'నాలో మనిషిని నిద్రలేపింది'.. విశాల్ ట్వీట్ వైరల్! | Kollywood Star Hero Vishal Shares His Experience To Read A Book | Sakshi
Sakshi News home page

Vishal: నిజంగా గ్రేట్.. వారికి మరింత గౌరవించాలి: విశాల్

Published Fri, Dec 22 2023 8:04 PM | Last Updated on Fri, Dec 22 2023 8:13 PM

Kollywood Star Hero Vishal Shares His Experience To Read A Book - Sakshi

ఇటీవలే విశాల్ మార్క్ ఆంటోనీ చిత్రంతో ప్రేక్షకులను పలరించాడు. అక్టోబర్‌లో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ కోలీవుడ్‌ స్టార్‌ హీరో రత్నం సినిమాలో నటిస్తున్నారు. ‘సింగం’ సిరీస్‌ ఫేమ్‌ హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. కార్తికేయన్‌ సంతానం జీ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇప్పటికే మేకర్స్‌ విడుదల చేశారు. అయితే చెన్నైలో వరదలు రావడంతో బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

రత్నం మూవీతో బిజీగా ఉన్న విశాల్.. తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ జీవిత కథను చదివినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. బ్రిట్నీ స్పియర్స్ రాసిన పుస్తకం 'ఉమెన్ ఇన్ మీ' చదివాక నాలో మనిషిని నిద్రలేపిందని అన్నారు. ఇక నుంచి మహిళలను మరింత గౌరవించాలనుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆర్టిస్టుల మనోభావాలను అర్థం చేసుకోవడం తెలుసుకున్నానని అన్నారు.

ఆమె యూత్ ఐకాన్ అయినప్పటికీ చాలా చిన్న వయస్సులో జీవిత ప్రయాణం.. ఎదుర్కొన్న ఇబ్బందులు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. ఆమె జీవితంలో సాధించిన విజయాలకు.. ముఖ్యంగా స్తీలకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నానని అన్నారు. మీ జీవితంలో సరైన ఎంపిక, ధైర్యంతో.. మిమ్మల్ని మీరు ప్రపంచం సరళంగా అర్థం చేసుకునే విధంగా ఉండాలని విశాల్ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు మహిళలకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. 

ఉమెన్ ఇన్ మీ పుస్తకం..

ది ఉమెన్ ఇన్ మీ అనే పుస్తకాన్ని అమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ రాశారు. ఈ బుక్‌ అక్టోబర్ 24, 2023న  26 భాషల్లో విడుదలైంది. ఉమన్ ఇన్ మి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement