
దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో మరో శ్రీలంక ఆటగాడు చిక్కుకున్నాడు. ఫిక్సింగ్ ఆరోపణలపై లంక మాజీ పేసర్ దిల్హారా లొకుహెట్టిగేపై ఐసీసీ నిషేధం విధించింది. గత ఏడాది డిసెంబర్‌లో యూఏఈలో జరిగిన టి10 లీగ్ సందర్భంగా ఫిక్సింగ్ చోటు చేసుకుందనేది ప్రధాన ఆరోపణ.
దీనికి సంబంధించి లొకుహెట్టిగేపై ఐసీసీ మూడు వేర్వేరు అభియోగాలు నమోదు చేసింది. ఇటీవల దాదాపు ఇదే తరహాలో ఆరోపణలతో మాజీ పేసర్ నువాన్ జోయ్సాపై కూడా ఐసీసీ అభియోగాలు మోపడం గమనార్హం. శ్రీలంక తరఫున 9 వన్డేలు, 2 టి20లు ఆడిన లొకుహెట్టిగే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నా... అతను లంక బోర్డుకు సంబంధించిన వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు.