Automotive
-
బీఎండబ్ల్యూ, టాటా టెక్ జత
న్యూఢిల్లీ: ఆటో రంగ జర్మన్ దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్, దేశీ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ సర్విసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ చేతులు కలపనున్నాయి. తద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ అభివృద్ధిసహా.. దేశీయంగా ఐటీ డెవలప్మెంట్ హబ్‌కు తెరతీయనున్నట్లు సంయుక్తంగా వెల్లడించాయి. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశాయి. ప్రణాళికల్లో భాగంగా పుణే, బెంగళూరు, చెన్నైలలో ఐటీ అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నాయి. బెంగళూరు, పుణేలలో ప్రధాన అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. చెన్నైలో ఐటీ సొల్యూషన్ల బిజినెస్‌పై దృష్టి కేంద్రీకరించనున్నట్లు పేర్కొన్నాయి. అధీకృత సంస్థల అనుమతుల ఆధారంగా భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనున్నట్లు వెల్లడించాయి. జేవీతో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్‌ను అందించనున్నాయి. ఎస్‌డీవీ సొల్యూషన్లు జేవీ ప్రధానంగా బీఎండబ్ల్యూ గ్రూప్ ప్రీమియం వాహనాలకు సాఫ్ట్వేర్ ఆధారిత వాహన(ఎస్‌డీవీ) సొల్యూషన్లు సమకూర్చనుంది. అంతేకాకుండా ఐటీ బిజినెస్‌కు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్లు సైతం అందించనుంది. సుమారు 100 ఇన్నోవేటర్లతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంయుక్త ప్రకటనలో బీఎండబ్ల్యూ, టాటా టెక్ వెల్లడించాయి. రానున్న కాలంలో వీలైనంత త్వరాగా ఈ సంఖ్యను నాలుగంకెలకు పెంచనున్నట్లు తెలియజేశాయి. సాఫ్ట్వేర్, ఐటీ కేంద్రాల బీఎండబ్ల్యూ గ్లోబల్ నెట్‌వర్క్‌లో జేవీ భాగంకానున్నట్లు పేర్కొన్నాయి. బీఎండబ్ల్యూ గ్రూప్‌తో చేతులు కలపడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, డిజిటల్ ఇంజ నీరింగ్‌లో కస్టమర్లకు అత్యున్నత సొల్యూషన్లు అందించేందుకు కట్టుబడి ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నట్లు టాటా టెక్ సీఈవో, ఎండీ వారెన్ హారిస్ పేర్కొన్నారు. టాటా టెక్‌తో భాగస్వామ్యం ఎస్‌డీవీ విభాగంలో పురోగతికి సహకరించనున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ గ్రోట్ తెలియజేశారు. -
2025 కల్లా గిగా ఫ్యాక్టరీ: అమర రాజా బ్యాటరీస్
ముంబై: ఆటోమోటివ్ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ 2025 ఆఖరు కల్లా తమ తొలి గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇలాంటి వాటికి అధునాతన టెక్నాలజీ, భారీగా పెట్టుబడులు అవసరమవుతాయని సంస్థ ప్రెసిడెంట్ విజయానంద్ సముద్రాల తెలిపారు. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) నిర్వహించిన ఇండియా బ్యాటరీ తయారీ, సరఫరా వ్యవస్థ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు. తొలి విడత 24 నెలల్లోగానే పూర్తి కాగలదని, దాన్ని బట్టి చూస్తే వచ్చే సంవత్సరం (2025) ముగిసేలోగా ఫ్యాక్టరీలో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని విజయానంద్ పేర్కొన్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో గిగా ఫ్యాక్టరీకి కంపెనీ గతేడాది మేలో శంకుస్థాపన చేసింది. ఈ ప్యాక్టరీలో లిథియం సెల్, బ్యాటరీ ప్యాక్‌లను తయారు చేయనుంది. -
సూపర్ స్పోర్ట్స్ కార్లకు డిమాండ్
ముంబై: సూపర్ స్పోర్ట్స్ కార్ల విభాగం భారత్‌లో ఈ ఏడాది 30 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెక్లారెన్ ఆటోమోటివ్ శుక్రవారం తెలిపింది. సరఫరా సమస్యల కారణంగా గత సంవత్సరం నష్టపోయిన తర్వాత మెక్లారెన్ ఇక్కడి వినియోగదారులకు ఈ ఏడాది దాదాపు 20కిపైగా కార్లను డెలివరీ చేయాలని భావిస్తోంది. 2022 నవంబర్‌లో భారత మార్కెట్లోకి కంపెనీ ప్రవేశించింది. ‘రూ.4–5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఈ కార్ల సెగ్మెంట్ గతేడాది కూడా ఆరోగ్యకర వృద్ధిని సాధించింది. కోవిడ్ తర్వాత పరిమాణం పరంగా 2021 ఒక రకమైన ప్రారంభ సంవత్సరం. 2022 బాగుంది. గతేడాది మెరుగ్గా ఉంది. 2024 ఇంకా మెరుగ్గా ఉంటుంది. గత సంవత్సరం అమ్మకాలలో స్వల్ప తగ్గుదల ఉంది. ఒక మోడల్ నుండి మరొక మోడల్‌కు మారడం వల్ల ఉత్పత్తిలో కొన్ని నెలల గ్యాప్ ఉంది. ఫలితంగా 2024లో మేము దాదాపు 20 యూనిట్లను డెలివరీ చేయాలని భావిస్తున్నాం’ అని ఇని్ఫనిటీ కార్స్ సీఎండీ లలిత్ చౌదరి తెలిపారు. భారత్‌లో మెక్లారెన్ ఆటోమోటివ్ అధికారిక డీలర్‌గా ఇని్ఫనిటీ కార్స్ వ్యవహరిస్తోంది. ప్రస్తుతం భారత రోడ్లపై దాదాపు 30 మెక్లారెన్ కార్లు పరుగెడుతున్నాయి. జీటీ, ఆర్చురా హైబ్రిడ్ మోడల్‌ను కంపెనీ ఇప్పటికే భారత్‌లో అందుబాటులోకి తెచి్చంది. కాగా, మెక్లారెన్ తన సూపర్ స్పోర్ట్స్ కారు 750ఎస్ మోడల్‌ను రూ.5.91 కోట్ల ధరతో ఆవిష్కరించింది. యూకేలోని యార్క్‌షైర్‌లో ఉన్న మెక్లారెన్ కాంపోజిట్స్ టెక్నాలజీ సెంటర్లో ఈ కారు తయారైంది. పూర్తిగా తయారైన కార్లనే భారత్‌కు దిగుమతి చేస్తున్నారు. కంపెనీ నుండి అత్యంత తేలికైన, శక్తివంతమైన మోడల్ ఇదే. 7.2 సెకన్లలో గంటకు 0–200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. -
ఆటో, ఐటీకి కేరాఫ్‌గా తెలంగాణ
హఫీజ్‌పేట్ (హైదరాబాద్): దేశంలో ఆటో, ఐటీకి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్‌గా మారిందని.. రాష్ట్రంలో ఆటోమోటివ్, మొబిలిటీ పరిశ్రమను మరింత బలోపేతం చేస్తామని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఉత్తమ మానవ వనరులు, నైపుణ్యానికి హైదరాబాద్ నగరం ఎంతో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో పలు సంస్థల కార్యాలయా లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు. ప్రపంచంలోని ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటిగా, మొబిలిటీ ప్రొవైడర్‌గా గుర్తింపు పొందిన స్టెల్లాంటిస్ డిజిటల్ హబ్ కార్యాలయాన్ని హైదరా బాద్‌లో ప్రారంభించడం ఒక మైలురాయి అని కేటీఆర్ పేర్కొన్నారు. సుస్థిర మొబిలి టీకి మాత్రమే భవిష్యత్తు ఉందని చెప్పారు. మొబిలిటీలో తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇక్కడే.. మంత్రి కేటీఆర్ సమక్షంలో టీ–హబ్ ప్రాంగణంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, హ్యుందాయ్ మొబిన్ ఇన్, బిట్స్ హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వ్యూహాత్మక సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మొబిలిటీ రంగంలో దేశంలోనే తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు హైదరాబాద్ కేంద్రంగా మారనుందని చెప్పారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో కోర్సుల రూపకల్పన, పరిశోధన, అభివృద్ధి, విద్యార్థులకు శిక్షణలో ఈ భాగస్వామ్యం ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ నానక్‌రాంగూడలో రైట్ సాఫ్ట్వేర్ సంస్థ కొత్త డెవలప్మెంట్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఐటీ రంగంలో హైదరాబాద్ ఎంతో ప్రగతి సాధించిందని.. రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మారిందని చెప్పారు. 2014లో 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. ఇప్పుడు 9.05 లక్షల మందికి చేరారని, ఐటీ ఎగుమతులు రూ.2.41 లక్షలకు పెరిగాయని వివరించారు. -
ఐపీవోకి ఆస్క్ ఆటోమోటివ్
న్యూఢిల్లీ: బ్రేక్-షూ, అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్స్ తయారీ సంస్థ ఆస్క్ ఆటోమోటివ్ .. పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా నిధులను సమీకరించనుంది. దీనికి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. వీటి ప్రకారం ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు కుల్దీప్ సింగ్ రాఠీ, విజయ్ రాఠీ 2,95,71,390 షేర్లను విక్రయించనున్నారు. ప్రస్తుతం కుల్దీప్‌నకు 41.33 శాతం, విజయ్‌కి 32.3 శాతం వాటాలు ఉన్నాయి. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ విధానంలోనే ఉంటుంద కాబట్టి ఐపీవో నిధులన్నీ ప్రమోటర్లకే లభించ నున్నాయి. కంపెనీకి చెందవు. ఆస్క్ ఆటోమోటివ్కి టీవీఎస్ మోటర్ కంపెనీ, హీరో మోటోకార్ప్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, బజాజ్ ఆటో వంటివి క్లయింట్లుగా ఉన్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ వాటా దాదాపు 50 శాతంగా నమోదైంది. (SaradhaChitFundScam: పెట్టుబడిదారుల సొమ్ము రికవరీకి శారదా ఆస్తుల వేలం) గురుగ్రామ్‌కు చెందిన ఆస్క్ ఆటోమోటివ్ 2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు 50 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలో ద్విచక్ర వాహనాల కోసం బ్రేక్-షూ, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్‌ల అతిపెద్ద తయారీదారులలో ఒకటిగా ఉంది. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, బిజినెస్ వ న్యూస్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
గంటకు150 కిలోమీటర్లు, ఫాస్టెస్ట్ ఈ-బైక్ ఇదే! ధర ఎంతంటే?
న్యూఢిల్లీ:ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్అల్ట్రావయోలెట్ ఎఫ్77 ధరను ఎట్టకేలకు కంపెనీ ప్రకటించింది. అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ కంపెనీ అల్ట్రా వయోలెట్ ఎఫ్ 77 స్టాండర్డ్, రీకాన్ ఒరిజినల్ అనే రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. గంటలకు 150 కిలోమీటర్ల వేగంతో దేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఇక ధరల విషయానికి వస్తే... స్టాండర్డ్ ధర రూ. 3.80 లక్షల(ఎక్స్-షోరూమ్) నుండి మొదలు. రీకాన్ ధర రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. అలాగే పరిమిత ఎడిషన్‌గా 77 యూనిట్లు మాత్రమే తీసుకురానుంది. భారతీయ మార్కెట్లో, కవాసకి నింజా 400, TVS Apache RR 310, BMW G 310 R 300cc బైక్స్‌కు పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఆవిష్కరించబడిన మూడు సంవత్సరాల తర్వాత ఈ బైక్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. నవంబర్ 24 ఇండియన్ మార్కెట్లో అల్ట్రావయోలెట్ ఎఫ్ 77 బుకింగ్‌లను స్టార్ట్ చేసింది. ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్లో పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అల్ట్రావయోలెట్ ఎఫ్ 77కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే రూ. 10వేలకు బుకింగ్‌లను సాధించడం ఆసక్తికరంగా మారింది. ఎలక్ట్రిక్ బైక్ రెండు వేరియంట్లలో ఎయిర్‌స్ట్రైక్, లేజర, షాడో అనే మూడు ఆప్షన్స్‌లో లభ్యం. స్టాండర్డ్ వేరియంట్లో 7.1kWh బ్యాటరీ ప్యాక్, 85Nm శక్తిని అందించే 27kW మోటార్‌ను అందించింది. ఎలక్ట్రిక్ మోటార్ రీకాన్ వేరియంట్ల కోసం 29 kW పవర్, 90 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే 307 కిలోమీటర్ల వరకు ఈ బైక్‌పై ప్రయాణించవచ్చు. ఫ్యూచరిస్టిక్ స్పోర్ట్స్ బైక్ లుక్‌లో వచ్చిన వీటిల్లో బైక్ మోనోషాక్ ,ఇన్వర్టెడ్ ఫోర్క్ సెటప్ రియర్ అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లను కూడా అందిస్తోంది. ప్రీమియం బైక్‌లో డీఆర్ఎల్ స్ట్రిప్‌తో పాటు ఎల్ఈడీ హెడ్‌లైట్ , టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ విషయానికి వస్తే, బైక్‌లు స్మార్ట్ TFT డిస్ప్లేను అందిస్తోంది. -
ఐపీవోకు డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్
న్యూఢిల్లీ: ఆటో రంగ విడిభాగాల కంపెనీ డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్ర ణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 31.46 లక్షల షేర్లను సైతం కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను తయారీకి అవసరమైన పరికరాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తదితరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. సిస్టమ్ లెవల్ ట్రాన్స్ఫర్ కేస్, టార్క్ కప్లర్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్స్ తదితర విడిభాగాలను కంపెనీ రూపొందిస్తోంది. ఆటో రంగ దిగ్గజాలు ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ తదితరాలు కంపెనీ కస్టమర్లుగా ఉన్నాయి. చదవండి: ట్రెండ్ మారింది.. ఆ సెగ్మెంట్ టీవీల సేల్స్ మూడింతలు! -
టాప్ గేర్‌లో వాహన విక్రయాలు!
ముంబై: రెండో దశ కరోనా వ్యాప్తితో కుదేలైన వాహన రంగం జూన్ మాసంలో కోలుకుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను సడలించడంతో ఈ నెలలో వాహన విక్రయాలు గణనీయంగా పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, హోండా వంటి ప్రధాన ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. మారుతీ సుజుకీ జూన్‌లో మొత్తం 1,47,368 యూనిట్లను విక్రయించింది. మే నెలలో కేవలం 46,555 యూనిట్లతో పోలిస్తే 217% పెరిగింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా జూన్ 54,474 యూనిట్లు విక్రయించింది. అంతకు ముందు మే నెలలో 30,703 వాహనాలను అమ్మింది. మే నెలలో 15,181 యూనిట్లు అమ్మిన టాటా మోటర్స్.., జూన్‌లో 59% వృద్ధిని సాధించి 24,110 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం 32,964 వాహనాలను అమ్మగా, ప్యాసింజర్ వాహనాలు 16,913 యూనిట్లతో రెట్టింపు వృద్ధి నమోదు చేసింది. కియా మోటార్ ఇండియా 36% వృద్ధిని సాధించి మొత్తం 15,015 యూనిట్లను అమ్మింది. మేలో మొత్తం విక్రయాలు 11,050 యూనిట్లుగా ఉన్నాయి. లాక్డౌన్ సడలింపు కారణంగా యుటిలిటీ వాహన విభాగంలో బలమైన వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ధరలు పెరగడం, సెమికండెక్టర్ల కొరతతో ప్యాసింజర్ పరిశ్రమలో అనిశ్చితి కొనసాగుతోంది. అయితే డిమాండ్ దృష్ట్యా మెరుగైన రికవరీ కనిపిస్తుంది’’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన విభాగం ప్రెసిడెంట్ శైలేజ్ చంద్ర తెలిపారు. -
ఫోక్స్‌వాగన్ మాజీ చైర్మన్ కన్నుమూత
బెర్లిన్: ఫోక్స్‌వాగన్‌ను ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజంగా మార్చడానికి ఎంతో కృషి చేసిన, మాజీ చైర్మన్ ఫెర్డినార్డ్ పీచ్(82) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఫోక్స్‌వాగన్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం అధికారికంగా ధృవీకరించారు. ప్రపంచంలోనే అదిపెద్ద కార్ల తయారీదారు, విలాసవంతమైన, ఖరీదైన కార్లకు పెట్టింది పేరైన ఫోక్స్ వ్యాగన్. రెండు దశాబ్దాల పాటు జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజ కంపెనీలో అనేక పదవులు చేపట్టి విశిష్ట సేవలందించారు. కంపెనీ అభివృద్ధికి ఎనలేని కృషిచేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగేలా చేసిన ఘనత ఆయన సొంతం. పీచ్ కెరీర్ విషయానికి వస్తే ప్రఖ్యాత కార్ల తయారీదారు ఫెర్డినార్డ్ పోర్షే మనమడైన పీచ్... ప్రఖ్యాత కార్ల కంపెనీ ఆడిలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఫోక్స్వాగన్లో 1993 లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2002 లో చైర్మన్‌గా ఎదిగారు. ఆ తర్వాత లంబోర్ఘిని, బెంట్లే లాంటి బ్రాండ్లను కలుపుకొని ఫోక్స్‌వాగన్ కంపెనీని ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజంగా తయారు చేశారు. ప్రస్తుతం పీచ్ కుటుంబం వాటాలు ఫోక్స్‌వాగన్ గ్రూపులో 53 శాతంగా ఉన్నాయి. సీఈఓ మార్టిన్ వింటర్కాన్ విషయంలో వివాదం కారణంగా పీచ్ 2015 ఏప్రియల్ లో చైర్మన్ పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కంపెనీ బోర్డ్ విశ్వాసం కోల్పొయినందునే పీచ్ తన పదవి నుంచి తప్పుకున్నారని ఫోక్స్‌వాగన్ కంపెనీ ప్రకటించింది. అయితే పీచ్ తప్పుకున్న కొన్ని రోజులకే ఫోక్స్‌వాగన్ వివాదాలు చుట్టుముట్టాయి. డీజిల్ ఉద్గారాల స్కాంలో కంపెనీ చిక్కుకుంది. ఈ వివాదం నేటీకీ కొనసాగుతున్నా ఇప్పటీకీ ఫోక్స్‌వాగన్ కార్ల అమ్మకం విషయంలో ప్రధమ స్ధానంలోనే కొనసాగుతోంది. అయితే కంపెనీని ఈ స్థాయికి తీసురావడంలో కీలక భూమిక పోషించిన పీచ్ మృతి పట్ల కంపెనీకి చెందిన పలువురు ఆటో పరిశ్రమ పెద్దలు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆటోమోటివ్ పరిశ్రమలో నాణ్యత, పర్ఫెక్షన్ను తీసుకురావడానికి ఫెర్డినాండ్ పిచ్.. ఎంతో కృషిచేశారని కంపెనీ ప్రస్తుత సీఈఓ హెర్బర్ట్ డైస్ అన్నారు. పీచ్ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చని, ఆయన చేసిన కృషి పట్ల తనకెంతో గౌరవం ఉందని తెలిపాడు. -
అయిదు నిమిషాల్లోనే బ్యాటరీ చార్జింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఆటో మొబైల్ రంగంలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్’ హాట్ టాపిక్‌గా మారింది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్న కంపెనీలు అధిక సామర్థ్యమున్న బ్యాటరీల తయారీపై ఫోకస్ చేశాయి. ఈవీ టెక్నాలజీలో ఉన్న సింగపూర్ సంస్థ షాడో గ్రూప్ అనుబంధ కంపెనీ అయిన బెంగళూరుకు చెందిన అదరిన్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఓ అడుగు ముందుకేసి అల్ట్రా కెపాసిటర్ బ్యాటరీని అభివృద్ధి చేసింది. అయిదు నిమిషాల్లోనే చార్జింగ్ పూర్తి అవడం దీని ప్రత్యేకత. ఎరిక్ పేరుతో రూపొందించిన త్రిచక్ర వాహనానికై ఈ బ్యాటరీని తయారు చేశారు. బ్యాటరీని ఒకసారి చార్జింగ్ చేస్తే వాహనం 70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ ఈ టెక్నాలజీని ధ్రువీకరించింది. అంతేకాదు 10 ఏళ్లపాటు మన్నుతుందని స్పష్టం చేసిందని షాడో గ్రూప్ కో–సీఈవో సౌరభ్ మార్కండేయ సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధికి వెల్లడించారు. డీజిల్ వాహనంతో పోలిస్తే ఖర్చు 25–30 శాతం తగ్గుతుందని చెప్పారు. గంటకు 50 కిలోమీటర్ల వేగం.. ఎరిక్ బ్రాండ్‌లో ప్యాసింజర్ వేరియంట్‌తోపాటు కార్గో రకం కూడా రూపొందించారు. ప్యాసింజర్ వాహనం గంటకు 50 కిలోమీటర్లు, కార్గో మోడల్ 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కార్గోలో 550 కిలోల సరుకు రవాణా చేయవచ్చు. రెండు రకాల బ్యాటరీలను అందుబాటులోకి తెచ్చామని సౌరభ్ మార్కండేయ తెలిపారు. ‘అల్ట్రా కెపాసిటర్ బ్యాటరీ జీవిత కాలం 10 ఏళ్లు. ధర రూ.4 లక్షలు. లిథియం అయాన్ బ్యాటరీ జీవిత కాలం రెండున్నరేళ్లు. చార్జింగ్కు 8 గంటలు పడుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 80–100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ధర రూ. లక్ష ఉంది. అల్ట్రా కెపాసిటర్ అభివృద్ధికి రెండేళ్లు పట్టింది. ఈ మోడల్ వాహనాలు ఇండోనేషియాకు ఎగుమతి చేయనున్నాం. భారత్‌లో క్యాబ్ అగ్రిగేటర్లు, లాజిస్టిక్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. 2019 అక్టోబరు నుంచి మార్కెట్లో వాహనం అందుబాటులో ఉంటుంది’ అని చెప్పారు. పుణేలో ఉన్న ప్లాంటు కోసం షాడో గ్రూప్ రూ.70 కోట్లు వెచ్చిస్తోంది. సౌరభ్ మార్కండేయ -
జతకట్టిన ఆటో, టెలి దిగ్గజాలు
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందంటే.. మొన్నమొన్ననే వచ్చిన 3జీ సేవలకు కాలం చెల్లిపోయింది.. 4జీ సర్వీసులు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. 4జీ కంటే వేగవంతమైన సర్వీసులు 5జీలను అభివృద్ధి చేసేందుకు టెక్నాలజీ సంస్థలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించేశాయి.. దీంతో 4జీలకు డిమాండ్ పడిపోయి, వచ్చే కాలమంతా 5జీ సర్వీసులు మార్కెట్‌ను మరింత ఊపేయనున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే కాలంలో మొబైల్ కమ్యూనికేషన్లో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెల్లాయించనున్న 5జీ సేవలపై ముందస్తుగా ఇటు టెలికమ్యూనికేషన్ దిగ్గజాలు, అటు ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ చేతులు కలిపాయి. ఆడీ, బీఎమ్‌డబ్ల్యూ, డైమ్లర్, ఎరిసన్, హ్యువాయ్, ఇంటెల్, నోకియా, క్వాల్కామ్ సంస్థలు ఒకటిగా ఏర్పడి '5జీ ఆటోమోటివ్ అసోసియేషన్'ను ఏర్పాటుచేసుకున్నాయి. వచ్చే దశాబ్దంలో మార్కెట్‌కు సవాలుగా నిలువనున్న 5జీ సేవలు డిజిటలైజేషన్‌కు, స్వయంచోధక డ్రైవింగ్‌కు ఉపయోగపడేలా ఈ అసోసియేషన్ పనిచేయనుంది. టెక్నికల్, రెగ్యులేటరీ సమస్యలను ఈ అసోసియేషన్ గుర్తిస్తూ, తదుపరి తరం మొబైల్ నెట్వర్స్ కనెక్షన్, రహదారి భద్రతా కొరకు సమాచార పరిష్కారాలను ఈ అసోసియేషన్ అభివృద్ధి చేయనుంది. సాంకేతిక అవసరాలు, అమలు చేసే వ్యూహాలపై ఈ అసోసియేషన్ పనిచేయనుంది. ప్రతి వాహనానికి అవసరమయ్యే వైర్లెస్ కనెక్టివిటీ, సెక్యురిటీ, భద్రత, క్లౌడ్ ఆర్కిటెక్చర్స్ వంటి సాంకేతిక అవసరాలను ఈ అసోసియేషన్ గుర్తించనుంది. . -
వాహన రంగ ఉక్కు అవసరాలపై దృష్టి: గెర్డావ్
హైదరాబాద్: వాహన, రైల్వే, రక్షణ రంగ సంస్థలకు అవసరమైన ఉక్కు ఉత్పత్తుల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు గెర్డావ్ ఇండియా తెలిపింది. ఇందులో భాగంగా తాడిపత్రిలోని తమ ఉక్కు కర్మాగారాన్ని మరింతగా విస్తరిస్తున్నట్లు, త్వరలోనే కోక్ ఓవెన్లను కూడా ప్రారంభిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల టన్నులుగా ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో దాదాపు 2,000 మంది పనిచేస్తున్నారని, ఇప్పటిదాకా సుమారు రూ. 2,700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశామని గెర్డావ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.