ప్రముఖ అమెరికన్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం వెండితెరపైకి రానుంది. తన జీవితం ఆధారంగా బ్రిట్నీ స్పియర్స్ ‘ది ఉమెన్ ఇన్ మీ’ (మెమొర్) అనే పుస్తకం రాశారు. ఇందులో బ్రిట్నీ ప్రేమ విశేషాలు, చేదు అనుభవాలు, కుటుంబ విశేషాలు.. ఇలా చాలా అంశాలు ఉన్నాయట. ఇరవైఆరు భాషల్లో రిలీజ్ అయిన ఈ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది. అంతేకాదు.. ఈ పుస్తకం ఆడియో వెర్షన్‌కు ప్రముఖ హాలీవుడ్ నటి మిచెల్ విలియమ్స్ వాయిస్ ఇచ్చారు.
ఈ బుక్ హక్కులను యూనివర్సల్ పిక్చర్స్ దక్కించుకుంది. దీంతో బ్రిట్నీ బయోపిక్ ప్రస్తుతం హాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. దర్శకుడు జోన్ ఎమ్ చు ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారని, మార్క్ ప్లాట్ నిర్మించనున్నారని టాక్. ఇక ‘నా ఫేవరెట్ మూవీస్ తీసిన మార్క్ ప్లాట్‌తో ఓ సీక్రెట్ ్రపాజెక్ట్ చేస్తున్నానని నా ఫ్యాన్స్‌కు చెప్పడానికి హ్యాపీగా ఉంది’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు బ్రిట్నీ.
Comments
Please login to add a commentAdd a comment