సాక్షి, ముంబై: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతికి ఎస్‌యూవీ విక్రయాల్లో దూసుకుపోయింది. ఎస్‌యూవీ సెగ్మెంట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం విటారా బ్రెజ్జా 3 లక్షల విక్రయాలను సాధించింది. 28 నెలల కాలంలో ఈ హాట్ సేల్‌ను సాధించామని కంపెనీ మంగళవారం ప్రకటించింది.
ప్రతి నెల ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో టాప్ 10లో ప్లేస్ సాధించే మారుతి ఘనతను మరింత పెంచడమే కాకుండా అతిపెద్ద కార్ల తయారీదారు మహీంద్రాను అధిగమించిదని తెలిపింది. 2018 ఆర్థిక సంవత్సరంలో మారుతి యూవీ సేల్స్ 53759 యూనిట్లతో 27.53 శాతం వృద్ధిని సాధించింది. 25.69 శాతం నుంచి 27.53 శాతానికి విక్రయాలు పుంజుకున్నాయి. మరోవైపు మహీంద్రా యూవీ విక్రయాలు (2,33,915 యూనిట్లతో) 29.20 శాతం నుంచి 25.38 శాతం క్షీణించాయి. బ్రెజ్జా టాప్‌వేరియింట్ విక్రయాలు 56శాతం పుంజుకున్నాయని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ ఎస్ కల్సీ వెల్లడించారు. ఈ సెగ్మెంట్‌లో పలుకొత్త కార్లు వచ్చినప్పటికి మార్చి 2016 లో లాంచ్ అయిన విటారా బ్రెజ్జా ఉత్తమంగా నిలిచిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment