కవాడిగూడ: మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఆన్‌లైన్ పోటీలను నిర్వహించనున్నట్లు లీడ్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ (లిప్స్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చించల రాంచందర్, ఉపాధ్యక్షుడు ఆరుకాల రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ... లిప్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎన్.బి.సుదర్శన్ ఆచార్య సూచన మేరకు కోవిడ్–19 నేషనల్ చాంపియన్‌షిప్ ఆన్‌లైన్ పోటీలు మొదటి లెవల్–1 పరీక్ష ముగిసిందని ఆగస్టులో లెవెల్–2, సెప్టెంబర్‌లో లెవెల్–3 పోటీలు పూర్తవుతాయన్నారు. అన్ని జిల్లాలు, పట్టణ, మండల కేంద్రాల్లో అబ్దుల్ కలాం చాంపియన్ షిప్ ఆన్‌లైన్ పోటీల్లో పాల్గొనేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలన్నారు.
అదే విధంగా అబ్దుల్ కలాం వర్ధంతి రోజున రాష్ట్రంలోని లిప్స్ జిల్లా కన్వీనర్‌లు, కో కన్వీనర్‌లు ఆయా జిల్లాల్లో సంస్మరణ సభలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. అక్టోబర్ 15న అబ్దుల్ కలాం ప్రఖ్యాత అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి లో ఈ నెల 27 సాయంత్రం వెబినార్ సమా వేశంతో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లైవ్‌లో ప్రముఖులు పాల్గొనవచ్చన్నారు. లిప్స్ ప్రధాన కార్యదర్శి కష్టం అనిల్‌కుమార్ బా బు, సహాయ కార్యదర్శి కోయిలకొండ శ్రీకాంత్‌రెడ్డి, కోశాధికారి ఆర్. శ్రీనివాస్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బానాల రాఘవ, సలహాదారులు కందాల పాపిరెడ్డి, జలజం సత్యనారాయణ, జె.పి.రెడ్డి, కడారి అనంతరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment