న్యూఢిల్లీ:ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్అల్ట్రావయోలెట్ ఎఫ్77 ధరను ఎట్టకేలకు కంపెనీ ప్రకటించింది. అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ కంపెనీ అల్ట్రా వయోలెట్ ఎఫ్ 77 స్టాండర్డ్, రీకాన్ ఒరిజినల్ అనే రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. గంటలకు 150 కిలోమీటర్ల వేగంతో దేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్ ఇదేనని కంపెనీ చెబుతోంది.
ఇక ధరల విషయానికి వస్తే... స్టాండర్డ్ ధర రూ. 3.80 లక్షల(ఎక్స్-షోరూమ్) నుండి మొదలు. రీకాన్ ధర రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. అలాగే పరిమిత ఎడిషన్‌గా 77 యూనిట్లు మాత్రమే తీసుకురానుంది. భారతీయ మార్కెట్లో, కవాసకి నింజా 400, TVS Apache RR 310, BMW G 310 R 300cc బైక్స్‌కు పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కోవిడ్ కారణంగా ఆవిష్కరించబడిన మూడు సంవత్సరాల తర్వాత ఈ బైక్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. నవంబర్ 24 ఇండియన్ మార్కెట్లో అల్ట్రావయోలెట్ ఎఫ్ 77 బుకింగ్‌లను స్టార్ట్ చేసింది. ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లో పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అల్ట్రావయోలెట్ ఎఫ్ 77కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే రూ. 10వేలకు బుకింగ్‌లను సాధించడం ఆసక్తికరంగా మారింది.
ఎలక్ట్రిక్ బైక్ రెండు వేరియంట్‌లలో ఎయిర్‌స్ట్రైక్, లేజర, షాడో అనే మూడు ఆప్షన్స్‌లో లభ్యం. స్టాండర్డ్ వేరియంట్‌లో 7.1kWh బ్యాటరీ ప్యాక్, 85Nm శక్తిని అందించే 27kW మోటార్‌ను అందించింది. ఎలక్ట్రిక్ మోటార్ రీకాన్ వేరియంట్‌ల కోసం 29 kW పవర్, 90 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే 307 కిలోమీటర్ల వరకు ఈ బైక్‍పై ప్రయాణించవచ్చు.
ఫ్యూచరిస్టిక్ స్పోర్ట్స్ బైక్ లుక్‌లో వచ్చిన వీటిల్లో బైక్ మోనోషాక్ ,ఇన్వర్టెడ్ ఫోర్క్ సెటప్ రియర్ అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లను కూడా అందిస్తోంది. ప్రీమియం బైక్‌లో డీఆర్‌ఎల్ స్ట్రిప్‌తో పాటు ఎల్‌ఈడీ హెడ్‌లైట్ , టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ విషయానికి వస్తే, బైక్‌లు స్మార్ట్ TFT డిస్‌ప్లేను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment