ఒంగోలు క్రైం: అతివేగం..మద్యం మత్తు..అజాగ్రత్త..కారణం ఏదైనా రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. జాతీయరహదారి, రాష్ట్ర రహదారి, ఇతర రహదారులనే తేడా లేకుండా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనుభవం లేని, లెసైన్సుల్లేని డ్రైవర్లు, వాహనాలు అజాగ్రత్తగా నడపటం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
డ్రైవింగ్ నిబంధనలు పూర్తిగా తెలుసుకోకుండా వాహనాలు నడపటం ప్రమాదాలకు తావిస్తోంది. జిల్లాలో ఏదో ఒక మూల సైకిలిస్టును ఢీ కొన్న లారీ, ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఆటో, తాగిన మైకంలో డివైడర్‌ను ఢీ కొన్న బైకు, అతివేగంగా కారు నడుపుతూ అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు, రెండు మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీ కొనటం, ఇంకా ఆటోలైతే ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో రకమైన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క అక్టోబర్ నెలలోనే జిల్లా మొత్తం మీద 106 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
రహ‘దారుణాలు’
Published Wed, Nov 5 2014 2:18 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement