కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 69వ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం రాజకీయరంగ ప్రవేశం చేస్తున్న విజయ్ నటించే చివరి చిత్రం ఇదేననే ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన తండ్రి, కుమారుడిగా ద్విపాత్రాభియనం చేస్తున్నారు. కొడుకు పాత్ర కోసం ఆధునికి టెక్నాలజీని వాడుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో విజయ్ 69వ చిత్రానికి దర్శకుడెవరనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఈ విషయంలో చాలా మంది దర్శకుల పేర్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.
వీరిలో ఓ టాలీవుడ్ డైరెక్టర్‌తో పాటు, వెట్రిమారన్, కార్తీక్‌సుబ్బరాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరందరికీ విజయ్‌తో చిత్రం చేయాలన్నది ఆశే. తాజాగా హెచ్.వినోద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు చతురంగవేట్టై, ధీరన్ అధికారం ఒండ్రు, తుణివు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా కమలహాసన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిపారు. చిత్రం ప్రారంభమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ఆ చిత్రం డ్రాప్ అయ్యారు.
అలాంటి పరిస్థితుల్లో విజయ్ తన 69వ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం వైరలవుతోంది. దీని గురించి ఇటీవల ఓ భేటీలో నటుడు విజయ్ హీరోగా చేస్తే అది ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు హెచ్.వినోద్ బదులిస్తూ కచ్చితంగా రాజకీయ నేపథ్యంలోనే ఉంటుందని చెప్పారు. విజయ్ హీరోగా రాజకీయ నేపథ్యంలో చిత్రం చేయాలన్నది తన కోరిక అని పేర్కొన్నారు. తాను ఆయనకు చెప్పిన కథలన్నీ అలాంటివేనన్నారు. కాగా విజయ్ 69వ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు అయితే అది కచ్చితంగా ఆయన రాజకీయ జీవితానికి ప్రయోజన కరంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment