోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆఖరి ఓవర్ ఫైట్ లో ధోనిపై రబడా విజయం సాధించాడంటూ మీడియా కొనియాడింది. కాగా, భారత్ తో జరిగిన మొత్తం వన్డే సిరీస్ లో ఆ ఓవర్నే తాను ఎక్కువగా ఆస్వాదించానని రబడా తెలిపాడు.

 

'నిజంగా అది చాలా ఒత్తిడితో కూడుకున్న ఓవర్. తొలుత చివరి ఓవర్ ను  నేను చేయకూడదనిఅనుకున్నా. కెప్టెన్ ఏబీ డివిలియర్స్ నాపై నమ్మకంతో ఆ ఓవర్ ను నాకే ఇచ్చాడు. ఆ ఓవర్ లో ధోనిని పూర్తిగా కట్టడి చేశా.  ధోనికి పరుగులు ఇవ్వకుండా ఆపడమే కాకుండా వికెట్ కూడా దక్కించుకున్నా. నాకు పూర్తి స్థాయిలో నమ్మకం కల్గించిన ఓవర్ అది' అని రబడా పేర్కొన్నాడు..ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్  చేసిన దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేయగా,  టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement