ఆసీస్ విజయలక్ష్యం 539
ప్రస్తుతం 169/4 దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు
పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం వైపు పయనిస్తోంది. 539 పరుగుల భారీ లక్ష్యంతో తమ రెండో ఇన్నింగ్‌స ఆరంభించిన ఆసీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 55 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోరుు 169 పరుగులు చేసింది. పేసర్ కగీసో రబడా (3/49) విజృంభణకు ఆసీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఉస్మాన్ ఖ్వాజా (120 బంతుల్లో 58 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్‌సలో తృటిలో శతకం కోల్పోరుున ఓపెనర్ డేవిడ్ వార్నర్ (33 బంతుల్లో 35; 6 ఫోర్లు)ను అద్భుత ఫీల్డింగ్‌తో బవుమా రనౌట్ చేయడం దెబ్బతీసింది.
ప్రస్తుతం క్రీజులో ఖ్వాజాతో పాటు మిషెల్ మార్ష్ (15 బ్యాటింగ్) ఉండగా చివరి రోజు సోమవారం ఆసీస్ మరో 370 పరుగులు చేయాల్సి ఉంది. అటు సఫారీల విజయానికి మరో ఆరు వికెట్లు చాలు. అంతకుముందు ప్రొటీస్ తమ రెండో ఇన్నింగ్‌సను 160.1 ఓవర్లలో 8 వికెట్లకు 540 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫిలాండర్ (143 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), డి కాక్ (100 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడారు. హాజెల్‌వుడ్, సిడిల్, మార్ష్‌లకు రెండేసి వికెట్లు దక్కారుు.