జతకట్టిన ఆటో, టెలి దిగ్గజాలు
జతకట్టిన ఆటో, టెలి దిగ్గజాలు
Published Wed, Sep 28 2016 10:54 AM | Last Updated on Sat, Aug 11 2018 8:24 PM
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందంటే.. మొన్నమొన్ననే వచ్చిన 3జీ సేవలకు కాలం చెల్లిపోయింది.. 4జీ సర్వీసులు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. 4జీ కంటే వేగవంతమైన సర్వీసులు 5జీలను అభివృద్ధి చేసేందుకు టెక్నాలజీ సంస్థలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించేశాయి.. దీంతో 4జీలకు డిమాండ్ పడిపోయి, వచ్చే కాలమంతా 5జీ సర్వీసులు మార్కెట్ను మరింత ఊపేయనున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే కాలంలో మొబైల్ కమ్యూనికేషన్లో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెల్లాయించనున్న 5జీ సేవలపై ముందస్తుగా ఇటు టెలికమ్యూనికేషన్ దిగ్గజాలు, అటు ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ చేతులు కలిపాయి.
ఆడీ, బీఎమ్డబ్ల్యూ, డైమ్లర్, ఎరిసన్, హ్యువాయ్, ఇంటెల్, నోకియా, క్వాల్కామ్ సంస్థలు ఒకటిగా ఏర్పడి '5జీ ఆటోమోటివ్ అసోసియేషన్'ను ఏర్పాటుచేసుకున్నాయి. వచ్చే దశాబ్దంలో మార్కెట్కు సవాలుగా నిలువనున్న 5జీ సేవలు డిజిటలైజేషన్కు, స్వయంచోధక డ్రైవింగ్కు ఉపయోగపడేలా ఈ అసోసియేషన్ పనిచేయనుంది. టెక్నికల్, రెగ్యులేటరీ సమస్యలను ఈ అసోసియేషన్ గుర్తిస్తూ, తదుపరి తరం మొబైల్ నెట్వర్స్ కనెక్షన్, రహదారి భద్రతా కొరకు సమాచార పరిష్కారాలను ఈ అసోసియేషన్ అభివృద్ధి చేయనుంది. సాంకేతిక అవసరాలు, అమలు చేసే వ్యూహాలపై ఈ అసోసియేషన్ పనిచేయనుంది. ప్రతి వాహనానికి అవసరమయ్యే వైర్లెస్ కనెక్టివిటీ, సెక్యురిటీ, భద్రత, క్లౌడ్ ఆర్కిటెక్చర్స్ వంటి సాంకేతిక అవసరాలను ఈ అసోసియేషన్ గుర్తించనుంది.
.
Advertisement