Careless
-
Corona patients: ఆక్సిజన్ అందక.. లైన్లో ఉండలేక..
సాక్షి, హిమాయత్‌నగర్( హైదరాబాద్): ‘సమయం మధ్యాహ్నం 12.50 గంటలు.. పాతబస్తీ నుంచి 26 ఏళ్ల యువతిని కుటుంబ సభ్యులు కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 78 నుంచి 84 మధ్య ఉంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. ఎమర్జెన్సీ అమ్మా.. తొందరగా అడ్మిట్ చేసుకోండంటూ కుటుంబ సభ్యులు అక్కడున్న సిబ్బందిని ప్రాధేయపడ్డారు.ఎవరైనా ఒకటేనమ్మా లైన్లో నిలబడండి, రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ స్లిప్ లెఫ్ట్‌లో ఉన్న క్యాబిన్లో ఇవ్వండనే సమాధానం వచ్చింది. అప్పటికే లైన్లో 15మందికి పైగా ఉన్నారు. వారందర్నీ రిక్వెస్ట్ చేసిన కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేశారు. స్లిప్ తీసుకుని ఎడమవైపు ఉన్న సమాచార క్యాబిన్లో ఉన్న నర్సులకు ఇచ్చారు. ఇక ఇక్కడ నిమిషాల కొద్దీ ఆలస్యం. సుమారు 45 నిమిషాల పాటు వెంట తెచ్చుకున్న ఆక్సిజన్ అయిపోతుంది, మహిళ తీవ్ర నిస్పృహకు గురవుతోంది. ఎంత వేడుకున్నా అస్సలు వినలేదు. 45 నిమిషాల తర్వాత ఒకేసారి ఐదుగురికి అడ్మిషన్ స్లిప్పులు ఇచ్చి 1.30గంటలకు పైకి పంపారు’. ‘వజ్రమ్మ వయస్సు 92 ఏళ్లు. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 86 నుంచి 80కి పడిపోతున్నాయని కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె కుటుంబీకులు అడ్మిషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసి అడ్మిషన్ స్లిప్ కోసం కనీసం 45 నిమిషాలకు పైగా వేచి చూశారు. ఓ పక్క వృద్ధురాలు వీల్‌చైర్‌లో అనేక అవస్థలు పడుతోంది. పెద్దామే బాధ చూడలేకపోతున్నాం.. త్వరగా అడ్మిట్ చేసుకోమని ప్రాధేయపడినా సరే.. అందరితో పాటే అడ్మిషన్ స్లిప్‌ని వృద్ధురాలికి కూడా ఇచ్చి పైకి పంపిన ఈ రెండు ఘటనలు బుధవారం కింగ్‌కోఠి ఆసుపత్రిలో చోటు చేసుకున్నాయి’. కంటతడి పెట్టిస్తున్న నిర్లక్ష్యం ఓ పక్క అయినవారు బతకాలనే ఆశ. మరో పక్క సిబ్బంది నిర్లక్ష్యం. ఈ రెండింటితో ఎవరిని ఏం అనాలో తెలియక పేషెంట్ల వెంబడి ఉన్న కుటుంబ సభ్యులు కంటతడి పెడుతున్నారు. సిబ్బందిపై కొద్దిగా కొప్పడితే బెడ్ ఇవ్వరేమో అనే భయం. కొద్దిగా ఓర్చుకో అమ్మా.. అంటూ పెషెంట్‌నిని ప్రాధేయపడుతున్న క్రమంలో.. ఆమె నిస్సాహాయకురాలిగా ఉంటుంది. కనీస పర్యవేక్షణ లేకపోవడం వల్ల, నిత్యం వందలాది మందికి సర్వీస్ ఇవ్వడం వల్ల సిబ్బంది సైతం విసిగెత్తిపోతున్నారు. ప్రాణం పోతే ఆ బాధ, వేదన తమకే తెలుస్తోందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. 15 నిమిషాల్లోనే అడ్మిట్ ఎవరినీ ఎక్కువ సేపు వెయిట్ చేయించేది లేదు. ఎమర్జెన్సీ ఉంటే పేషెంట్‌ని అడ్మిట్ చేసుకుని అడ్మిషన్ ప్రక్రియ వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నాం. ఒక్కోసారి ఆలస్యం అవుతుంటుంది. కానీ.. ఉద్ధేశపూర్వకంగా ఎవరినీ ఎక్కువ సేపు వేచి ఉంచేలా చేయము. – డాక్టర్ రాజేంద్రనాథ్, కింగ్‌కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ ( చదవండి: వెంటిలేటర్ బెడ్స్ లేవ్.. గాంధీకి వెళ్లిపోండి! ) -
లైట్ తీసుకుంటే..ముప్పు ముందరే
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో చాలా మంది ప్రజలు కరోనా వైరస్‌ను లైట్‌గా తీసుకుంటున్నారు. ఇప్పటికే తమకు కోవిడ్ వచ్చిపోయి ఉంటుందని, యాంటిబాడీస్ కూడా పుష్కలంగా వృద్ధి చెంది ఉంటాయని అపోహ పడుతున్నారు. వైరస్ తమను ఏమీ చేయలేదనే ధీమాతో కనీసం మాస్క్ కూడా ధరించడం లేదు. భౌతిక దూరం, శానిటైజర్ల వినియోగం మర్చిపోయారు. ఫలితంగా ఒకరి తర్వాత మరొకరు వైరస్ కోరల్లో చిక్కుకుంటున్నారు. టెస్టులు సహా చికిత్సలను నిర్లక్ష్యం చేస్తూ, తీరా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తిన తర్వాత ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారిని వైద్యులు వెంటిలేటర్‌పైకి తరలించాల్సి వస్తుంది. ప్రస్తుతం 1165 మంది వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 1940 మంది ఆక్సిజన్‌పై, 952 మంది సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. 4910 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. విధిగా కోవిడ్ నిబంధనలు పాటించడం, టీకా వేయించుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. విధిగా టీకా వేయించుకోవాలి మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వైరస్ రూపాంతరం చెందుతోంది. గతంతో పోలిస్తే ఈసారి వైరస్ తీవ్రత కొంత ఎక్కువగా ఉంది. వైరస్‌లోడ్ అధికంగా ఉండటంతో రికవరీ రేటు కూడా తక్కువగా ఉంది. గతంలో వారం, రెండు వారాలకే కోలుకున్న వారు..ప్రస్తుతం మూడు వారాలైనా కోలుకోవడం లేదు. ఇలాంటి వారికి హై డోస్ యాంటీ బయాటిక్స్ వాడాల్సివస్తోంది. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ టీకా వేయించుకోవాలిని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారాం అన్నారు. ( చదవండి: వామ్మోకరోనా.. కంటి చూపు కోల్పోతున్నారు! ) -
వైద్యం కోసం వెళితే జీవచ్ఛవాన్ని చేశారు
-
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి యువకుడు బలి
-
ట్రాక్టర్‌పై నెట్ వేయనందుకు జరిమానా
విజయవాడ (భవానీపురం) : ఘాట్లలో నుంచి చెత్తను తీసుకువెళ్లే ట్రాక్టర్‌పై నెట్ వేయనందుకుగాను కాంట్రాక్టర్‌కు రూ.10వేలు జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ జి. వీరపాండియన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన పున్నమి, భవానీఘాట్లలో పర్యటించారు. భవానీఘాట్లోని డస్ట్బిన్ల నుంచి సేకరించిన చెత్తను ట్రాక్టర్లో వేసుకుని పైన ఏ విధమైన పట్టాగానీ, నెట్గానీ లేకపోవడాన్ని గమనించిన ఆయన పైవిధంగా స్పందించారు. భక్తులు నదిలో పడేసే పూలు, ఆకులను ఎప్పటికప్పుడు నెట్ల ద్వారా తొలగించేలా చూడాలని ఆదేశించారు. -
వికటించిన వైద్యం బాలింత మృతి
-
హై సెక్యూరిటీ నెంబర్‌ప్లేట్ల కోసం హైరిస్క్
-
కనపడుటలేదు...!
-
నగరం.. నరకం
బురద గుంటలు... రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు... దుర్వాసనల మధ్య దుర్భర జీవనం... ఇదేదో మారుమూల గ్రామంలో పరిస్థితి అనుకొనేరు సుమా...! ఇది కరీంనగర్ జిల్లా కేంద్రం సుందర స్వరూపం! అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పుణ్యమా అని గత ఎనిమిదేళ్లుగా కరీంనగర్ ప్రజలు అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకానికి సజీవ తార్కాణం! కరీంనగర్: 2005లో కరీంనగర్ నగరపాలక సంస్థగా ఏర్పడ్డ తర్వాత యూజీడీ మంజూరైంది. రూ.76.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు చేశారు. మే 23, 2007న పరిపాలనా అనుమతి రాగా, ఆగస్టు 8, 2007న సాంకేతిక అనుమతి లభించింది. దీంతో మార్చి 27, 2008లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ రాంకీ కంపెనీ ఈ కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకుంది. 303 కిలోమీటర్ల యూజీడీ నిర్మాణ పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఇక అప్పటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ఎనిమిదేళ్లుగా నత్తకు నడక నేర్పినట్లు పనులు కొనసా...గుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరును చూస్తే.. మరో రెండు సంవత్సరాలు గడిచినా పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇష్టారాజ్యంగా పనులు యూజీడీ నిర్మాణ పనుల్లో మొదటి నుంచీ నాణ్యత కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. పనుల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. పైపులైన్ల కింద ఇసుక వేయడం లేదు. చాంబర్ల నిర్మాణంలో నాణ్యత కరువైంది. తూతూమంత్రంగా పనులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ప్రజారోగ్యశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం ప్రజల కు శాపంగా మారింది. పైప్‌లైన్ కోసం తవ్విన రోడ్ల ను నామమాత్రంగా పూడ్చడంతో పనులు జరిగిన ప్రాంతాలన్నీ గుంతలమయంగా మారాయి. ప్యాచ్‌వర్క్ అయితే పైపై పూతలతో మమ అనిపించారు. దీంతో కొద్దిరోజులకే ఆ పూత లేచిపోయి గుంతలు ఏర్పడుతున్నాయి. మట్టిని రోడ్డుపైనే వదిలివేయడం తో నడక కూడా నరకప్రాయంగా మారింది. ఇక సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) పనులు 80 శాత మే పూర్తయ్యాయి. యూజీడీ పనులు 303 కిలోమీటర్లకు 288 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇంకా 15 కిలోమీటర్లు పైపులైన్ మిగిలి ఉంది. రూ.126.5కోట్లు ఖర్చుచేసి యూజీడీ పనులు పూర్తిచేసినా అది పనికి వస్తుందో.. మట్టిలో కలిసిపోతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనుల పూర్తికి మరో రూ.50 కోట్లు అధ్వాన్నంగా జరుగుతున్న పనులను నిలిపివేయాలని సంవత్సరం క్రితం వరకు స్థానిక ప్రజాప్రతి నిదులు నెత్తినోరు బాదుకున్నారు. ఇప్పటి వరకు చేసిన ఖర్చంతా మట్టిపాలేనని, ఇప్పటికైనా పనులు ఆపాలని ప్రభుత్వానికి విన్నవించారు. మొదట మంజూరు చేసిన రూ.76.50 కోట్లు నిధుల్లో అప్పటికే రూ.60 కోట్ల పైచిలుకు కాంట్రాక్టర్ బిల్లులు పొందా రు. ఇక మిగిలిన పనికి నిధులు సరిపోవని కాంట్రాక్టర్ సైతం చేతులెత్తేశారు. యూజీడీ గండం తప్పిం దని అందరూ అనుకుంటున్న సమయంలో గతేడాది ఆగష్టు 5న సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో యూజీడీ మళ్లీ తెరపైకి వచ్చింది. రూ.50 కోట్లు మంజూరు చేస్తూ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈసారి ఆర్అండ్బీ ప్రధాన రహదారుల్లో 14.5 కిలోమీటర్ల పనులు ప్రారంభించారు. రోడ్లన్నీ ఛిద్రం చేసేశారు. పనులు పూర్తయిన చోట కూడా ప్యాచ్‌వర్క్‌ల పనులు చేపట్టలేకపోయారు. దీంతో తారురోడ్లు కాస్తా బొందలమయంగా తయారయ్యాయి. గుంతలు గుదిబండగా మారి వాహనదారులకు ఇబ్బందులు మొదలయ్యాయి. హౌసింగ్ బోర్డులో నరకయాతన నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో జరుగుతున్న పనులతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. సబ్‌స్టేషన్ నుంచి 300 మీటర్ల పైపులైన్ కోసం నాలుగు నెలలుగా పనులు చేస్తున్నారు. పనులను క్రమపద్ధతిలో చేయకపోవడంతో చినుకు పడితే చిత్తడిగా మారుతోంది. బురుదతో ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. కాలినడకే కష్టంగా మారడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పనులు పూర్తిచేయాలని నెత్తినోరు బాదుకున్నా పట్టించుకున్న నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్‌లోగా పనులు పూర్తి : భద్రయ్య, ప్రజారోగ్యశాఖ ఈఈ యూజీడీ పనులు సెప్టెంబర్‌లోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించాం. ప్యాచ్‌వర్క్‌ల కోసం రూ.90 లక్షలు కేటాయించాం. సీసీ, బీటీ రోడ్ల ప్యాచ్వర్క్లన్నీ పూర్తిచేస్తాం. యూజీడీ కాంట్రాక్టర్ 25 కిలోమీటర్ల ప్యాచ్‌వర్క్ పూర్తిచేయాల్సి ఉంది. హౌసింగ్‌బోర్డులో పనులు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీవరేజ్ ట్యాంకు పనులు పూర్తి చేసి దశలవారీగా ఇండ్ల నుంచి యూజీడీ కనెక్షన్లు ఇస్తాం. -
గర్భిణీ ఛాతీలోకి చొచ్చుకెళ్లిన ఇనుపరాడ్
-
ప్రమాదవశాత్తూ రైతు మృతి
దేవరకద్ర (మహబూబ్‌నగర్): ఓ డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ట్రాక్టర్ కింద పడి ఒక రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నార్లోనికుంట్ల గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు బైకని గొల్లరాజు (28) గురువారం రాత్రి ఎరువుల బస్తాలను ట్రాక్టర్లో ఇంటికి తరలించాడు. బస్తాలను కిందకి దింపిన తర్వాత ట్రాక్టర్ ఎదుట నిలుచుని, డ్రైవర్ సీట్లో కూర్చుని ఉన్న తన బావమరిది మల్లేశ్‌తో మాట్లాడుతున్నాడు. మాటల్లో పడి గేర్‌లో ఉన్న ట్రాక్టర్ క్లచ్‌ను మల్లేశ్ వదిలి వేయడంతో అకస్మాత్తుగా ట్రాక్టర్ ముందుకు దూసుకుపోయింది. దీంతో ట్రాక్టర్ టైర్లు గొల్లరాజుపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే దేవరకద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం గొల్లరాజు మృతి చెందాడని ఎస్ఐ వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గొల్లరాజుకు భార్య సుజాత, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. -
రహ‘దారుణాలు’
ఒంగోలు క్రైం: అతివేగం..మద్యం మత్తు..అజాగ్రత్త..కారణం ఏదైనా రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. జాతీయరహదారి, రాష్ట్ర రహదారి, ఇతర రహదారులనే తేడా లేకుండా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనుభవం లేని, లెసైన్సుల్లేని డ్రైవర్లు, వాహనాలు అజాగ్రత్తగా నడపటం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. డ్రైవింగ్ నిబంధనలు పూర్తిగా తెలుసుకోకుండా వాహనాలు నడపటం ప్రమాదాలకు తావిస్తోంది. జిల్లాలో ఏదో ఒక మూల సైకిలిస్టును ఢీ కొన్న లారీ, ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఆటో, తాగిన మైకంలో డివైడర్‌ను ఢీ కొన్న బైకు, అతివేగంగా కారు నడుపుతూ అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు, రెండు మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీ కొనటం, ఇంకా ఆటోలైతే ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో రకమైన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క అక్టోబర్ నెలలోనే జిల్లా మొత్తం మీద 106 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. -
ఫిట్‌నెస్‌పై కేర్లెస్
పత్తా లేని స్కూల్ బస్సుల తనిఖీలు మే ముగుస్తున్నా ఉలుకూపలుకు లేని ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్‌బస్సులు మనం వచ్చేవారం కారులో ఊరికెళ్దామనుకుంటాం. ముందుగానే కారు కండీషన్ బాగుందా..? లేదా..? అని చూసుకుంటాం. అలా చూసుకుంటేనే తిరిగి క్షేమంగా గమ్యం చేరుకుంటాం. కానీ ప్రతిరోజు పిల్లలను తీసుకెళ్లే స్కూల్‌కెళ్లే బస్సుల విషయంలో మాత్రం అలాంటి జాగ్రత్తలు కనిపించడం లేదు. మే ముగుస్తున్నా ఘనత వహించిన ఆర్టీఏ ఇప్పటివరకు స్కూల్‌బస్సుల ఫిట్నెస్ గురించి పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే నానా హడావుడి చేసే ఆర్టీఏ స్కూల్‌బస్సుల విషయంలో ముందుజాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రతియేటా జూన్‌లో స్కూళ్లు తెరుస్తారన్నది జగమెరిగిన సత్యం. ఇంతకుముందుగానే మేలో విధిగా స్కూల్ బస్సులు బాగున్నాయా..? లేదా..అని ఫిట్నెస్ పరీక్ష నిర్వహించాల్సిన అధికారులు ఇంకా మొద్దు నిద్రవీడడం లేదు. గ్రేటర్లో 6527 స్కూల్ బస్సులున్నాయి. వీటన్నింటికీ పరీక్షలు నిర్వహించి వాటి సామర్ధ్యాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. మరో నాలుగైదు రోజుల్లో మే ముగుస్తుంది. కొన్నిస్కూళ్లు జూన్ రెండోవారంలో తెరుచుకునే అవకాశమున్నప్పటికీ అధికశాతం జూన్ మొదటి వారంలోనే తెరుచుకోనున్నాయి. ఈ కొద్దిపాటి గడువులో వేలకొద్దీ స్కూల్బస్సులకు సామర్ధ్యపరీక్షలు నిర్వహించడం అసాధ్యం. చిన్నారుల భద్రతపట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన రవాణా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. స్కూళ్లు తెరుచుకొనే సమయానికి హడావిడిగా పరీక్షలు చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేయడం ఒక ప్రహసనంగా మారుతోంది. నిజానికి మోటారువాహన తనిఖీ అధికారులు, ప్రాంతీయ రవాణా అధికారులు తమ పరిధిలోని ప్రతిస్కూల్ యాజమాన్యాన్ని ఫిట్నెస్ పరీక్షలకు ప్రోత్సహించాలి. గడువులోపే ఆ పనిపూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటివరకు అలాంటి కార్యక్రమం నగరంలో ప్రారంభం కాలేదు. దర్జాగా ఉల్లంఘన రవాణా అధికారుల నిర్లక్ష్యం ఇలాఉంటే స్కూళ్లు,కళాశాలలు తదితర విద్యాసంస్థల యాజమాన్యాలు మరో అడుగు ముందుకేసి దర్జాగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. కేవలం పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేం దుకు మాత్రమే వినియోగించాల్సిన బస్సులను ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు.పెళ్లిళ్లు, తీర్ధయాత్ర, పార్టీ కార్యక్రమాల కోసం తిప్పుతున్నారు. పిల్లల భద్రత ఎలా..? ప్రతియేటా ఎక్కడోచోట స్కూల్ బస్సులు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. అభంశుభం ఎరుగని చిన్నారులు బలవుతూనే ఉన్నారు. ఇటు ఆర్టీఏ, అటు స్కూల్ యాజమాన్యాలు,మరోవైపు డ్రైవర్ల అజాగ్రత్త వంటి అంశాలే ప్రధానకారణం. కొన్నిసార్లు అటెండర్లు లేకపోవడం వల్ల కూడా చిన్నారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. డ్రైవర్ల అర్హతలు డ్రైవర్ వయస్సు 60 ఏళ్లకు మించకుండా ఉం డాలి. పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించాలి. యాజమాన్యం తమ సొంతఖర్చుతో డ్రైవర్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తపోటు,షుగరు,కంటిచూపు వంటి పరీక్షలు చేయించాలి. అతని అర్హ తలు, డ్రైవింగ్ లెసైన్స్,తదితరాంశాలపై సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి. బస్సు డ్రైవింగ్‌లో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. డ్యూటీలో డ్రైవర్,అటెండర్ తప్పనిసరిగా యూనిఫారం ధరించాలి. పేరెంట్స్ కమిటీ బాధ్యత బస్సుకు సంబంధించిన బాహ్య పరికరాలు విండ్‌స్క్రీన్,వైపర్స్, లైటింగ్స్ వంటి వాటి మెకానికల్ కండీషన్స్, పనితీరు తెలుసుకొనేందుకు ప్రిన్సిపాల్‌తో కలిసి పేరెంట్స్ కమిటీ ప్రతినెలా తనిఖీలు చేయాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్సులో మందులు,ఇతర పరికరాలు ఉన్నాయా.. లేవా.. అని తనిఖీ చేయాలి. స్కూల్ బస్సులు ఇలా ఉండాలి.. బస్సు పసుపురంగులో ఉండాలి. రంగు పాలిపోయినట్లుగా కాకుండా స్పష్టంగా కనిపించాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించేలా అద్దాలు అమర్చాలి. బస్సు ఇంజన్ కంపార్ట్మెంట్లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టింగ్విషర్),పొడి అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం కూడా ఉండాలి. ఫస్ట్ ఎయిడ్‌బాక్స్ ఏర్పాటు తప్పనిసరి. సదరు పాఠశాల/కళాశాల పేరు, టెలిఫోన్ నెంబర్,మొబైల్ నెంబర్,పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపున ముందుభాగంలో స్పష్టంగా రాయాలి. సీట్ల కిందిభాగంలో బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి. పిల్లలు పట్టుకొనేందుకు వీలుగా అక్కడక్కడా లోహపు స్తంభాలను బస్సులో అమర్చాలి. వాహనానికి నాలుగువైపులా పైభాగం మూలాల్లో (రూఫ్‌పై కాదు) బయటివైపు యాంబర్ (గాఢ పసుపుపచ్చని) రంగుగల ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి. పిల్లలు దిగేప్పుడు,ఎక్కేప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి. సదరు వాహనం స్కూల్‌బస్సు అని తెలిసేలా ముందుభాగంలో పెద్ద బోర్డుపైన 250ఎం.ఎం.కు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్థులు (ఒక అమ్మాయి,ఒక అబ్బాయి) నల్లరంగులో చిత్రించి ఉండాలి. ఆ చిత్రంకింద ‘స్కూల్ బస్సు’ లేదా ‘కళాశాల బస్సు’ అని నల్లరంగులో కనీసం 100ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి. అక్షరాల గాఢత సైజు కనీసం 11ఎం.ఎం.ఉండాలి. బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్ సిస్టమ్‌తో ఉండాలి. సైడ్విండోలకు అడ్డంగా 3 లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి. సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లకూడదు. ఫుట్‌బోర్డుపై మొదటి మెట్టు 325 ఎం.ఎం.ల ఎత్తుకు మించకుండా ఉండాలి. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చాలి. లోపలికి ఎక్కేప్పుడు,దిగేప్పుడు పట్టుకునేలా తలుపు మెట్లకు సమాంతరంగా రేలింగ్ ఉండాలి.