ఫొటోలో కనిపిస్తున్న ఈ సైకిల్ వీరుడి పేరు లే టిమిస్. ఇతగాడు సైకిల్ మీదనే యూరోప్ దేశాలన్నింటినీ చుట్టేశాడు. పోర్చుగల్‌లోని కాబో ద రోకా నుంచి టిమిస్ తన సాహసయాత్రను ప్రారంభించి, రష్యాలోని సైబీరియా అంచుల్లో ఉన్న ఉఫా రైల్వేస్టేషన్ వద్ద ముగించాడు. ఈ యాత్రను అతడు 16 రోజుల 10 గంటల 45 నిమిషాల్లోనే ముగించారు. ఈ యాత్రలో అతడు ప్రయాణించిన దూరం 6,366 కిలోమీటర్లు.
దీంతో అతడు అత్యంత వేగంగా యూరోప్‌యాత్ర పూర్తిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. మొత్తం పది దేశాల మీదుగా అతడు తన యాత్ర సాగించాడు. పోర్చుగల్ నుంచి యాత్ర మొదలుపెట్టి, స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, పోలండ్, లిథువేనియా, లాట్వియాల మీదుగా రష్యాకు చేరుకున్నాడు. రోజుకు సగటున 386 కిలోమీటర్ల చొప్పున, గంటకు సగటున 30 కిలోమీటర్ల వేగంతో ఈ సాహసయాత్రను విజయవంతంగా పూర్తిచేశాడు. సైక్లింగ్‌పై అమిత ఇష్టం గల టిమిస్ ఇదివరకు ఏడేళ్లపాటు వివిధ దేశాలను సైకిల్ మీదే చుట్టేశాడు. ఇటీవల యూరోప్ సైకిల్‌యాత్రను అనితరసాధ్యమైన వేగంతో అతి తక్కువ వ్యవధిలోనే పూర్తిచేయడంతో వార్తల్లోకెక్కాడు.
(చదవండి: ఈ ఫోటోలో ఉన్నది కేకు అనుకుంటున్నారా? తెలిస్తే షాకవ్వుతారు!)
Comments
Please login to add a commentAdd a comment