తమిళ స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలు, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు సమాజసేవలోనూ దూసుకెళ్తున్నారు. మాత్రం సంస్థ పేరుతో తమిళనాట సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పదిమంది పేద రైతు కుటుంబాలకు ట్రాక్టర్లు అందజేశారు. వారిని ప్రత్యేకంగా కలిసి మరి రాఘవ లారెన్స్ ట్రాక్టర్ తాళాలు అందించారు.
తాజాగా తాను సొంత ఖర్చులతో చదివించిన విద్యార్థులను కలిశారు. దాదాపు 20 ఏళ్లుగా వారి అన్నీ తానే నడిపిస్తున్నారు. ఆ విద్యార్థులంతా చదువుల్లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా వారిని కలిసి రాఘవ లారెన్స్ ఎమోషనల్ అయ్యారు. తాను కూడా వారితో పాటు కలిసిపోయి ఆటలు ఆడారు. వారిని చూస్తే తనకు గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. వారిని కలిసి సమయం వెచ్చించడం నా హృదయం సంతోషంతో నిండిపోయిందంటూ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మీరు గ్రేట్ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
The seeds I planted 20 years ago have now grown into these beautiful souls and are being a good example in society. I’m extremely proud of my boys and girls for the kind of persons they have grown into. My heart is so full after spending some beautiful and quality time with them.… pic.twitter.com/XjytGqj2OW
— Raghava Lawrence (@offl_Lawrence) May 19, 2024
Comments
Please login to add a commentAdd a comment