fastest
-
‘మర మేస్త్రీ’.. రెండు రోజుల్లోనే ఇల్లు కట్టేస్తుంది!!
ఇంటి నిర్మాణం అనేది సుదీర్ఘ ప్రక్రియ. శ్రామిక శక్తితో కూడుకున్నది. చాలా మంది కార్మికులు నెలలు, సంవత్సరాల తరబడి పనిచేస్తే కానీ నిర్మాణం పూర్తవ్వదు. కానీ టెక్నాలజీ సాయంతో ఇంటి నిర్మాణం రోజుల్లోనే పూర్తవుతోంది.అన్నింటా ప్రవేశిస్తున్న రోబిటిక్ టెక్నాలజీ భవన నిర్మాణ రంగంలోనూ ప్రవేశించింది. 105 అడుగుల (32 మీటర్లు) టెలిస్కోపిక్ బూమ్ ఆర్మ్ కలిగిన రోబోటిక్ ట్రక్ ఆస్ట్రేలియా నుంచి ఫ్లోరిడాకు వచ్చింది. హాడ్రియన్ ఎక్స్ గా పిలిచే ఈ ట్రక్కును రోబోటిక్స్ కంపెనీ ఎఫ్ బీఆర్ అభివృద్ధి చేసింది. ఆ యంత్రం రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఇంటిని పూర్తి చేయగలదు. గత సంవత్సరం ఇది యూఎస్ఏ ఫార్మాట్లో గంటకు 500 ఇటుకలను పేర్చి తన పనితీరు ఏంటో చూపించింది.ఇటుకలతో కూడిన ప్యాలెట్ లను లోడ్ చేశాక ఈ రోబోటిక్ వెహికల్/కన్ స్ట్రక్షన్ ఆర్మ్ తన పనిని మొదలు పెడుతుంది. ప్యాలెట్ నుంచి ఒక్కో ఇటుక ఆర్మ్ కొనకు చేరుకుంటుంది. ఇక్కడ క్విక్ డ్రై నిర్మాణ మిశ్రమం ఉంటుంది. ఇది సిమెంట్ లాగా పనిచేస్తుంది. మిశ్రమం అంటిన ఒక్కొక్క ఇటుకను రోబో ఆర్మ్ చక్కగా పేరుస్తూ నిర్మాణం పూర్తి చేస్తుంది. అధిక పొడవు కారణంగా మూడు అంతస్తుల ఎత్తుతో సైతం ఇది నిర్మాణాలను చేపడుతుంది.అమెరికాలో అతిపెద్ద కాంక్రీట్ బ్లాక్ సరఫరాదారుల్లో ఒకటైన సీఆర్‌హెచ్ పీఎల్సీ అనుబంధ సంస్థ ఎఫ్బీఆర్, సీఆర్‌హెచ్ వెంచర్స్ అమెరికాస్ ఇంక్ సంయుక్త భాగస్వామ్యంలో భాగంగా హాడ్రియన్ ఎక్స్‌ను ఫ్లోరిడాకు తీసుకొచ్చారు. ఈ రోబోటిక్ బిల్డర్ తన సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఫ్లోరిడాలోని ఫోర్ట్ మేయర్స్ లోని ఒక ఫెసిలిటీలో సైట్ అంగీకార పరీక్షను మొదట పూర్తి చేయాల్సి ఉంటుంది. అది సవ్యంగా జరిగితే, ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా హాడ్రియన్ ఎక్స్ ఐదు నుంచి 10 ఏక-అంతస్తుల గృహాలను నిర్మిస్తుంది. -
అరంగేట్రంలోనే అదుర్స్.. ఎవరీ ‘నయా స్పీడ్‌గన్’? (ఫొటోలు)
-
ప్రపంచంలోనే చైనా ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఆవిష్కరణ
బీజింగ్: ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను చైనీస్ కంపెనీలు ఆవిష్కరించాయి. ఇది సెకనుకు 1.2 టెరాబిట్ల డేటాను ప్రసారం చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ వేగం ప్రస్తుత ప్రధాన ఇంటర్నెట్ కంటే పది రెట్లు ఎక్కువని పేర్కొంది. సింఘువా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువాయ్ టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్లు దీనిని అభివృద్ధి చేశాయి. బీజింగ్-వుహాన్- గ్వాంగ్‌జౌలను అనుసంధానిస్తూ ప్రత్యేకమైన ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ సిస్టమ్ ద్వారా దాదాపు 3,000 కిలోమీటర్ల వరకు ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లు సాధారణంగా సెకనుకు కేవలం 100 గిగాబిట్ల వేగంతో పనిచేస్తాయి. అమెరికా ఐదవ తరం ఇంటర్నెట్ కూడా సెకనుకు 400 గిగాబిట్ల వేగాన్ని కలిగి ఉంది. కానీ చైనా కనిపెట్టిన ఇంటర్నెట్ సెకనుకు 1.2 టెరాబిట్ (1,200 గిగాబిట్)ల డేటాను ప్రసారం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. బీజింగ్-వుహాన్-గ్వాంగ్జౌ ప్రాజెక్టు చైనా భవిష్యత్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం. ఇది కేవలం ఒక సెకనులో 150 హై-డెఫినిషన్ ఫిల్మ్‌లకు సమానమైన డేటాను బదిలీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని హువాయ్ టెక్నాలజీస్ వైస్-ప్రెసిడెంట్ వాంగ్ లీ వివరించారు. ఇదీ చదవండి: హమాస్ ఇజ్రాయిల్ మధ్య కుదిరిన డీల్! -
16 రోజుల్లో యూరప్ చుట్టేశాడు!..అదికూడా కేవలం..
ఫొటోలో కనిపిస్తున్న ఈ సైకిల్ వీరుడి పేరు లే టిమిస్. ఇతగాడు సైకిల్ మీదనే యూరోప్ దేశాలన్నింటినీ చుట్టేశాడు. పోర్చుగల్‌లోని కాబో ద రోకా నుంచి టిమిస్ తన సాహసయాత్రను ప్రారంభించి, రష్యాలోని సైబీరియా అంచుల్లో ఉన్న ఉఫా రైల్వేస్టేషన్ వద్ద ముగించాడు. ఈ యాత్రను అతడు 16 రోజుల 10 గంటల 45 నిమిషాల్లోనే ముగించారు. ఈ యాత్రలో అతడు ప్రయాణించిన దూరం 6,366 కిలోమీటర్లు. దీంతో అతడు అత్యంత వేగంగా యూరోప్యాత్ర పూర్తిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. మొత్తం పది దేశాల మీదుగా అతడు తన యాత్ర సాగించాడు. పోర్చుగల్ నుంచి యాత్ర మొదలుపెట్టి, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, పోలండ్, లిథువేనియా, లాట్వియాల మీదుగా రష్యాకు చేరుకున్నాడు. రోజుకు సగటున 386 కిలోమీటర్ల చొప్పున, గంటకు సగటున 30 కిలోమీటర్ల వేగంతో ఈ సాహసయాత్రను విజయవంతంగా పూర్తిచేశాడు. సైక్లింగ్‌పై అమిత ఇష్టం గల టిమిస్ ఇదివరకు ఏడేళ్లపాటు వివిధ దేశాలను సైకిల్ మీదే చుట్టేశాడు. ఇటీవల యూరోప్ సైకిల్‌యాత్రను అనితరసాధ్యమైన వేగంతో అతి తక్కువ వ్యవధిలోనే పూర్తిచేయడంతో వార్తల్లోకెక్కాడు. (చదవండి: ఈ ఫోటోలో ఉన్నది కేకు అనుకుంటున్నారా? తెలిస్తే షాకవ్వుతారు!) -
వేగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి
సాక్షి, అమరావతి: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) ఏపీ చాప్టర్ చైర్మన్ లక్ష్మీప్రసాద్ చెప్పారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతంగా ఉంటే అందులో ఏపీ వాటా 4.85 శాతం ఉందని తెలిపారు. మంగళవారం (జూన్ 27) విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పోటీ–సుస్థిర ఆంధ్రప్రదేశ్ 2023–24’ నినాదంతో సీఐఐ ఏపీ చాప్టర్ పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఏపీ సులభతర వాణిజ్యంలో ప్రథమ స్థానంలో ఉండటం, సముద్ర ఆధారిత ఎగుమతులతో వేగంగా వృద్ధిని సాధిస్తోందన్నారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2025 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ ఏడాది జీడీపీ 6.5%–6.7%కి వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీ 4.0లో భాగంగా పరిశ్రమల్లో యాంత్రీకరణ, టెక్నాలజీని పెంపొందించాలని సూచించారు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు 9 అంశాల ప్రధాన అజెండాగా సీఐఐ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని, సమృద్ధి వనరులు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తితో చైనా తర్వాత భారత్ తయారీ కేంద్రంగా ఉద్భవించిందన్నారు. నైపుణ్యం, తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరులను ఉపయోగించుకుని తయారీ రంగంపై దృష్టి సారించాలని సూచించారు. పారిశ్రామిక రాయితీలు, తక్కువ రేటుకే విద్యుత్ వంటి అంశాలపై ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాలను కోరారు. గ్రీన్ బిజినెస్, గ్రీన్ ఎకానమీని సీఐఐ ప్రోత్సహిస్తోందని, పారిశ్రామిక సంస్థలు పర్యావరణ రక్షణను బాధ్యతగా తీసుకోవాలని కోరారు. సీఐఐ ఏపీ మాజీ చైర్మన్ డి.రామకృష్ణ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, ఆటోమేషన్, డిజిటలైజేషన్‌తో ఇండస్ట్రీలో ఉత్పాదకత, నాణ్యత పెరుగుతుందన్నారు. సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ భారత్‌లో మెడికల్ టూరిజానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. సీఐఐ విజయవాడ జోన్ వైస్ చైర్మన్ డీవీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. -
meesho మరో అరుదైన రికార్డు
-
గంటకు150 కిలోమీటర్లు, ఫాస్టెస్ట్ ఈ-బైక్ ఇదే! ధర ఎంతంటే?
న్యూఢిల్లీ:ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్అల్ట్రావయోలెట్ ఎఫ్77 ధరను ఎట్టకేలకు కంపెనీ ప్రకటించింది. అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ కంపెనీ అల్ట్రా వయోలెట్ ఎఫ్ 77 స్టాండర్డ్, రీకాన్ ఒరిజినల్ అనే రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. గంటలకు 150 కిలోమీటర్ల వేగంతో దేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఇక ధరల విషయానికి వస్తే... స్టాండర్డ్ ధర రూ. 3.80 లక్షల(ఎక్స్-షోరూమ్) నుండి మొదలు. రీకాన్ ధర రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. అలాగే పరిమిత ఎడిషన్‌గా 77 యూనిట్లు మాత్రమే తీసుకురానుంది. భారతీయ మార్కెట్లో, కవాసకి నింజా 400, TVS Apache RR 310, BMW G 310 R 300cc బైక్స్‌కు పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఆవిష్కరించబడిన మూడు సంవత్సరాల తర్వాత ఈ బైక్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. నవంబర్ 24 ఇండియన్ మార్కెట్లో అల్ట్రావయోలెట్ ఎఫ్ 77 బుకింగ్‌లను స్టార్ట్ చేసింది. ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్లో పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అల్ట్రావయోలెట్ ఎఫ్ 77కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే రూ. 10వేలకు బుకింగ్‌లను సాధించడం ఆసక్తికరంగా మారింది. ఎలక్ట్రిక్ బైక్ రెండు వేరియంట్లలో ఎయిర్‌స్ట్రైక్, లేజర, షాడో అనే మూడు ఆప్షన్స్‌లో లభ్యం. స్టాండర్డ్ వేరియంట్లో 7.1kWh బ్యాటరీ ప్యాక్, 85Nm శక్తిని అందించే 27kW మోటార్‌ను అందించింది. ఎలక్ట్రిక్ మోటార్ రీకాన్ వేరియంట్ల కోసం 29 kW పవర్, 90 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే 307 కిలోమీటర్ల వరకు ఈ బైక్‌పై ప్రయాణించవచ్చు. ఫ్యూచరిస్టిక్ స్పోర్ట్స్ బైక్ లుక్‌లో వచ్చిన వీటిల్లో బైక్ మోనోషాక్ ,ఇన్వర్టెడ్ ఫోర్క్ సెటప్ రియర్ అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లను కూడా అందిస్తోంది. ప్రీమియం బైక్‌లో డీఆర్ఎల్ స్ట్రిప్‌తో పాటు ఎల్ఈడీ హెడ్‌లైట్ , టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ విషయానికి వస్తే, బైక్‌లు స్మార్ట్ TFT డిస్ప్లేను అందిస్తోంది. -
రహదారుల నిర్మాణంలో ప్రపంచ రికార్డు
సాక్షి, ఢిల్లీ: వేగవంతంగా రహదారుల నిర్మాణంలో భారత్ గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21) ప్రపంచ రికార్డు సాధించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం పేర్కొన్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకూ 13,394 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరిపిందనీ, రోజూవారీ సగటు 37 కిలోమీటర్లని ఆయన వివరించారు. తాను రహదారుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి రోజుకు 2 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం మాత్రమే ఉండేదని మంత్రి పేర్కొన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు... వేగవంతమైన రహదారుల నిర్మాణంతోసహా మొత్తం మూడు అంశాల విషయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులను భారత్ నమోదుచేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ‘ఢిల్లీ-వడోదర-ముంబై ఎనిమిది వరుసల ఎక్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో భాగంగా కేవలం 24 గంటల్లో 2.5 కిలోమీటర్ల నాలుగు వరుసల కాంక్రీట్ రోడ్డును నిర్మాంచాం. అలాగే 24 గంటల్లో సోలాపూర్–బీజపూర్ మధ్య 25 కిలోమీటర్ల బిటుమెన్ రోడ్డును నిర్మించాం. ఈ అంశాలు రహదారుల నిర్మాణంలో భారత్ శక్తిసామర్థ్యాలను నిరూపిస్తున్నాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్–19 మహమ్మారి సవాళ్ల నేపథ్యంలోనూ రహదారుల మంత్రిత్వశాఖ ఈ రికార్డులను సృష్టించిందని గుర్తుచేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► 2014 ఏప్రిల్ నాటికి భారత్ రహదారుల నిర్మాణం 91,287 కిలోమీటర్లు ఉంటే, 2021 మార్చి 20 నాటికి ఈ పొడవు 1,37,625 కిలోమీటర్లకు చేరింది. అంటే గడచిన ఏడేళ్లలో రహదారుల నిర్మాణం 50 శాతంపైగా పురోగతి సాధించింది. ► 2014–15లో రహదారుల నిర్మాణానికి కేటాయింపులు రూ.33,414 కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధుల పరిమాణం 5.5 రెట్టు పెరిగి రూ.1,83,101 కోట్లకు ఎగసింది. ► 2014లో (గడ్కరీ రహదారుల మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు) దాదాపు రూ.3.85 లక్షల కోట్ల విలువైన 406 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అయితే అటు తర్వాత తీసుకున్న పలు చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి. దాదాపు రూ.3 లక్షల కోట్లు మొండిబకాయిలుగా మారకుండా బ్యాంకింగ్‌కు ప్రయోజనం చేకూరింది. ► రహదారుల ప్రాజెక్టుల్లో స్తబ్దత తొలగించడానికి అలాగే పనులు వేగవంతం కావడానికి పలు చొరవలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా రూ.40,000 కోట్ల విలువైన ప్రాజెక్టులూ రద్దయ్యాయి. వెరసి ఫాస్ట్‌ట్రాకింగ్ ప్రాతిపదికన పనులు జరిగాయి. ► భారత్‌మాల పరియోజన బృహత్తర ప్రణాళిక కింద దాదాపు రూ.5.35 లక్షల కోట్లతో 34,800 కిలోమీటర్ల నిర్మాణం కేంద్రం లక్ష్యం. ► రానున్న ఐదు సంవత్సరాల్లో భారత్ మౌలిక రంగంలో గణనీయమైన మార్పు, పురోగతి రాబోతోంది. అమెరికా, యూరోపియన్ దేశాలకు ఏ మాత్రం తక్కువకాకుండా భారత్ ఆవిర్భవిస్తోంది. అత్యాధునిక వసతులు... మరోవైపు ప్రయాణీకుల సౌకర్యం కోసం దేశంలోని జాతీయ రహదారుల వెంట ఆధునిక వసతులను కల్పించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే ఐదేళ్లలో 22 రాష్ట్రాల్లో హైవే మార్గాలలో 600కు పైగా ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రణాళికల ఉద్దేశం. వీటిలో 130 ప్రాంతాల్లో 2021–22లో అభివృద్ధి చేయాలని లకి‡్ష్యంచినట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. ఇప్పటికే 120 ప్రాంతాల్లో సౌకర్యాల అభివృద్ధికి బిడ్లను ఆహ్వానించినట్లు వివరించింది. ప్రస్తుతం ఉన్న ఎన్‌హెచ్‌లు, భవిష్యత్తులో రాబోయే రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వే మార్గాలలో ప్రతి 30–50 కి.మీ.లకు ఈ సౌకర్యాలుంటాయని పేర్కొంది. పెట్రోల్ బంక్‌లు, ఎలక్ట్రిక్ చార్జీంగ్ సదుపాయాలు, ఫుడ్ కోర్ట్లు, రిటైల్ షాపులు, బ్యాంక్ ఏటీఎంలు, మరుగుదొడ్లు, పిల్లల ఆట స్థలాలు, క్లినిక్‌లు, స్థానిక హస్తకళల కోసం విలేజ్ హట్లు, ట్రక్ మరియు ట్రెయిలర్ పార్కింగ్, ఆటో వర్క్‌షాప్స్, దాబా, ట్రక్కర్ వసతి గృహాలు వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏకు ఉన్న 3 వేల హెక్టార్ల స్థలంలో ఆయా వసతులను అభివృద్ధి చేస్తుంది. దీంతో ఆయా మార్గాలలో పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఆపరేటర్లు, రిటైలర్లకు భారీ అవకాశాలు వస్తాయని, అలాగే స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ రహదారుల అభివృద్ధి, కార్యకలాపాల కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో రాబోయే కొత్తగా నిర్మించే/విస్తరించే జాతీయ రహదారి ప్రాజెక్ట్‌ల వెంట ఆధునిక వసతులు, లాజిస్టిక్ పార్క్‌లు తప్పనిసరిగా ఉంటాయని తెలిపింది. -
దూసుకుపోయిన విటారా బ్రెజ్జా
సాక్షి, ముంబై: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతికి ఎస్యూవీ విక్రయాల్లో దూసుకుపోయింది. ఎస్యూవీ సెగ్మెంట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం విటారా బ్రెజ్జా 3 లక్షల విక్రయాలను సాధించింది. 28 నెలల కాలంలో ఈ హాట్ సేల్‌ను సాధించామని కంపెనీ మంగళవారం ప్రకటించింది. ప్రతి నెల ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో టాప్ 10లో ప్లేస్ సాధించే మారుతి ఘనతను మరింత పెంచడమే కాకుండా అతిపెద్ద కార్ల తయారీదారు మహీంద్రాను అధిగమించిదని తెలిపింది. 2018 ఆర్థిక సంవత్సరంలో మారుతి యూవీ సేల్స్ 53759 యూనిట్లతో 27.53 శాతం వృద్ధిని సాధించింది. 25.69 శాతం నుంచి 27.53 శాతానికి విక్రయాలు పుంజుకున్నాయి. మరోవైపు మహీంద్రా యూవీ విక్రయాలు (2,33,915 యూనిట్లతో) 29.20 శాతం నుంచి 25.38 శాతం క్షీణించాయి. బ్రెజ్జా టాప్వేరియింట్ విక్రయాలు 56శాతం పుంజుకున్నాయని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ ఎస్ కల్సీ వెల్లడించారు. ఈ సెగ్మెంట్లో పలుకొత్త కార్లు వచ్చినప్పటికి మార్చి 2016 లో లాంచ్ అయిన విటారా బ్రెజ్జా ఉత్తమంగా నిలిచిందన్నారు. -
బుల్లెట్ ట్రెయిన్: గంటకు 350కి.మీ
బీజింగ్: బుల్లెట్ రైళ్లకు పెట్టింది పేరైన చైనా ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే కమర్షియల్ బుల్లెట్ ట్రెయిన్‌ను గురువారం ప్రారంభించింది. ‘ఫ్యుక్సింగ్’గా పిలిచే ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. బీజింగ్-షాంఘై హై-స్పీడ్ రైల్వే లైనులో గంటకు 350 కిలోమీటర్ల వేగంతో గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 4 గంటల 28 నిమిషాల మేర తగ్గనుంది. రోజూ 5,05,000 మంది ప్రయాణించే ఈ మార్గంలో తాజాగా అందుబాటులోకి తెచ్చిన ఈ రైలుద్వారా సుమారు గంట ప్రయాణ సమయం ఆదా కానుంది. 2008లో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టిన చైనా 2011లో వాటి వేగాన్ని గణనీయంగా తగ్గించింది. ఆ ఏడాది జులైలో రెండు బుల్లెట్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 40 మంది చనిపోగా. 190 మంది గాయపడ్డారు. అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు వాటి వేగాన్ని నియంత్రించారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత అత్యధిక వేగంతో నడిచే రైలును పునఃప్రారంభించారు. ప్రస్తుతం రైలు గంటకు అత్యధికంగా 400 కి.మీల వేగంతో ప్రయాణించే వీలున్నా, 350 కి.మీలకే పరిమితం చేశారు. ఈ వేగంతో ప్రయాణిస్తే 10శాతం విద్యుత్ ఆదా అవుతుంది. సెక్యూరిటీ రీత్యా ఈ బుల్లెట్ ట్రెయిన్‌ను అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. అలాగే ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా విపత్తు ఎదురైతే రైలు దానికదే వేగాన్ని నియంత్రించుకునే ఏర్పాటు కూడా ఉంది. రిమోట్ డేటా ట్రాన్స్మిషన్ సిస్టమ్‌తో కూడిన ఈ రైలులోని అన్ని బోగీల్లో వైఫై, మొబైళ్ల ఛార్జింగ్ పోర్టులు అందుబాటులో ఉంటాయి. 21 సెప్టెంబరు నుంచి ప్రతిరోజు ఏడు రౌండ్ ట్రిప్పులు నడుస్తుంది. చైనాలో ప్రస్తుతం 20వేల కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు వ్యవస్థ ఉండగా.. 2020 నాటికి మరో 10వేల కిలోమీటర్ల మేర విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ప్రాణం తీసిన అతివేగం
– ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొని యువకుడు దుర్మరణం ఓర్వకల్లు : అతివేగం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. విధులకు ఆలస్యమైందనే ఆతృతతో వేగంగా బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన 18వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా.. శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. బేతంచెర్ల మండలం, సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన కటికె అబ్దుల్ గని కుమారుడు కటికె రహీం బాషా(22) కర్నూలు నగర శివారులోని పంచలింగాల చెక్‌పోస్టు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు విధులకు హాజరు కావాల్సి ఉంది. దీంతో సిమెంట్ నగర్ నుంచి కర్నూలుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. అప్పటికే డ్యూటీకి ఆలస్యం అయిందనే ఆతృతలో బైక్ వేగాన్ని పెంచేశాడు. మార్గమధ్యలో నన్నూరు సమీపాన గల విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా ముందుగా వెళ్తున్న ఐచర్ వాహనాన్ని బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో రహీమ్ బాషా తల పైభాగం పూర్తిగా దెబ్బతినడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చంద్రబాబు నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. సిమెంట్ నగర్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీలో వెల్డర్‌గా పనిచేస్తున్న కటికె అబ్దుల్ గనికి నలుగురు కుమారులు. మృతి చెందిన రహీమ్ బాషా చివరి వాడుగా పోలీసులు తెలిపారు. -
పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లిన బొగ్గులారీ
♦ వేంసూరులో ముగ్గురు వృద్ధుల్ని బలిగొన్న లారీ అతివేగం ♦ అరటిపండ్ల పాకలోకి దూసుకెళ్లడంతో దుర్ఘటన పింఛన్ రెన్యువల్ జిరాక్స్‌ల కోసం వచ్చిన ఓ వృద్ధురాలు..పొట్ట కూటికోసం అరటి పండ్లు అమ్ముకునే వృద్ధుడు, పండ్లు కోనేందుకు వచ్చిన మరో పెద్దాయనను లారీ మృత్యువు రూపంలో దూసుకొచ్చి బలిగొంది. ప్రమాద స్థలిలో రక్తపు మద్దలు...ఛిద్రమైన శరీరాలను చూసి..అంతా అయ్యో.. ఎంత ఘోరం జరిగిందే..అని బాధ పడ్డారు. తీరని విషాదంతో మృతుల కుటుంబాల వారు బోరున విలపించారు. తీరని విషాదం.. అనుకొని దుర్ఘటనతో ఇంటి పెద్ద దిక్కులను కోల్పోవటంతో మృతుల కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. మృతుడు ఎండీ మహబూబ్ అలీ (60)కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అరటి పండ్లు కొనేందుకు వచ్చిన కంకటి కృష్ణమూర్తి(65)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కోట నాగరత్నం(68)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఎమ్మెల్యేలు సండ్ర, జలగం ఫోన్లో పరామర్శ.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావులు ఫోన్ చేసి సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వేంసూరు: బొగ్గులోడుతో సత్తుపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ బుధవారం సాయంత్రం వేంసూరు సెంటర్లో రోడ్డు పక్కన పాకలో నిర్వహిస్తున్న అరటిపండ్ల దుకాణంలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ముగ్గురు వృద్ధులు దుర్మరణం చెందారు. అరటి పండ్లు విక్రయిస్తున్న ఎండీ.మహబూబ్ అలీ (60), కొనేందుకొచ్చిన కంకటి కృష్ణమూర్తి(65), పింఛన్ రెన్యువల్ జిరాక్స్‌ల కోసం వెళ్లి వస్తూ అక్కడ ఆగిన కోట నాగరత్నం(68) అక్కడికక్కడే చనిపోయారు. మృతులంతా వేంసూరు వాసులే. వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొని దుకాణం పక్కనే ఉన్న ఆంజనేయస్వామి గుడి ప్రాంగణం మీదుగా మరో హోటల్ వద్దకు వెళ్లి ఆగింది. ఆ సమయంలో హోటల్ మూసి ఉండడం, ఆలయం వద్ద ఎవరూ లేకపోవడంతో మరో ప్రమాదం తప్పింది. లారీ దూసుకెళ్లడంతో మహబూబ్ అలీ, నాగరత్నం శరీరాలు ఛిద్రమయ్యాయి. తీవ్రంగా గాయపడిన కంకాటి కృష్ణమూర్తిని సత్తుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. లారీ డ్రైవర్ కొత్తపల్లి నరసింహారావుకు కూడా తీవ్ర గాయాలు కావడంతో సత్తుపల్లికి తరలించారు. భీతవాహ ఘటన.. లారీ ముందు భాగం తుక్కుతుక్కుగా మారి..శిథిలాల్లో మహబూబ్అలీ మృతదేహం చిక్కుకుంది. పోలీసులు బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమై..క్రేన్ ద్వారా లారీని పైకిలేపి డెడ్‌బాడీని బయటకు తీశారు. ప్రధాన రోడ్డు వెంట..ఈ భీతవాహ సంఘటనతో వేంసూరులో విషాధ చాయాలు నెలకొన్నాయి. వందలాది మంది ప్రమాదస్థలికి చేరుకొని..అయ్యో..పాపం అంటూ బాధ పడ్డారు. సీఐ రాజిరెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ గోవిందరావు పరిశీలించారు. ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మొక్కల కోసం వెళుతున్న ఆటో బోల్తా
♦ ఇద్దరి మృతి ♦ అతివేగం, డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం శివ్వంపేట: హరితహారంలో నాటేందుకు మొ క్కలు తీసుకురావడానికి వెళుతున్న ఆటో ట్రాలీ బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ సంఘటన తూప్రాన్-నర్సాపూర్ ప్రధాన రహదారి శివ్వంపేట గ్రామశివారులో శనివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం కింద మొక్కలు నాటేందుకు మొ క్కలు అవసరమయ్యాయి. దీంతో నర్సాపూర్‌లోని నర్సరీ నుంచి మొక్కలు తీసుకువెళ్లేందుకు చిన్నశంకరంపేట నుంచి ముగ్గురు కూలీలతో అశోక్‌లేలాండ్ ఆటోట్రాలీ బయలుదేరింది. శివ్వంపేట గ్రా మం దాటగానే ఆటో అతివేగం, డ్రైవర్ అజాగ్రత్త కారణంగా అదుపు తప్పి రోడ్డు కుడివైపునకు వెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటో ట్రాలీలో కూర్చున్న కూలీలు చిన్నశంకరంపేట మండలం వె ంకటరావుపల్లెకు చెందిన కాసాల నర్సిం లు(40) ఇదే మండలం గజగట్లపల్లికి చెందిన బర్మద అంసమ్మ(43)లు తీవ్రం గా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్ లో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరిద్దరూ చికిత్స పొందుతూ మృ తిచెందారు. ఆటోలో ముందు కూర్చున్న మరో కూలి పండరి సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో బోల్తాపడగానే డ్రైవర్ పరారయ్యాడు. శివ్వంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటోలో బయలుదేరిన కూలీలు మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ప్రాణం తీసిన అతివేగం
► నలుగురి దుర్మరణం ► కల్వర్టును ఢీకొట్టిన కారు ► కొమిరెడ్డిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై దుర్ఘటన ► మృతుల్లో భార్యాభర్తలు, ఏడేళ్ల చిన్నారి, డ్రైవర్ ► మృతులు నెల్లూరు జిల్లావాసులుగా గుర్తింపు ► స్వగ్రామంలో జరిగే శుభకార్యానికి వెళ్తుండగా ఘటన శుభాకార్యానికి వెళ్తున్నామన్న సంతోషం వారిలో ఎంతసేపు నిలవలేదు. బంధువులతో రెండు రోజులు గడిపొద్దామనుకున్న వారి సంబరం తీరలేదు. త్వరగా వెళ్దామనుకున్న వారిని మృతువు కబళించేసింది. కారులో అతివేగంగా వెళ్తూ కల్వర్టును ఢీకొట్టడంతో వారంతా అక్కడికక్కడే విగతజీవులుగా మారారు. తల్లిదండ్రులతోపాటు ఓ చిన్నారి, వారి సమీప బంధువు అయిన డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. స్వగ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్తున్న ఓ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. భార్యాభర్తలతో పాటు ఏడేళ్ల పాప, వారి సమీప బంధువైన డ్రైవర్‌ను అతివేగం మృత్యువడిలోకి చేర్చింది. తొందరగా గమ్యం చేరాలన్న తపన ఆ నలుగురిని కబళించింది. వారు ప్రయాణిస్తున్న ఇండికా కారు రోడ్డు కల్వర్టును ఢీ కొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘోర దుర్ఘటన అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లి సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. - అడ్డాకుల స్వగ్రామంలో శుభకార్యం ఉందని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడుకి చెందిన కాంత చెన్నరాయుడు(35) కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి యుసుఫ్‌గూడలోని ఎస్ఆర్ రెసిడెన్సీలో నివాసముంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసే చెన్నరాయుడు తన స్వగ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరుకావాలని భార్య భారతి(30), ఏడేళ్ల పాప యశస్వినితో కలిసి సమీప బంధువైన డ్రైవర్ బాలకుమార్(27) ఇండికా కారు (ఏపీ28టీవీ 2876)లో శనివారం బయల్దేరారు. అతివేగంగా వెళ్తున్న కారు మార్గమధ్యలో కొమిరెడ్డిపల్లి దాటిన తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో హైవే పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జయి రోడ్డు కిందకు వెళ్లింది. సీటు బెల్టు పెట్టుకున్న డ్రైవర్ సీటులోనే ఇరుక్కుని ప్రాణాలు వదిలాడు. చెన్నరాయుడు, యశస్విని మృతదేహాలు కారులోంచి బయటపడ్డాయి. భారతి కారులోనే ఇరుక్కుని దుర్మరణం పాలైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు టోల్‌ప్లాజాకు సమాచారం చేరవేయడంతో పోలీసులు, ఎల్అండ్టీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని కారులో ఇరుక్కున్న వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. నలుగురి మృతదేహాలను శిక్షణ ఎస్ఐ శివకుమార్ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వనపర్తి డీఎస్పీ చెన్నయ్య, కొత్తకోట సీఐ బి.కిషన్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రమాదఘటనపై ఆరా తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆ మార్గం గుండా వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రమాద స్థలంలో ఆగి, అక్కడే ఉన్న మృతదేహాలను పరిశీలించి, మృతుల వివరాలను తెలుసుకున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. -
సైకిల్ తో భారత స్వర్ణ చతుర్భుజిని దాటాడు..!
ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లలో తన సైక్లింగ్ ను పూర్తి చేసిన ఓ యువకుడు... ఇప్పుడు తన భారత ప్రయాణంవైపు దృష్టి సారించాడు. సన్నని దారులు, ఇరుకైన ప్రాంతాల్లోని అడ్డంకులను సైతం తప్పించుకొంటూ ప్రయాణించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే కివి సైకిల్ తో... రికార్డు సాధనే ధ్యేయంగా దూసుకుపోతున్నాడు. భారత ప్రధాన నగరాల్లో పారిశ్రామిక వ్యవసాయ, సాంస్కృతిక కేంద్రాలుగా పనిచేసే రహదారి నెట్వర్క్ స్వర్ణ చతుర్భుజిని దిగ్విజయంగా దాటేశాడు. రెండేళ్ళ క్రితం 24 ఏళ్ళవయసున్న టిమ్ ఛిట్టాక్ తన ఫాస్టెట్ సైక్లింగ్ తో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ పర్యటనలు ముగించుకొని తాజాగా భారత్ లో ప్రవేశించాడు. న్యూజిల్యాండ్ వైకటో విశ్వవిద్యాలయంనుంచి లా అండ్ ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందిన ఛిటాక్... ఫిబ్రవరి 27న ఢిల్లీలో న్యూజిల్యాండ్ ఎంబసీనుంచీ సైకిల్ ప్రయాణం ప్రారంభించాడు. సగటున 250 కిలోమీటర్ల చొప్పున మొత్తం 24 రోజుల్లో 6000 కిలోమీటర్ల దూరం సైకిల్ ప్రయాణం చేస్తూ చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, జైపూర్, కాన్పూర్, పూనే, సూరత్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మొదలైన నగరాలన్నీ చుట్టేశాడు. తాను సవాలుగా స్వీకరించిన ఈ సైక్లింగ్ తనకు గొప్ప అనుభవాన్నిచ్చిందని ఛిటాక్ చెప్తున్నాడు. సైక్లింగ్ చేయడానికి జాతీయ రహదారులు కొంత సహకరించేవిగానే ఉంటాయని, ఇన్నర్, లింక్ రోడ్లలో ప్రయాణమే పెద్ద ఛాలెంజింగ్ గా ఉంటుందని చెప్పాడు. తాను ప్రయాణంలో ఉన్నపుడు కనీసం రోజుకు మూడుసార్లు షేవింగ్ చేసుకుంటానని చెప్తున్న ఛిటాక్... ఒకసారి ఓ ట్రక్ కింద పడబోయి తృటిలో తప్పించుకున్నట్లు తెలిపాడు. భారత స్వర్ణ చతుర్భుజిపై సైక్లింగ్ చేసి, గిన్నిస్ రికార్డును సాధించే ప్రయత్నంలో ఛిటాక్ రోజుకు 80 కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కినట్లు చెప్పున్నాడు. గిన్నిస్ ను సంప్రదించిన అనంతరం ప్రారంభించిన అతడి ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతమౌతుందో తెలియాల్సి ఉంది. -
ప్రాణం మీదకు తెచ్చిన సినిమా
- ఎద్దును ఢీకొట్టి పల్టీలు కొట్టిన స్కార్పియో - ఒకరి మృతి, ముగ్గురుకి తీవ్రగాయాలు - పరిస్థితి విషమం, ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు - పరకాల మండలం నడికూడ వద్ద దుర్ఘటన పరకాల : సినిమాకు పోదామనే సరదా... ప్రాణం మీదకు తెచ్చింది. అతివేగంతో రోడ్డుపక్కన ఉన్న ఎద్దును ఢీకొట్టడంతో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ముగ్గురు తీవ్ర గాయూలపాలయ్యూరు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి పరకాల మండలంలోని నడికూడలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై దీపక్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌కు చెందిన సం పంగి వెంకటేష్, పోగుల మధు, పల్లపు తిరుపతి, కంది వెంకటేష్ (డ్రైవర్), బొంత కుమార్(18), మరొకరు కలిసి రాత్రి సినిమా చూసేందుకు స్కార్పియోలో పరకాలకు బయలుదేరారు. మార్గమధ్యలో ఉన్న నడికూడ గ్రామ స్టేజీ సమీపంలోని హనుమాన్ ఆలయం ముందు ఉన్న రోడ్డు పక్కన రైతు తోర్ణం శంకర్రావు ఎద్దులను కట్టేశారు. వర్షం జల్లులు వస్తుండడంతో ఒక ఎద్దును దొడ్డిలో కట్టేయడానికి తీసుకుపోయారు. అదేదారి వెంట వస్తున్న స్కార్పియో అతివేగంగా వచ్చి ఎద్దును ఢీకొట్టిం ది. అక్కడ నుంచి ఆర్అండ్బీ రాయిని ఢీకొట్టి.. మూడు పల్టీలు కొట్టి.. చెట్టును ఢీకొట్టి ఆగింది. స్కార్పియో నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న బొంత కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎద్దు సైతం ఎక్కడే మృత్యువాత పడింది. కారులో ఉన్న సంపంగి వెంకటేష్ నడుం, కాళ్లు విరిగిపోగా, పల్లపు తిరుపతి తలకు, చేతులకు, పోగుల మధుకు తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్ కంది వెంకటేష్, మరొకరు ప్రమాదం నుంచి బయటపడి భయంతో అక్కడి నుంచి పరారయ్యారు. పరారైన వారిలో ఒక్కరు బావిలో పడ్డట్లు వదంతుల రావడంతో గ్రామస్తులు, పోలీసులు కొద్దిదూరంలో ఉన్న బావి వద్దకు వెళ్లి చూశారు. అక్కడ లేక పోవడంతో వెనక్కి వచ్చారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో పరకాలలోని సివిల్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బొంత కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో భద్రపర్చారు. సంఘటన స్థలాన్ని ఎస్సైలు దీపక్, రవీందర్ సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేక పోవడం, ఎదురుగా వాహనాలు రాక పోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. -
రహ‘దారుణాలు’
ఒంగోలు క్రైం: అతివేగం..మద్యం మత్తు..అజాగ్రత్త..కారణం ఏదైనా రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. జాతీయరహదారి, రాష్ట్ర రహదారి, ఇతర రహదారులనే తేడా లేకుండా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనుభవం లేని, లెసైన్సుల్లేని డ్రైవర్లు, వాహనాలు అజాగ్రత్తగా నడపటం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. డ్రైవింగ్ నిబంధనలు పూర్తిగా తెలుసుకోకుండా వాహనాలు నడపటం ప్రమాదాలకు తావిస్తోంది. జిల్లాలో ఏదో ఒక మూల సైకిలిస్టును ఢీ కొన్న లారీ, ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఆటో, తాగిన మైకంలో డివైడర్‌ను ఢీ కొన్న బైకు, అతివేగంగా కారు నడుపుతూ అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు, రెండు మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీ కొనటం, ఇంకా ఆటోలైతే ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో రకమైన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క అక్టోబర్ నెలలోనే జిల్లా మొత్తం మీద 106 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. -
ముగ్గురిని బలిగొన్న అతివేగం
మరొకరి పరిస్థితి విషమం మృతుల్లో నవదంపతులు నకిరేకల్ సమీపంలోదుర్ఘటన మృతులంతా ఖమ్మం జిల్లా వాసులు నకిరేకల్, న్యూస్‌లైన్ : అతివేగం మూడు నిండు ప్రాణాలను బలిగొంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కారును మితిమీరిన వేగంతో నడుపుతూ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు నవదంపతులున్నారు. ఈ విషాదకర ఘటన నకిరేకల్ బైపాస్ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన బుక్యవరపు వెంకటకృష్ణప్రసాద్(31) అతని భార్య బుక్యవరపు సౌమ్య హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటకృష్ణప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, సౌమ్య మల్లారెడ్డి కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శుభకార్యం ఉండటంతో వీరిద్దరూ స్వగ్రామం వెళ్లారు. తిరుగుప్రయాణంలో వెంకటకృష్ణప్రసాద్ బావ సత్తుపల్లికి చెందిన తిన్నవల్లి చైతన్యకుమార్-విష్ణుప్రియ దంపతులతో కలిసి కారులో ఇల్లందు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఉదయం 7 సమయంలో నకిరేకల్ బైపాస్ వద్దకు రాగానే కారు నడుపుతున్న వెంకటకృష్ణప్రసాద్ అతివేగంగా ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు ముందు సీట్లో కూర్చున్న సౌమ్య అక్కడికక్కడే మృతి చెందగా వెంకటకృష్ణప్రసాద్, అతని బావ తిన్నవల్లి చైతన్యకుమార్(31), విష్ణుప్రియలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిం చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ కామినేని వైద్యశాలకు తరలించగా చికిత్స పొందు తూ వెంకటకృష్ణప్రసాద్, చైతన్యకుమార్‌లు మృతి చెందారు. విష్ణుప్రియ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు ప్రమాద స్థలిని నకిరేకల్ సీఐ నాగేశ్వర్, ఎస్ఐ ప్రసాద్‌రావులు సందర్శించారు. సౌమ్య మృతదేహానికి నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. నాలుగు నెలల క్రితమే వివాహం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వెంకటకృష్ణప్రసాద్‌కు కరీంనగర్‌కు చెందిన సౌమ్యతో నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. శుభకార్యం నిమిత్తం ఇల్లందుకు వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు వారిని కబళించింది. వారిద్దరి మృతితో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.