పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో పేస్ బౌలింగ్ త్రయం చెలరేగింది. రబడ (5/96), ఇన్‌గిడి (3/51), ఫిలాండర్ (2/25) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 243 పరుగులకే ఆలౌటైంది. వార్నర్ (100 బంతుల్లో 63; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. మార్క్‌రమ్ (11) ఔట్ కాగా...ఎల్గర్ (11 బ్యా టింగ్), రబడ (17 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్, బెన్‌క్రాఫ్ట్ (38) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించారు. అయితే 19 పరుగుల వ్యవధిలో ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
నాలుగో వికెట్‌కు 44 పరుగులు జోడించి స్మిత్ (25), షాన్ మార్‡్ష (24) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ స్థితిలో రబడ అద్భుత స్పెల్ ఆటను మలుపు తిప్పింది. కేవలం 18 బంతుల తేడాతో అతను ఐదు వికెట్లు తీసి కంగారూల వెన్ను వెరిచాడు. స్మిత్, షాన్ మార్‡్షలతో పాటు మిషెల్ మార్‡్ష (4), కమిన్స్ (0), స్టార్క్ (8)లను రబడ పెవిలియన్ పంపించాడు. ఒక దశలో 182/8తో ఆసీస్ ఇన్నింగ్స్ తొందరగానే ముగిసేలా కనిపించింది. అయితే వికెట్ కీపర్ టిమ్ పైన్ (36) సఫారీలను అడ్డుకున్నాడు. లయన్ (17), హాజల్‌వుడ్ (10 నాటౌట్) సహకారంతో మరిన్ని పరుగులు జోడించాడు. చివరి 2 వికెట్లకు ఆసీస్ 61 పరుగులు చేయడం విశేషం.
రబడకు 5 వికెట్లు
Published Sat, Mar 10 2018 4:48 AM | Last Updated on Sat, Mar 10 2018 4:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment