ఎన్నాళ్లో వేచిన హృదయం.. ఆ స్టార్‌ హీరో క్రేజ్‌ చూశారా? | Thalapathy Vijay Grand Welcome At Thiruvanathapuram Airport | Sakshi
Sakshi News home page

Vijay: కేరళలో దళపతి విజయ్.. ఎయిర్‌పోర్ట్‌ వద్ద ట్రాఫిక్ జామ్!

Published Mon, Mar 18 2024 8:59 PM | Last Updated on Tue, Mar 19 2024 10:35 AM

Thalapathy Vijay Grand Welcome At Thiruvanathapuram Air Port - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‍ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. అయితే ఇవాళ దాదాపు 14 ఏళ్ల తర్వాత దళపతి విజయ్ కేరళలో అడుగుపెట్టారు. ప్రస్తుతం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్)  సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసమే ఆయన తిరువనంతపురం చేరుకున్నారు. ఎయిర్ పోర్టు చేరుకున్న దళపతి విజయ్‍కు ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

తిరువనంతపురం ఎయిర్ పోర్టు నుంచి విజయ్ బయటకు రాగానే ఒక్కసారిగా అందరూ కేకలు వేస్తూ సందడి చేశారు. దళపతి.. విజయ్.. విజయ్.. అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. దీంతో కారులో నుంచి సన్‍రూఫ్ ద్వారా నిలబడి అభిమానులను విజయ్ అభివాదం చేశారు. చేతులు ఊపుతూ అభిమానులను పలకరించారు. కేరళలో విజయ్ క్రేజ్ చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో రావడంతో ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో రోడ్లు బ్లాక్ అయిపోయాయి. భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి.

కాగా.. గతంలో 2011లో కావలాన్ మూవీ షూటింగ్ కోసం చివరగా కేరళకు వెళ్లారు. మళ్లీ ఇన్నేళ్లకు అక్కడికి వెళ్లడంతో ఆయనకు స్వాగతం పలికారు. కాగా.. గోట్ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్‍లో దళపతి విజయ్ నటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement