బంతి తగిలి విలవిల్లాడిపోయాడు!
ఎడ్జ్ బాస్టన్: క్రికెట్‌లో గాయాలు సహజం. కానీ కొన్ని గాయాలు ప్రాణానికే ప్రమాదం. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం క్రికెట్‌లో ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇంచు మించు అలాంటి సంఘటనే ఎడ్జ్‌బాస్టన్‌లో నాటింగమ్‌షైర్, బర్మింగ్‌హోం జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో నాటింగమ్‌షైర్ బౌలర్ ల్యూక్ ఫ్లేచర్ తీవ్రంగా గాయపడ్డాడు. 28 ఏళ్ల ఫ్లేచర్ బౌలింగ్‌లో బర్మింగ్‌హోమ్ బ్యాట్స్‌మన్ సామ్ హెయిన్స్ పవర్‌ఫుల్ స్ట్రేట్ డ్రైవ్ కొట్టాడు.
ఆ బంతి కాస్త ఫ్లేచర్ తలకు బలంగా తగలడంతో అతను కుప్పకూలిపోయాడు. దీంతో మైదానమంతా షాక్ గురైంది. వెంటనే ఫ్లేచర్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. దీంతో మ్యాచ్ 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఇప్పుడు అతని పరిస్థితి నిలకడగా ఉందంటూ ఇంగ్లండ్ ఆటగాడు జేక్ బాల్ ట్వీట్ చేశాడు. ఇక ఫ్లేచర్ తనకు మద్దతుగా మెసెజ్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ మ్యాచ్‌లో బర్మింగ్‌హోమ్ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది.