![Automotive Component Divgi Torqtransfer Files Ipo Papers To Sebi - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/23/ipo.jpg.webp?itok=ZFQeFZX_)
న్యూఢిల్లీ: ఆటో రంగ విడిభాగాల కంపెనీ డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్ర ణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 31.46 లక్షల షేర్లను సైతం కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.
ఈక్విటీ జారీ నిధులను తయారీకి అవసరమైన పరికరాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తదితరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. సిస్టమ్ లెవల్ ట్రాన్స్‌ఫర్ కేస్, టార్క్ కప్లర్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సొల్యూషన్స్ తదితర విడిభాగాలను కంపెనీ రూపొందిస్తోంది. ఆటో రంగ దిగ్గజాలు ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ తదితరాలు కంపెనీ కస్టమర్లుగా ఉన్నాయి.
చదవండి: ట్రెండ్ మారింది.. ఆ సెగ్మెంట్ టీవీల సేల్స్ మూడింతలు!
Comments
Please login to add a commentAdd a comment