
ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు మయాంక్ యాదవ్.

లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్-2024 బరిలో దిగిన ఈ ఫాస్ట్‌బౌలర్.. తన ‘స్పీడ్’ పవరేంటో చూపించాడు.పంజాబ్ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో 150 కి.మీ. పైగా వేగంతో బంతులు విసురుతూ ‘స్పీడ్‌గన్’ను తలపించాడు. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో తొలి ఫాస్టెస్ట్(155.8 kmph) డెలివరీని నమోదు చేశాడు 21 ఏళ్ల మయాంక్ యాదవ్ ఢిల్లీలో జన్మించాడు.

దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌తో యాదవ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టిన మయాంక్.. ఆ తర్వాత లిస్ట్-ఏ, టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

గతేడాది జరిగిన దేవధర్ ట్రోఫీలో నార్త్‌జోన్‌కు ప్రాతినిథ్యం వహించిన మయాంక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 12 వికెట్లు పడగొట్టి జాయింట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో 27 మ్యాచ్‌లు ఆడిన 46 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్-2022లో లక్నో అతడిని కొనుగోలు చేసింది. అయితే.. గాయం కారణంగా ఐపీఎల్-2023 ఆడలేకపోయాడు. తాజాగా అరంగేట్రం చేసి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు

కాగా 2022లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ. 20 లక్షల కనీస ధరకు మయాంక్‌ను లక్నో కొనుగోలు చేసింది.

కానీ గాయం కారణంగా ఐపీఎల్-2023 సీజన్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో అర్పిత్ గులేరియాను తీసుకున్నారు.

అయితే ఐపీఎల్-2024 మినీ వేలంలో అతడిని లక్నో సొంతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటాడు.





