న్యూఢిల్లీ: బ్రేక్-షూ, అడ్వాన్స్‌డ్ బ్రేకింగ్ సిస్టమ్స్ తయారీ సంస్థ ఆస్క్ ఆటోమోటివ్ .. పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా నిధులను సమీకరించనుంది. దీనికి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. వీటి ప్రకారం ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు కుల్‌దీప్ సింగ్ రాఠీ, విజయ్ రాఠీ 2,95,71,390 షేర్లను విక్రయించనున్నారు. ప్రస్తుతం కుల్‌దీప్‌నకు 41.33 శాతం, విజయ్‌కి 32.3 శాతం వాటాలు ఉన్నాయి.
ఇష్యూ పూర్తిగా ఓఎఫ్‌ఎస్ విధానంలోనే ఉంటుంద కాబట్టి ఐపీవో నిధులన్నీ ప్రమోటర్లకే లభించ నున్నాయి. కంపెనీకి చెందవు. ఆస్క్ ఆటోమోటివ్‌కి టీవీఎస్ మోటర్ కంపెనీ, హీరో మోటోకార్ప్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, బజాజ్ ఆటో వంటివి క్లయింట్లుగా ఉన్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ వాటా దాదాపు 50 శాతంగా నమోదైంది. (SaradhaChitFundScam: పెట్టుబడిదారుల సొమ్ము రికవరీకి శారదా ఆస్తుల వేలం)
గురుగ్రామ్‌కు చెందిన ఆస్క్ ఆటోమోటివ్ 2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు 50 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలో ద్విచక్ర వాహనాల కోసం బ్రేక్-షూ, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్‌ల అతిపెద్ద తయారీదారులలో ఒకటిగా ఉంది. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్‌ఎఫ్ సక్సెస్ జర్నీ)
మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, బిజినెస్ వ న్యూస్ కోసం చదవండి: సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment