అన్‌ఫినిష్డ్‌ పూర్తయింది | Priyanka Chopra Unveils Cover Photo Of Her Memoir Unfinished | Sakshi
Sakshi News home page

అన్‌ఫినిష్డ్‌ పూర్తయింది

Published Sun, Oct 4 2020 6:43 AM | Last Updated on Sun, Oct 4 2020 6:43 AM

Priyanka Chopra Unveils Cover Photo Of Her Memoir Unfinished - Sakshi

‘‘నేను ఇక్కడ వరకూ ఎలా వచ్చానో మీకు చాలావరకూ తెలుసు. నా ప్రయాణాన్ని పూర్తిగా ఈ పుస్తకం ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను’’ అని తన ఆటోబయోగ్రఫీ ‘అన్‌ఫినిష్డ్‌’ గురించి అన్నారు ప్రియాంకా చోప్రా. ఈ పుస్తకం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ఈ పుస్తకం కవర్‌ ఫోటోను, విడుదల తేదీని ప్రకటించారామె. జనవరి 19న ఈ ‘అన్‌ఫినిష్డ్‌’ పుస్తకం మార్కెట్‌లోకి రానుంది. ఇందులో ప్రియాంక తన బాల్యం, నటిగా తన ప్రయాణం, హాలీవుడ్‌కి వెళ్లడం వంటి విషయాలన్నీ చర్చించారట. ‘‘ఈ పుస్తకంతో మీ అందర్నీ నాతో పాటుగా ప్రయాణం చేయిస్తాను అని అనుకుంటున్నాను’’ అన్నారు ప్రియాంక.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement