Unfinished Book: Priyanka Chopra Reveals About Personal Life - Sakshi
Sakshi News home page

ప్రియాంక ఆత్మకథ: విస్తుపోయే విషయాలు వెల్లడి

Published Thu, Feb 11 2021 1:11 PM | Last Updated on Thu, Feb 11 2021 3:32 PM

Priyanka Chopra Recalls Initial Days Bitter Experience In Movies In Auto Biography - Sakshi

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా స్టార్‌ హీరోయిన్‌గా‌ ఎదిగి గ్లోబల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు ప్రియాంక చోప్రా. ‘బెవాచ్‌’తో హాలీవుడ్‌లో అడుగుపెట్టి ప్రియాంక అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో 2018లో అమెరికా సింగర్‌ నిక్‌ జోన్‌స్‌ పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె అమెరికాకు మాకాం మార్చి హాలీవుడ్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.

ఈ నేపథ్యంలో ప్రియాంక తన ఆటోబయోగ్రఫి రాయాలని నిశ్చయించుకున్నారు. వెంటనే ‘అన్‌ఫినిష్డ్‌‌’ పేరుతో స్వయంగా తన ఆత్మకథను రాసుకున్నారు. అది పూర్తి చేసి ఇటీవల ఫిబ్రవరి 9న ఈ బుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె ప్రస్తావించిన కొన్ని సంఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రియాంకా సైతం ఇలాంటి చేదు సంఘటనలను చుశారా! అని ఆమె ఆత్మకథ చదివిన వారంత విస్తుపోతున్నారు. ఇక నిర్మోహమాటంగా తనకు ఎదురైన చేదు అనుభవాలను గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడంతో ప్రియాంకపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

యూపీలోని ఓ చిన్న గ్రామం నుంచి మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ గెలవడం.. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం వరకు ప్రతి విషయాలను ప్రియాంక ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. అయితే కేరీర్‌ ప్రారంభంలో తనను దర్శకులు చులకనగా చూసేవారంటూ తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. ఈ పుస్తకంలో ‘ఓ సినిమాలో ఐటెం సాంగ్‌ చేసే సమయంలో ఆ చిత్ర దర్శకుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా దుస్తులను విప్పేయాలని చెప్పినట్లు చెప్పారు. ఒక్కొక్కొ షాట్‌లో ఒక్కొ వస్త్రం విప్పుతూ లోదుస్తులు కనిపించాలన్నాడు. అలా అయితే ఈ సాంగ్‌ చేయనని నిక్కచ్చిగా చెప్పాను. అయినా ఆ డైరెక్టర్‌ వినకుండా నన్న బలవంత పెట్టాడు. అయితే శరీరం కనిపించకుండా స్కిన్‌ కలర్‌ దుస్తులు ధరిస్తానని చెప్పడంతో ఆ డైరెక్టర్‌ కోపంతో అరిచాడు.

ఇక ఇదే విషయాన్ని స్టైలిస్ట్‌కు చెప్పగా అతడు కూడా ఇదే మాట చెప్పాడు. మీరు ఏలాంటి దుస్తులు ధరించిన తప్పనిసరి మీ లోదుస్తులు కనిపించాలన్నాడు. అలా అయితేనే ప్రేక్షకులు సినిమా చూసేందుకు థియేటర్‌కు వస్తారన్నాడు. అయితే అలా చేయడం నాకు ఇష్టం లేదని, ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు డైరెక్టర్‌కు చెప్పేశాను. అంతటితో ఈ వివాదం ఆగలేదు. నేను మరో మూవీ సెట్స్‌లో ఉన్నప్పుడు ఆ దర్శకుడు వచ్చి నాతో వాగ్వాదానికి దిగాడు. ఇక చివరకు ఈ విషయంలో హీరో సల్మాన్‌ ఖాన్‌ జోక్యం చేసుకోవడంలో వివాదం సద్దుమనిగింది’ అని ఆమె రాసుకొచ్చారు.

ఇక 2000 సంవత్సరంలో మిస్‌ వరల్డ్‌ అయ్యాక సినిమాలో నటించాలనే ఆశతో మొదట్లో ఓ మూవీ ఆడిషన్స్‌కు వెళ్లానని, అక్కడ నిర్మాత తనను చూట్టు తిరగమని చెప్పి కాసేపు అలాగే తదేకంగా చూసినట్లు చెప్పారు. ఆ తర్వాత తన చెస్ట్‌ చిన్నగా, బటక్స్‌ పెద్దగా ఉన్నాయని, శరీరంలో మార్పు చేసుకోవాలని సలహా ఇచ్చినట్లు ఆమె పుస్తకంలో వివరించారు. కాగా ప్రియాంక తన ఆత్మకథ తానే స్వయంగా రాసుకోవడంతో ఈ పుస్తకాన్ని కోనేందుకు అభిమానులు నుంచి ప్రముఖుల వరకు ఎగబడుతున్నారంట. దీంతో మార్కెట్లో ఈ బుక్‌ విపరీతంగా అమ్ముడు పోతున్నట్లు సమాచారం.

(చదవండి: చర్మం రంగు ముఖ్యం కాదని తెలుసుకున్నా)
(‘సలార్‌‌’ స్పెషల్‌ సాంగ్‌లో ప్రియాంక చోప్రా!)
(పెళ్లికి ముందు ఆ ఒప్పందం పెట్టుకున్నాం: ప్రియాంక)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement