memoirs
-
తెరపైకి బ్రిట్నీ జీవితం
ప్రముఖ అమెరికన్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం వెండితెరపైకి రానుంది. తన జీవితం ఆధారంగా బ్రిట్నీ స్పియర్స్ ‘ది ఉమెన్ ఇన్ మీ’ (మెమొర్) అనే పుస్తకం రాశారు. ఇందులో బ్రిట్నీ ప్రేమ విశేషాలు, చేదు అనుభవాలు, కుటుంబ విశేషాలు.. ఇలా చాలా అంశాలు ఉన్నాయట. ఇరవైఆరు భాషల్లో రిలీజ్ అయిన ఈ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది. అంతేకాదు.. ఈ పుస్తకం ఆడియో వెర్షన్‌కు ప్రముఖ హాలీవుడ్ నటి మిచెల్ విలియమ్స్ వాయిస్ ఇచ్చారు. ఈ బుక్ హక్కులను యూనివర్సల్ పిక్చర్స్ దక్కించుకుంది. దీంతో బ్రిట్నీ బయోపిక్ ప్రస్తుతం హాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. దర్శకుడు జోన్ ఎమ్ చు ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారని, మార్క్ ప్లాట్ నిర్మించనున్నారని టాక్. ఇక ‘నా ఫేవరెట్ మూవీస్ తీసిన మార్క్ ప్లాట్‌తో ఓ సీక్రెట్ ్రపాజెక్ట్ చేస్తున్నానని నా ఫ్యాన్స్‌కు చెప్పడానికి హ్యాపీగా ఉంది’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు బ్రిట్నీ. -
సన్నగిల్లిన బైడెన్ జ్ఞాపకశక్తి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిందనే విషయాన్ని ఒక నివేదిక తగిన సాక్ష్యాధారాలతో బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బైడెన్ వృద్ధాప్యాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచు కున్న రిపబ్లికన్లకు తాజా నివేదిక మరో శక్తివంతమైన ప్రచారాస్త్రమైంది. అయితే ఈ నివేదికలోని అంశాలన్నీ తప్పు అని 81 ఏళ్ల బైడెన్ ఖండించినా ఆ నివేదికలో పేర్కొన్న విషయాలను గమనిస్తే అవన్నీ నిజాలే అని అనిపించకమానవు. తక్కువ జ్ఞాపకశక్తి ఉన్న వృద్ధుడు అని బైడెన్‌ను నివేదిక అభివర్ణించింది. గత జనవరిలో వాషింగ్టన్‌లోని బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలను సిబ్బంది కనిపెట్టడంతో ఆ విషయం అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్దాకా వెళ్లింది. దీంతో ఆయన న్యాయశాఖ స్పెషల్ కౌన్సిల్‌గా రాబర్ట్ హుర్‌ను నియమించారు. ఈయన ఇటీవల బైడెన్‌ను ఏకధాటిగా ఐదు గంటలపాటు ఇంటర్వ్యూ చేసి ఆయన జ్ఞాపకశక్తిపై ఒక అంచనాకొచ్చారు. ఇదిగాక ఇతరత్రా సాక్ష్యాధారాలను ఆయన తన నివేదికలో వెల్లడించారు. గురువారం విడుదలైన ఆ 345 పేజీల నివేదికలో ఏమన్నాయంటే.. ► బరాక్ ఒబామా హయాంలో ఉపా« ద్యక్షుడిగా పనిచేసినకాలంలో అఫ్గానిస్తాన్ లో అమెరికా స్థావరాలు, సైన్యం మొహరింపు రహస్యాలను ఒక ప్రైవేట్ వ్యక్తితో బైడెన్ పంచుకున్నారు. సంబంధిత రహస్య పత్రాలను డెలావర్‌లోని తన గ్యారేజీలో మర్చి పోయారు. ► తన కుమారుడు బ్యూ బైడెన్ క్యాన్సర్ తో ఏ సంవత్సరంలో చనిపోయిందీ బైడెన్ ఠక్కున చెప్పలేకపోయారు ► ఉపాధ్యక్షుడిగా ఏ సంవత్సరంలో దిగిపోయారు అనేదీ ఈయనకు సరిగా గుర్తులేదు ► తన జీవితచరిత్ర రాస్తున్న ఒక రచయితకు సున్నితమైన అంశాలున్న ఒక నోటు పుస్త కం ఇచ్చారు. అందులో అఫ్గానిస్తాన్‌కు సంబంధించిన రహస్య సమాచారం ఉంది. అవన్నీ అబద్ధా్దలు: బైడెన్ ‘దాదాపు 40 సంవత్సరాల క్రితం విషయాలను ఠక్కున చెప్పాలంటే ఎలా?. నా కుమారుడి మరణాన్ని చర్చించకూడదనే ఆ ప్రశ్న సమయంలో స్పందించలేదు. రెండోసారీ అమెరికాకు అధ్యక్షుడిగా కొనసాగే శక్తిసామర్థ్యాలు నాకున్నాయి’’అని బైడెన్ పనరుద్ఘాటించారు. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలపై తడబడుతూ, పొరబడటం గమనార్హం. -
'నాలో మనిషిని నిద్రలేపింది'.. విశాల్ ట్వీట్ వైరల్!
ఇటీవలే విశాల్ మార్క్ ఆంటోనీ చిత్రంతో ప్రేక్షకులను పలరించాడు. అక్టోబర్‌లో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ కోలీవుడ్ స్టార్ హీరో రత్నం సినిమాలో నటిస్తున్నారు. ‘సింగం’ సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించనుంది. కార్తికేయన్ సంతానం జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇప్పటికే మేకర్స్ విడుదల చేశారు. అయితే చెన్నైలో వరదలు రావడంతో బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. రత్నం మూవీతో బిజీగా ఉన్న విశాల్.. తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ జీవిత కథను చదివినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. బ్రిట్నీ స్పియర్స్ రాసిన పుస్తకం 'ఉమెన్ ఇన్ మీ' చదివాక నాలో మనిషిని నిద్రలేపిందని అన్నారు. ఇక నుంచి మహిళలను మరింత గౌరవించాలనుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆర్టిస్టుల మనోభావాలను అర్థం చేసుకోవడం తెలుసుకున్నానని అన్నారు. ఆమె యూత్ ఐకాన్ అయినప్పటికీ చాలా చిన్న వయస్సులో జీవిత ప్రయాణం.. ఎదుర్కొన్న ఇబ్బందులు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. ఆమె జీవితంలో సాధించిన విజయాలకు.. ముఖ్యంగా స్తీలకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నానని అన్నారు. మీ జీవితంలో సరైన ఎంపిక, ధైర్యంతో.. మిమ్మల్ని మీరు ప్రపంచం సరళంగా అర్థం చేసుకునే విధంగా ఉండాలని విశాల్ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు మహిళలకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. ఉమెన్ ఇన్ మీ పుస్తకం.. ది ఉమెన్ ఇన్ మీ అనే పుస్తకాన్ని అమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ రాశారు. ఈ బుక్ అక్టోబర్ 24, 2023న 26 భాషల్లో విడుదలైంది. ఉమన్ ఇన్ మి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. Well, the transformation from b/w to color is the mood in my mind by Reading #BritneySpears #TheWomanInMe brings out the Man in me. Honestly makes me wanna respect women more. Especially understanding the psyche of performing artistes. Truly inspiring to read her life journey and… pic.twitter.com/H88utzadzV — Vishal (@VishalKOfficial) December 22, 2023 -
DERIVAZ AND IVES: జ్ఞాపకాల ‘రే’ఖలు
సత్యజిత్ రే చిత్రాలు కాలాతీతమైనవి. ఆ జ్ఞాపకాలు ఏ కాలానికైనా అపురూపమైనవి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ యాక్షన్ హౌజ్ డెరివాజ్ అండ్ ఐవ్స్ సత్యజిత్ రే సినిమాలకు సంబంధించి రేర్ పోస్టర్లు, ఫోటోగ్రాఫిక్ స్టిల్స్, లాబీ కార్డ్స్, సినాప్సిస్ బుక్‌లెట్స్‌తో పాటు ఆయన రూపొందించిన కళారూపాలను వేలం వేసింది. ఈ వేలంలో పాల్గొనడానికి రే అభిమానులు, సినీ పండితులు, ఆర్ట్ కలెక్టర్లు ఆసక్తి చూపుతున్నారు. కాలం కంటే ముందు ఉన్న ఆలనాటి పోస్టర్ డిజైనింగ్, కాలిగ్రాఫిక్ క్వాలిటీని అర్థం చేసుకోవడానికి... స్థూలంగా చెప్పాలంటే ఐకానిక్ ఫిల్మ్‌మేకర్ అద్భుత ప్రయాణాన్ని అన్వేషించడానికి ఈ వేలం ఒక సాధనం అవుతుంది. -
ఆ అనుభూతే వేరు
‘‘మన తొలి పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు వచ్చే అనుభూతే వేరే. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం’ అన్నారు ప్రియాంకా చోప్రా. ‘అన్ఫినిష్డ్’ టైటిల్‌తో తన ఆత్మకథను పుస్తకరూపంలో తీసుకొస్తున్నారామె. ఈ పుస్తకం వచ్చే ఏడాది జనవరిలో మార్కెట్లోకి రానుంది. ఈ ఆటోబయోగ్రఫీ ప్రింటింగ్ ఇంకా పూర్తి కాలేదట. అయితే పూర్తయిన కవర్ పేజీ ప్రింట్‌ని ప్రియాంకకు ఇచ్చారట. కొత్త పుస్తకం ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడటానికి ఆ కవర్ పేజీని వేరే పుస్తకానికి చుట్టి సరదా పడ్డానని ప్రియాంక పేర్కొన్నారు. ‘అన్ఫినిష్డ్’లో తన బాల్యం, నటిగా మారడం, బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లడం వంటి విషయాలన్నీ ప్రస్తావించారట ప్రియాంక. -
రికార్డు సృష్టిస్తున్న ఒబామా పుస్తకం
న్యూయార్క్ : యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రచించిన ‘‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’’పుస్తకం రికార్డులు సృష్టిస్తోంది. రిలీజైన తొలి 24 గంటల్లో ఈ బుక్ 8.9 లక్షల కాపీలు అమ్ముడైంది. ఆధునిక అమెరికా చరిత్రలో బెస్ట్ సెల్లింగ్ ప్రెసిడెన్షియల్ రచనగా నిలవనుంది. పెంగ్విన్ రాండమ్ హౌస్ విడుదల చేసిన ఈ పుస్తకం అమ్మకాలకు దగ్గరలోకి వచ్చే పుస్తకం ఒబామా భార్య మిషెల్ రచించిన ‘‘బికమింగ్’’ కావడం విశేషం. బుధవారానికి అమెజాన్, బారన్స్ అండ్ నోబుల్ డాట్‌కామ్ సైట్లలో ఒబామా బుక్ నంబర్ 1 స్థానంలో ఉంది. పది రోజుల్లో అమ్మకాలు మరిన్ని రికార్డులు సృష్టించవచ్చని అంచనాలున్నాయి. గతంలో బిల్ క్లింటన్ రచన ‘‘మైలైఫ్’’4 లక్షల కాపీలు, బుష్ రచన ‘‘డెసిషన్ పాయింట్స్’’2.2 లక్షల కాపీల మేర తొలిరోజు అమ్ముడయ్యాయి. ఒబామా పుస్తకం విడుదలైన సమయంలో దేశంలో అనిశ్చితి, సంక్షోభం(ఎన్నికలు, కరోనా తదితరాలు) నెలకొని ఉన్నా పుస్తక ప్రియులు మాత్రం విశేషంగా స్పందించారు. పుస్తకం ఆరంభించిన సమయంలో ఎన్నికల ఫలితాల నాటికి విడుదల చేయాలని తాను అనుకోలేదని ఒబామా చెప్పారు. గతంలో ఒబామా రచించిన ‘‘డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్’’, ‘‘ద ఆడిసిటీ ఆఫ్ హోప్’’ పుస్తకాలు సైతం విశేష ఆదరణ పొందాయి. పలువురు రివ్యూ రచయితలు తాజా పుస్తకాన్ని ప్రశంసించారు. -
కన్నీటి స్మృతిలో..!
సాక్షి, అరసవల్లి: ‘‘నేను ఏ గ్రామానికి వస్తున్నానో ముందే చెబితే అక్కడి అధికారులు లోపాలు సరిచేసి జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో పర్యటన రోజు ఉదయం కొద్ది గంటల ముందు మాత్రమే నేను వెళ్లే గ్రామం పేరు తెలియజేస్తా. ఆయా గ్రామాల్లో సమస్యలను ప్రత్యక్షంగా చూసి, ఆయా ప్రజలతో నేరుగా సమావేశమవుతా.. వారి సమస్యలు, వారి గుండె చప్పుళ్లు వినేందుకే నే వెళ్తున్నా’’. -2009 సెప్టెంబరు 2న ఉదయం ‘రచ్చబండ’ కార్యక్రమం కోసం హైదరాబాద్‌లో హెలికాప్టర్ ఎక్కేముందు మీడియాతో సీఎం రాజశేఖరరెడ్డి అన్న మాటలివి.. అదే రోజు ఉదయం 7.20 గంటలకు బయలుదేరిన హెలికాప్టర్ ఉదయం 10.45 గంటలైనా...గమ్యం చేరాల్సిన చిత్తూరు జిల్లాకు చేరకపోవడంతో రాష్ట్రమంతా ఉత్కంఠ మొదలైంది. టీవీల్లో ప్లాష్..ప్లాష్గా సీఎం హెలీకాప్టర్ అదృశ్యమంటూ కథనాలు...దీంతో రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవమైన వైఎస్ఆర్ ఎలా ఉన్నారో... క్షేమంగానే ఉన్నారో లేదోనన్న...ఆందోళనల మధ్య జనం కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్ రాకకోసం మొక్కని దేవుడు లేడు. జిల్లాలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు కాదు..కాదు మనసున్న మనిషి కూడా సర్వమత ప్రార్థనలు చేశారు. తమకు ఏం కావాలో అడగక్కుండా ఇచ్చిన దేవుడిగా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ కారణంతోనే ప్రజలంతా తమ ఇంట్లో సభ్యునికంటే ఎక్కువగా వైఎస్‌ను అభిమానించారు. ఆ అభిమాన వంతుడు, చిరునవ్వుల దేవుడైన వైఎస్ఆర్... హెలీకాప్టర్ ఆచూకీ కోసం కోట్లాది మంది జనం టీవీలకు అతుక్కుపోయారు. రాష్ట్రమంతటా అప్రకటిత ఖర్ఫ్యూ కనిపించింది. కోట్లాది మంది జనం గగ్గోలును, ఆర్తనాదాలను ఆ భగవంతుడు వినకుండా, ఈ భువిలో దేవుడిని దివిలోకి తీసుకుపోయాడు. దీంతో వందలాది మంది గుండె పగిలి ప్రాణాలొదిలారు. మరికొందరు నేటికీ సరిగ్గా కోల్కోలేకపోయారు. రాజన్నతో సన్నిహితంగా ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు ఆనాటి విషాదాన్ని నేటికీ మర్చిపోలేకపోతున్నారు. తట్టుకోలేకపోయాను.. పదేళ్ల క్రితం..ఇదే రోజు సీఎం వైఎస్సార్ హెలికా ఫ్టర్ ఆచూకీ తెలియ డం లేదన్న వార్త విన్నప్పుడు ఏంజరిగిందో అని ఆందోళ న చెంది తట్టుకోలేకపోయాను. టీవీలో ఎప్పటికప్పుడు సమాచారం చూస్తూనే.. రాజధాని నుంచి కూడా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశాను. నియోజకవర్గ ప్రజలతో పాటు నాభార్య పద్మప్రియ, పిల్లలందరిలోనూ ఒకటే ఉత్కంఠ..రాజన్న తిరిగిరా వాలని కోరుకున్నాం. వినకూడని వార్త వినాల్సి వచ్చింది. నన్ను ఎమ్మెల్యేని చేసిన ఆయన్ను నిత్యం తలచుకుంటాను. – నాటి ఎమ్మెల్యే, నేటి మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిజమైన నాయకుడు.. నా రాజకీయ జీవితంలో ఎందరో నేతలను చూశాను. అందరిలోనూ నాకు రాజశేఖరరెడ్డి అంటే అంతులేని అభిమానం. ఇప్పటికీ ఆయన లేరని తెలిస్తే..లోలోపల దుఃఖం వచ్చేస్తుంటుంది. ఆరోజు ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఆచూకీ సిగ్నల్స్‌కు దొరకడం లేదనగానే భయం వేసింది. అయితే ఎక్కడో ఆశ...మా రాజన్న వచ్చేస్తారులే అనుకున్నాం.. కానీ అంతటి దారుణం జరుగుతుందని ఊహించనేలేదు... అలాంటి ప్రజా నాయకుడు కోట్లలో ఒకడే పుడతారు. – నాటి మంత్రి, నేటి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఏడ్చేశాను... నాకు రాజకీయ ఓనమాలు నేర్పిన నా తండ్రి సమానులు దివంగత వైఎస్సార్. ఇదే రోజున ఆయన ప్రమాదవశాత్తు మరణించారని టీవీల్లో చూశాను. తండ్రి పోయిన బాధ కలిగింది. ఏడ్చేశాను. పాదయాత్రలో ఆయనతో కలిసి నడిచినప్పుడు.. నాయకుడు అంటే ఇలా ఉండాలి అనేంత స్ఫూర్తినిచ్చారు. శీనూ.. అని నోరారా పిలిచిన ఆ పిలుపు దూరమై పదేళ్లు దాటింది. నన్ను నా కుటుంబాన్ని సొంత కుటుంబసభ్యులుగా చూసిన ఆయన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మరిచిపోను. – దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రతి వర్ధంతికి పిండ ప్రదానం.. వైఎస్సార్ అంటే ఎనలేని అభిమానం నాకు. ఆయన చనిపోయారని చెబుతుంటే.. నిజం కాకూడదని దేవుళ్లకు మొక్కుకున్నాను. అయినప్పటికీ అదే నిజమైంది. ఆయన దూరమయ్యారు. పిడుగులాంటి ఈ వార్త విని ఎంతోమంది సొమ్మసిల్లిపోయారు. మా మండలంలో ఒకరు గుండెపోటుతో చనిపోయారు. నాటి నుంచి ప్రతి వైఎస్సార్ వర్ధంతికి నా ఇంట్లోనే పిండ ప్రదానం చేసి, అన్నదాన కార్యక్రమం చేస్తుంటాను. నిజంగా ఆయన ప్రజల కష్టాలు తెలుసుకుని తీర్చే దేవుడు. – సత్తారు వేణుగోపాలరావు, జయకృష్ణాపురం, టెక్కలి ప్రతి ఇంటా రోదనలే.. రాజన్న ప్రయాణిస్తున్న విమానం కనిపించడం లేదని తెలియడంతో అందరం కంటతడిపెట్టాం. క్షేమంగా బయట పడాలని అన్ని దేవుళ్లను మొక్కుకున్నాం. ఆ రాత్రి ఎలా గడిచిందో తెలియదు. ఇప్పటికీ టీవీల్లో దృశ్యాలు గుర్తు ఉండిపోయాయి. మా ఊరు రామాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయాలు వైఎస్సార్ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. రాజకీయాలకు అతీతంగా పూజలు చేశారు. ఆయన మరణించారనే వార్తను జీర్ణించుకోలేకపోయాం. – తాళాసు ప్రదీప్‌కుమార్, అభిమాని, వ్యాపార వేత్త, పలాస అపర భగీరథుడు రాజన్న! ఆమదాలవలస రూరల్: సిక్కోలు జిల్లాకు పాదయాత్రకు వచ్చినప్పుడు జిల్లా రైతులు పడుతున్న కష్టాలను చూసి ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి చలించిపోయారు. అన్నపూర్ణగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో సాగునీరు అందకపోవడంతో పంటలు పండటం లేదనే విషయాన్ని రైతులు నుంచి తెలుసుకున్నారు. అప్పుడే రైతులకు భరోసా ఇచ్చారు.. మంచి రోజులు వస్తాయి.. రైతన్న కల నెరవేరుతుందని చెప్పారు. ఆయన అన్నట్లుగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత వంశధార కుడికాలువకు అనుసంధానంగా అక్విడెక్ట్‌ను నిర్మించి వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేశారు. 2007లో ఆమదాలవలస మండలం తాండ్రసిమెట్ట వద్ద వంశధార కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా అక్విడెక్ట్ (వయోడెక్ట్)ను ప్రారంభించారు. ఈ సాగునీటి కాలువ నిర్మాణం లేక ముందు రెండు మండలాల్లో పంటపొలాలకు సాగునీరు అందక బీడు భూములుగా ఉండేవి. వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో వంశధార కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా అక్విడెక్ట్ నిర్మించారు. దీనివల్ల ఆమదాలవలస, శ్రీకాకుళం మండలాల్లో 32 వేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. ఈ అక్వాడెక్ట్ నిర్మాణం కూడా ఆసియా ఖండంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతంలోనే నిర్మించడం విశేషం. సిరులు కురిపిస్తున్న ఎత్తిపోతల పథకాలు.. జలుమూరు: తిండిగింజలు సైతం పండించుకోలేని తరుణంలో కుటుంబ అవసరాలకు సరిపడా ధాన్యం పండించి తిరిగి మార్కెట్లో మంచి ధరలకు అమ్ముకునే స్థితికి చేరుకునేలా ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసిన మహానాయకుడు వైఎస్సార్ అని జలుమూరు, సారవకోట, నరసన్నపేట రైతులు సగర్వంగా చెబుతుంటారు. 2006 ఫిబ్రవరి 9న సుమారు రూ.13 కోట్ల వ్యయంతో రాణా–లింగాలవలస, జలుమూరు, రామచంద్రపురం, వకోట మండలం తొగిరి గ్రామాల వద్ద శంకుస్థాపనలు చేసి, 2007–08లో దిగ్విజయంగా నాలుగు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. నరస్నపేటలో రూ.మూడు కోట్లతో జమ్ము వద్ద, పోలాకి మండలంలో మరో రెండు చోట్ల పథకాలు ప్రారంబించారు. వీటిని కొన్ని మరమ్మతులకు గురయ్యాయని, వాటిని వినియోగంలోకి తీసుకొస్తే సుమారు తొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు చెబుతున్నారు. ఇటీవల మంత్రి కృష్ణదాస్ కూడా వీటిపై దృష్టిపెట్టి అధికారులను వెంటబెట్టుకొని ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
మరపురాని మహానేత గురుతులు
సాక్షి, విశాఖ సిటీ : మంచితనానికి మరోపేరు..మానవత్వానికి ప్రతిరూపం..చిరునవ్వుకు చిరునామా..తెలుగోడి పౌరుషానికి ప్రతినిధి..అచ్చతెలుగు పంచెకట్టుకు వన్నెతెచ్చిన మగధీరుడు..పేదోడి గుండెచప్పుడు ఇలా ఎన్ని చెప్పుకున్నా ఆ మహనీయుడి కోసమే. వైఎస్సార్..ఈ మూడక్షరాలు తలంపుకొస్తే ఓ రైతన్నకు కొండంత ధైర్యం వస్తుంది..అక్కచెల్లమ్మలకు అన్న అండగా ఉన్నాడన్న భరోసా కలుగుతుం ది.. విద్యార్థి లోకానికి నేనున్నానంటూ పెద్దాయన వెన్నుతట్టి ప్రోత్సహించిన అనుభూతి కలుగుతుంది. పేదోడికి రాజన్న రాజ్యంలో ఉన్నానన్న ధీమా ఏర్పడుతుంది. జిల్లాలో ఆయన అందించిన అభివృద్ధి ఫలాలు కళ్ల ముందే కదలాడుతాయి. జిల్లా అభివృద్ధికి బాట.. జిల్లాలో 2004–2009 మధ్యలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేనంతగా జిల్లా రూపురేఖలు మార్చేసిన ఘనత వైఎస్సార్‌ది. పెండింగ్ ప్రాజెక్ట్‌లకు పునర్జీవం పోయడం..విశాఖ కార్పొరేషన్‌ను గ్రేటర్‌గా మార్చడం..లక్షలాది మంది సొంతింటి కలను సాకారం చేయడం..పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం..నగరంలో ఉన్న దాదాపు అన్ని పరిశ్రమలకు చేయూతనిచ్చి కార్మికులకు అండగా నిలవడంలో మహానేత తన ముద్ర చూపారు. సాధారణ కార్పొరేషన్‌గా ఉన్న విశాఖ నగరాన్ని గాజు వాక, మరో 32 పంచాయతీలను విలీనం చేసి 72 వార్డులుగా మార్చి 2005లో జీవీఎంసీగా మార్పు చేశారు. జేఎన్ఎన్యూఆర్ఎం ప్రాజెక్ట్ ద్వారా రూ.1500 కోట్లతో నగరంలో భూగర్భ డ్రైనేజీ చేపట్టారు. భాగ్యనగరానికి దీటుగా శీఘ్ర రవాణ వ్యవస్థ కోసం రూ.456 కోట్లు వెచ్చించి బీఆర్టీఎస్ రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. విస్తరణ వైఎస్ చలవే.. ప్రఖ్యాతిగాంచిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరమయ్యే స్థితికి చేరుకున్న దశలో వైఎస్సార్ ఆ ప్రక్రియను సమర్థవంతంగా ఆపగలిగారు. పరిశ్రమకు చేయూతనివ్వడంతో పాటు ఆనాడు కేంద్రంతో పోరాటం చేసి ప్లాంట్ విస్తరణకు శ్రీకారం చుట్టారు. తద్వారా విశాఖ ఉక్కు పరిశ్రము ఉత్పత్తిని రెట్టింపు చేసుకుంది. మూతపడిపోతున్న బీహెచ్ఈఎల్ను బీహెచ్‌పీవీలోకి వీలీనం చేయించారు. అదే స్థితిలో ఉన్న షిప్‌యార్డును నేవీలో విలీనం చేయించారు. ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్ విస్తరణకు పునాదులు వేశారు. అచ్యుతాపురంలో ఇండస్ట్రియల్ కారిడార్, భీమిలిలో ఐటీ కారిడార్, పరవాడ ఫార్మాస్యూటికల్ కారిడార్, దువ్వాడ ఐటీ సెజ్ ఇలా ఎన్నో పరిశ్రమలు వైఎస్సార్ పాలనలో విశాఖ సిగలో ఒదిగాయి. లక్షలాది మందికి ప్రత్యక్షంగా..పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందించారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు రూ.100 కోట్లు కేటాయించి అధునాతన టెర్మినల్ నిర్మాణం జరిపించారు. మూడున్నర లక్షల మందికి గూడు.. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,56,115 మందికి సొంత ఇంటి కలను సాకారం చేసిన ఘనత వైఎస్సార్‌ది. ఐదేళ్ల పాలనలో సాచురేషన్ పద్ధతిలో పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలతో పనిలేకుండా కేవలం అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రజలకు ఇళ్లు కట్టించారు. నగరంలో కూడా పునరావాస, పూర్‌సెటిల్‌మెంట్ కాలనీలను నిర్మించారు. ఇలా నగరంలో దాదాపు లక్ష మందికి సొంత గూడు కల్పించారు. అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీ.. వైఎస్సార్ అధికారం చేపట్టడానికి ముందు డ్వాక్రా రుణాలకు 14 శాతం వడ్డీ వసూలు చేసేవారు. వారికి అండగా నిలవాలన్న సంకల్పంతో వడ్డీ శాతాన్ని 4 శాతానికి(పావలా) తగ్గించి మహిళల జీవీతాల్లో వెలుగులు నింపారు. ఆయన పాలించిన ఐదేళ్ల కాలంలో సుమారు రూ.1000 కోట్లకు పైగా పావలా వడ్డీ రుణాలను డ్వాక్రా మహిళలు పొందారు. గోదావరి నీరు మళ్లింపు.. గోదావరి నీటిని విశాఖతో పాటు ఉత్తరాంధ్ర తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే సంకల్పంతో పోలవరం ఎడమకాలువను నిర్మించారు. తాండవ, రైవాడ, పెద్దేరు, కోనాం ప్రాజెక్టుల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ఏలేరు నీటిని మళ్లింంచి స్టీల్‌ప్లాంట్ నీటి సమస్యను తీర్చారు. సబ్బవరం కేంద్రంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనిపై తరువాత పాలకులు శ్రద్ధ వహించలేదు. కానీ తాజాగా వైఎస్సార్ తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పూర్తికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. బడ్జెట్లో రూ.170.06 కోట్లు కేటాయించింది. ఉచిత విద్యుత్ వెలుగులు.. జిల్లా వ్యాప్తంగా 25 వేల వ్యవసాయ సర్వీసులకు ఇప్పటికీ ఉచిత విద్యుత్ అందుతుంది అంటే అది కేవలం వైఎస్సార్ చలవే. రుణమాఫీ ద్వారా రాష్ట్రంలో 17 జిల్లాల పరిధిలో 77.55 లక్షల మంది రైతులకు రూ.1200 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. మాఫీ వర్తించని జిల్లాలోని 55 వేల మంది రైతులకు రూ.5 చొప్పున ప్రోత్సాహకం అందించి అండగా నిలిచారు. చెదరని జ్ఞాపకం వైఎస్సార్.. అక్కయ్యపాలెం: ప్రజల అవసరాలు, సంక్షేమం కోసం శ్రమించే నాయకుడు ఎన్నటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. దానికి సజీవ సాక్ష్యం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. మహానేత ఈ లోకాన్ని విడిచి దశాబ్దం గడుస్తున్నా.. ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో చెక్కుచెదరలేదు. ఆ మహానేతను దేవుడిలా పూజించే వారు ఎందరో ఉన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అల్పాహారం పంపిణీ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ పార్లమెంట్ కార్యదర్శి కొణతాల రేవతీరావు ఆదివారం అక్కయ్యపాలెం మెయిన్ రోడ్లో 500 మంది రోజువారి కూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు. మహానేత చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేమని, వైఎస్సార్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇండియన్ జిమ్ రాజేష్, ఆర్పీలు, వలంటీర్లు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ సంజీవనిలా ఆదుకుంది.. ఆరోగ్యశ్రీ పథకం నా కుటుంబాన్ని ఆదుకుంది. పెయింటింగ్ పనులు చేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాను. ఎంతో సంతోషంగా ఉంటున్న సమయంలో నా కుమార్తె షకీలాకు గుండెకు సంబంధించిన అనారోగ్యం చేసింది. నర్సు ఇచ్చిన సలహాతో ఆరోగ్యశ్రీ మా కుటుంబాన్ని సంజీవనిలా ఆదుకుంది. ఒక్క పైసా ఖర్చు లేకుండా కేర్ ఆస్పత్రిలో నా పాపకు ఆపరేషన్ చేయింగలిగాను. ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంది. – షేక్ మదీనా, పెయింటర్, సీతంపేట మది మదిలో రాజన్న.. కొయ్యూరు (పాడేరు): అపర భగీరథుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2005లో మన్యంలో ఎక్కువగా చెక్‌డ్యాంలను మంజూరు చేశారు. మన్యంలో వందకుపైగా డ్యాంలను ఇస్తే పాడేరు నియోజకవర్గంలో 50కు పైగా కొత్త చెక్‌డ్యాంలను మంజూరు చేశారు. దీని తరువాత జలాశయాలకు నిధులు ఇచ్చారు. దీని మూలంగా రైతుల పొలాలకు నీరు చేరింది. ఒక్క కొయ్యూరు మండలంలోనే 20కిపైగా చెక్‌డ్యాంలను నిర్మాణం చేశారు. దీంతో వర్షాధారంపై ఉన్న భూములకు నీరు వస్తుంది. కాట్రగెడ్డ, ఆకులపాడు, పోతవరం, గంగవరం, తీగలమెట్టతో పాటు అనేకచోట్ల చెక్‌డ్యాంలను నిర్మాణం చేశారు.అంతవరకు కొత్తగా చెక్‌డ్యాంలను నిర్మాణం చేయాలని ఎవరూ నిర్ణయించలేదు. రైతు క్షేమాన్ని ఆశించిన నాటి ముఖ్యమంత్రి మూలంగా కొన్నిచోట్ల రైతులు చెక్‌డ్యాంల మూలంగా పంటలను పండించుకోగలుగుతున్నారు. వాటిని నిర్మాణం చేసి 14 సంవత్సరాలు కావడంతో కొన్నిచోట్ల చెక్‌డ్యాంలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. వాటికి నిధులు వస్తే మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది. చెరకు రైతుకు వెన్నుదన్నుగా... అనకాపల్లి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అనకాపల్లి అంటే ఎంతో మక్కువ. ఈ ప్రాంతంలోని ప్రధాన పంట అయిన చెరకు, చెరకు ఉత్పత్తులైన పంచదార, బెల్లం పండించే రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన ఘనత ఆయనకే దక్కుతుంది. రాజకీయ లబ్ది కోసం తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని టీడీపీ నేతలు వాడుకోవడంతో పాటు 2002లో ఈ కర్మాగారాన్ని మూసివేశారు. వైఎస్ హయాంలో తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని నిధులు మంజూరు చేసి తెరి పించారు. బెల్లం రైతులకు కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రాంత రైతులు చేసిన ఉద్యమానికి వైఎస్ మద్దతుగా నిలిచారు. వ్యవసాయ పంటలకు సాగునీటి వనరైన శారదాలో గ్రోయిన్లు, ఆనకట్టల నిర్మాణానికి అప్పట్లోనే రూ.22 కోట్లు మంజూరు చేశారు. గూడు లేని నిరుపేదలకు రాజీవ్ గృహకల్ప, శంకరంలో రూ.32 కోట్లతో సమగ్ర మురుగు అభివృద్ధి పథకం, రూ.30 కోట్లతో సంపత్పురంలో మెగా రిజర్వాయర్‌తో పాటు ఎన్నో అభివృద్ధి ఫలాలు అందించిన వైనాన్ని ఇక్కడి వాసులు గుర్తు చేసుకుంటారు. బెల్లంరైతుకు తీపి పంచారు.. మునగపాక (యలమంచిలి): మహానేత రాజశేఖరరెడ్డితో మునగపాక ప్రాంతానికి ఎంతో అనుబంధం ఉంది. ప్రతిపక్ష నేత హోదాలో మునగపాక వచ్చిన రాజన్న స్థానిక రైతుల కష్టాలు అడిగి తెలుసుకోవడంతో పాటు బెల్లం తయారీ పరిశీలించిన సంఘటన ఉంది. ఏప్రిల్ 2002లో ప్రతిపక్ష నేత హోదాలో పరవాడ నుంచి అచ్యుతాపురం మీదుగా అనకాపల్లిలో జరిగిన మహిళా సదస్సుకు రాజశేఖరరెడ్డి వెళుతున్న సందర్భంలో మార్గమధ్యలో మునగపాకలోని ఆడారి పోలయ్య క్రషర్ వద్ద కొంతసేపు ఆగారు. రైతులు తయారు చేస్తున్న బెల్లాన్ని ఆసక్తిగా తిలకించడంతో పాటు రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. తాము పడుతున్న ఇబ్బందులను రైతు పోలయ్య ఈ సందర్భంగా రాజన్న దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులతో పాటు బెల్లానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. తాను అధికారంలోకి వస్తే రైతులకు మెరుగైన సేవలందిస్తానంటూ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రైతులకు వ్యవసాయ రంగానికి 7గంటల పాటు ఏకధాటిగా విద్యుత్ సరఫరాతోపాటు బెల్లానికి గిట్టుబాటు ధర కల్పించారు. రాజన్న సేవలు ఎన్నటికీ మరువలేం.. ఇచ్చిన మాట తప్పని నాయకుడంటే రాజన్న నే చెప్పుకోవాలి. తమ కష్టాలు నేరుగా తెలుసుకున్న రాజన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. రైతు పక్షపాతిగా రాజన్న నిలిచారు. రాజన్న ఇచ్చిన హామీలు అమలు జరగడంతోపాటు రైతులకు మేలు జరిగేలా పాలన అందించారు. రాజన్న సేవలను ఎప్పటికీ మరువలేం. – ఆడారి పోలయ్య, రైతు, మునగపాక -
లవ్‌స్టోరీ వివాదం.. నటుడి కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: తన జ్ఞాపకాలను పుస్తకంగా రాస్తే దానిలో అభూత కల్పనలే ఉంటాయని బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అన్నారు. ‘ఆన్ ఆర్డినరీ లైఫ్’ పేరిట గతేడాది తాను రాసిన ఆత్మకథలో ఐదు పేజీలు తన ప్రేమాయణం గురించి రాయడంపై విచారం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో తమ కలను సాకారం చేసుకునేందుకు చిన్న పట్టణాల నుంచి వచ్చే వారికి ప్రేరణగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకం రాసినట్టు ‘బాలీవుడ్ హంగామా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 209 పేజీలున్న ఈ పుస్తకంలో 5 పేజీలు మాజీ ప్రియురాళ్లు నిహారిక సింగ్, సునీత రాజ్వర్లతో సాగించిన ప్రేమాయణం గురించి నవాజుద్దీన్ పూసగుచ్చారు. సిద్ధిఖీ మొత్తం అబద్ధాలే చెప్పాడంటూ అతని మాజీ ప్రేయసిలు అతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో ఈ పుస్తకాన్ని రద్దు చేస్తున్నట్లు గతేడాది అక్టోబర్‌లో ప్రకటించారు. అంతేకాదు క్షమాణలు కూడా చెప్పారు. ఈ వివాదం జరిగి ఏడాదైన సందర్భంగా మాట్లాడుతూ.. ‘పుస్తకంలో మొత్తం 209 పేజీలున్నాయి. కేవలం 5 పేజీల కారణంగా నా ప్రయత్నాన్ని వృధా చేస్తారా? నా ప్రేమకథను బయపెట్టినందుకు వివాదం చెలరేగుతుందని ఊహించలేదు. వాస్తవాలను చెప్పాలని మాత్రమే అనుకున్నాను. ఎవరి జీవితంలోనైనా వాస్తవం అనేది కథలా ఉండద’ని నవాజుద్దీన్ అన్నారు. ఇక ముందు తన జీవిత చరిత్ర రాస్తే అందులో అబద్దాలే ఉంటాయని చెప్పారు. -
మనిషికి బతకాలనే ఆశ ఉండాలి...
తురగా జానకీరాణి... ఒక కథకురాలు... ఒక నవలా రచయిత్రి... రేడియో ప్రయోక్త... ఒక గాయని... ఒక నర్తకి... ఒక నటి... చదువులో బంగారు పతకాలు... ఉద్యోగంలో జాతీయ అవార్డులు... బాలానందం కార్యక్రమంతో ఆకాశవాణి జీవితం ప్రారంభం... ప్రొడ్యూసర్‌గా పదవీ విరమణ... జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు... అన్నిటినీ అధిగమించారు... జానకీరాణిగారు అక్టోబరు 15, బుధవారం గతించడానికి కొన్ని వారాల ముందు ‘సాక్షి’తో కొన్ని జ్ఞాపకాలు పంచుకున్నారు. ఇదే ఆవిడ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ... ఆ స్పర్శ చల్లగా ఉంది... నా ఆరో ఏట ఒకసారి మహాత్మాగాంధీ మా ఊరు వచ్చారు. ఆయనను చూడటానికి జనమంతా వెళ్తుంటే నేను కూడా వాళ్లతో వెళ్లాను. ఆయన ఒక్కో అడుగు వేస్తుంటే, ప్రజలంతా ఆయన కాళ్ల దగ్గర ఉన్న ఇసుకను దోసెళ్లతో ఎత్తి నెత్తిన పెట్టుకున్నారు. నేను ఆయన మెడలో వేయడానికి తీసుకువెళ్లిన ఎర్రగులాబీల దండలో పూలన్నీ, ఆయన దగ్గర చేరే లోపే రాలిపోయాయి. ఆయన ఆ దండ తీసుకుని, నా తల మీద మృదువుగా నిమిరారు. ఆయన చేతి స్పర్శ నాకు చల్లగా అలాగే ఉండిపోయింది. ఆయనకు ‘జి’ అని రాసి ఉన్న నా చేతి ఉంగరాన్ని ఇస్తుంటే, తన చిటికెనవేలితో తీసుకుని ‘ఇది ఎందుకు?’ అన్నారు. ‘కస్తూర్బా ఫండ్’ కి అన్నాను. ఆయన నన్ను ఆశీర్వదించారు. బాలానందంతో ప్రారంభం...: చిన్నప్పటి నుంచే ఆకాశవాణి బాలానందం కార్యక్రమంలో పాల్గొన్నాను. అబ్బూరి వరదరాజేశ్వరరావు రచించిన ‘ఒరియా’ అనువాద నాటకం లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో పాటలు పాడాను. ‘‘నీ కంఠంలో కరుణరసం బాగా పలుకుతుంది’’ అన్నారు సినారె. విశ్వనాథ సత్యనారాయణ గారి ‘కోకిలమ్మపెళ్లి’ నాటకంలో చిలకతల్లి వేషం వేశాను. విదేశీ ప్రసారాల కోసం బాలమురళిగారు మా చేత జోలపాటలు, ఉయ్యాల పాటలు, అప్పగింతల పాటలు పాడించారు. వివాహ బంధం... నా 12వ ఏట తురగా కృష్ణమోహన్‌గారు (అప్పటికి ఆయన వయసు 18) నా వెంటపడ్డారు. ‘ఒక మనిషి ఇంకో మనిషిని అంతగా ప్రేమించగలరా’ అనుకునేంతగా ఆయన నన్ను ఇష్టపడ్డారు. అందుకే నేను ఆయన అభిమానంలో చిక్కుకుపోయాననుకుంటాను. మా మధ్య స్నేహం సుమారు పది సంవత్సరాలు నడిచింది. ఏది ఎలా ఉన్నా చదువులో మాత్రం ముందుండేదాన్ని. డిగ్రీ, పీజీలలో గోల్డ్‌మెడల్స్ సాధించాను. 1959 లో నా 22వ ఏట మా వివాహం జరిగింది. అప్పుడు ఆయన ఆంధ్రపత్రికలో పనిచేస్తుండేవారు. నేను ఇంట్లో తలనొప్పితో బాధపడుతుంటే, ఆఫీసులో అందరికీ నా గురించి చెబుతూ ఆయన కూడా బాధపడేవారని ఆయన స్నేహితులు చెప్పేవారు. అంత ప్రేమగా ఉండేవారు ఆయన. కొంతకాలానికి ఆయన ఆంధ్రపత్రిక నుంచి ఆకాశవాణిలో వార్తావిభాగంలో చేరారు. నేను ‘సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్’లో చేరి పదిహేనేళ్లు పనిచేశాను. నిజాయితీ గల ఆఫీసరుగా పేరు తెచ్చుకున్నాను. మారిన జీవితం...: ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం ఉద్యోగం మానేశాను. మేమిద్దరం... మాకిద్దరు... అన్నచందాన ఎంతో అన్యోన్యంగా ఉంటున్న నా జీవితం ఊహించని మలుపు తిరిగిపోయింది. 1974 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయనకు ఆ రోజు ఉదయం కాఫీ ఇచ్చిన గ్లాసు ఇంకా కిటికిలోనే ఉంది, ఇంతలో మృతదేహం వచ్చింది. ఎన్నో ఏళ్లు కుమిలికుమిలి ఏడ్చాను. కాలం నెమ్మదిగా గాయాల్ని మాన్చింది. పిల్లల్ని చూసుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఏ పిల్లల కోసం నేను ఉద్యోగం మానేశానో, అదే పిల్లల కోసం మళ్లీ ఉద్యోగంలో చేరాను. ఆకాశవాణి ప్రొడ్యూసర్‌గా ... 1974లో ఆకాశవాణి ప్రొడ్యూసర్‌గా చేరి 1995లో రిటైరయ్యేవరకు అక్కడే కొనసాగాను. ఆకాశవాణి అప్పుడొక స్వర్ణయుగం. నేను పనిచేసిన 20 సంవత్సరాల కాలంలో రేడియోలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాను. ‘అందరికీ చదువు’ అనే కార్యక్రమం ప్రసారం చేసినప్పుడు, అన్ని జిల్లాల నుంచి అక్కడి బడి పరిస్థితులను వివరిస్తూ ఉత్తరాలు వచ్చేవి. వాటిని విద్యాశాఖ కార్యదర్శికి పంపేదాన్ని. ఇంకా... పిల్లల కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాలు, నవయుగం, నవలా స్రవంతి, సమత, బాలవిహార్, మహిళా సమాజం... వంటి కార్యక్రమాలు చేశాను. అనేక బాలకవిసమ్మేళనాలు నిర్వహించాను. ‘బ్రాడ్‌కాస్టర్’ అనే పదానికి బదులు ‘ప్రసారకర్త’ అనే పదాన్ని వాడటం ప్రారంభించింది నేనే. దాశరథి కృష్ణమాచారిగారు మా స్టేషన్ డెరైక్టర్‌తో ‘జానకీరాణి తెలుగుభాషకు చాలా సేవచేస్తోంది’ అంటూ నన్ను అభినందించారు. వందేమాతరం... ‘ఆనంద్‌మఠ్’ నవల రచించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేడియోలో సెలట్రేబ్ చేయమన్నారు. వందేమాతరం గీతంలోని ‘సుజలాం, సుఫలాం’ వాక్యాన్ని తీసుకుని డా. సి. నారాయణరెడ్డిగారితో ‘‘మంచుకొండలను దిగివచ్చింది మా గంగమ్మ... మనసే మురళిగా మలచుకొంది మా యమునమ్మ...’’ అని పాట రాయించాను. ఈ కార్యక్రమం ఆహ్వానపత్రికలో ‘దృశ్య గీతి’ అని వేస్తే, అలా ఎందుకు వేశారని అందరూ నన్ను అడిగారు. అందుకు నేను ‘అది దృశ్యం కాదు, శ్రవ్యం కాదు, చూడవలసిన గీతి కనుక అలా వేశాను’ అని చెప్పాను. ఇలా ఎన్ని కార్యక్రమాలు చేశానో నాకే గుర్తు లేదు. గుర్తున్నంతవరకు కొన్ని మాత్రమే చెప్పగలిగాను. ఇప్పుడు నా వయసు 78. అయినా నా మనసు మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంది. ఇప్పటికీ ఏ ప్రోగ్రామ్‌కి పిలిచినా వెళ్లిపోతాను. రేడియోవాళ్లు నా గురించి నాతో మాట్లాడించి ఆరు భాగాలు టేప్ చేశారు. ‘బతకాలి బతకాలి’ అన్నదే నా ఫిలాసఫీ. జీవితం చాలా విలువైనది. మనం బతికున్నామంటే అది ఒక వరం. మనిషికి బతకాలనే ఆశ ఉండాలి. అప్పుడే జీవితంలో అన్నిటినీ ఎదుర్కోగలుగుతాం... అంటూ ముగించారు. - డా॥వైజయంతి తాతగారి ఆశీస్సులే కారణం... చిన్నప్పుడే నేను కథలు రాయడానికి ఒక రకంగా మా తాతయ్య చలంగారి ఆశీస్సులే కారణం. నాకు 15 సంవత్సరాల వయసున్నప్పుడు తిరువణ్నామలై వెళ్లి ఆయన్ని కలిశాను. ఆయన నా కంటె 50 సంవత్సరాలు పెద్ద. ఆయన్ని నేను ఎన్నోరకాల ప్రశ్నలు వేసి వేధించాను. అన్నిటికీ ఆయన ఓరిమిగా సమాధానాలు చెప్పారు. ‘‘నువ్వు హృదయం ఉన్న పిల్లవు. నీలోంచి ఆలోచనలు పెళ్లగించుకుని వస్తేనే కథలు రాయి’’ అన్నారు. ఆయన మాటలు నా మనసులో ముద్ర వేసుకున్నాయి. ఆయన నాకు 16 ఉత్తరాలు రాశారు. ఆయనతో పరిచయం నాకు గొప్ప అనుభవం. అంత పెద్దమనిషి చేత నేను ప్రశంసలు పొందానని నాకు గర్వంగా ఉండేది. కృష్ణార్జున సంవాదంలో కృష్ణుడు వేషం వేశారు. మొట్టమొదటి కథ 15వ ఏట కృష్ణాపత్రికలో పడింది. వెంపటి చిన సత్యం గారి దగ్గర భరతనాట్యం నేర్చుకుని, అనేక ప్రదర్శనలిచ్చారు. నాట్యంలో డిప్లమా చేశారు. చినసత్యంగారు ఇచ్చిన గజ్జెలు ఇప్పటికీ ఆవిడ దగ్గరున్నాయి. ‘నిశ్శబ్దంలో ప్రయాణాలు’ అని మూగచెముడు వారికోసం, ‘ఆశ్రయం’ అని వయోవృద్ధుల కోసం చేసిన కార్యక్రమాలకు, పిల్లల కోసం రచించిన బాల గేయాలకు రెండుసార్లు... మొత్తం నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. 1963లో ‘అఖిలభారత రచయిత్రుల సంఘం’ ఏర్పాటుచేశారు. ఆ ప్రారంభోత్సవానికి విజయలక్ష్మీ పండిట్ వచ్చారు.