ఆ అనుభూతే వేరు | Priyanka Chopra is absolutely elated holding her memoir Unfinished | Sakshi
Sakshi News home page

ఆ అనుభూతే వేరు

Published Sat, Dec 12 2020 12:07 AM | Last Updated on Sat, Dec 12 2020 5:09 AM

Priyanka Chopra is absolutely elated holding her memoir Unfinished - Sakshi

‘‘మన తొలి పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు వచ్చే అనుభూతే వేరే. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం’ అన్నారు ప్రియాంకా చోప్రా. ‘అన్‌ఫినిష్డ్‌’ టైటిల్‌తో తన ఆత్మకథను పుస్తకరూపంలో తీసుకొస్తున్నారామె. ఈ పుస్తకం వచ్చే ఏడాది జనవరిలో మార్కెట్‌లోకి రానుంది. ఈ ఆటోబయోగ్రఫీ  ప్రింటింగ్‌ ఇంకా పూర్తి కాలేదట. అయితే పూర్తయిన కవర్‌ పేజీ ప్రింట్‌ని ప్రియాంకకు ఇచ్చారట. కొత్త పుస్తకం ఫీలింగ్‌ ఎలా ఉంటుందో చూడటానికి ఆ కవర్‌ పేజీని వేరే పుస్తకానికి చుట్టి సరదా పడ్డానని ప్రియాంక పేర్కొన్నారు. ‘అన్‌ఫినిష్డ్‌’లో తన  బాల్యం, నటిగా మారడం, బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి వెళ్లడం వంటి విషయాలన్నీ ప్రస్తావించారట ప్రియాంక.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement