Pop star Britney Spears
-
తెరపైకి బ్రిట్నీ జీవితం
ప్రముఖ అమెరికన్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం వెండితెరపైకి రానుంది. తన జీవితం ఆధారంగా బ్రిట్నీ స్పియర్స్ ‘ది ఉమెన్ ఇన్ మీ’ (మెమొర్) అనే పుస్తకం రాశారు. ఇందులో బ్రిట్నీ ప్రేమ విశేషాలు, చేదు అనుభవాలు, కుటుంబ విశేషాలు.. ఇలా చాలా అంశాలు ఉన్నాయట. ఇరవైఆరు భాషల్లో రిలీజ్ అయిన ఈ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది. అంతేకాదు.. ఈ పుస్తకం ఆడియో వెర్షన్‌కు ప్రముఖ హాలీవుడ్ నటి మిచెల్ విలియమ్స్ వాయిస్ ఇచ్చారు. ఈ బుక్ హక్కులను యూనివర్సల్ పిక్చర్స్ దక్కించుకుంది. దీంతో బ్రిట్నీ బయోపిక్ ప్రస్తుతం హాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. దర్శకుడు జోన్ ఎమ్ చు ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారని, మార్క్ ప్లాట్ నిర్మించనున్నారని టాక్. ఇక ‘నా ఫేవరెట్ మూవీస్ తీసిన మార్క్ ప్లాట్‌తో ఓ సీక్రెట్ ్రపాజెక్ట్ చేస్తున్నానని నా ఫ్యాన్స్‌కు చెప్పడానికి హ్యాపీగా ఉంది’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు బ్రిట్నీ. -
అంతటి బ్రిట్నీ స్పియర్స్ కు ఇంతటి ఘోర అవమానమా?
లాస్ వెగాస్: ప్రఖ్యాత పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ కు లాస్ వెగాస్ లోని ఓ హోటల్లో ఘోర అవమానం జరిగింది. ప్రముఖ ఎన్బీఏ స్టార్ ఫ్రాన్స్ కు చెందిన విక్టర్ వెంబన్యామ(19)కు వీరాభిమాని అయిన బ్రిట్నీ స్పియర్స్ అతడితో ఒక ఫోటో కోసం వెంటపడగా సెక్యూరిటీ వారు ఆమెను నెట్టివేశారు. ఈ సంఘటన వైరల్ కావడంతో ఒకప్పుడు తన పెర్ఫార్మెన్స్ లతో యువతను ఉర్రూతలూగించిన క్రేజీ పాప్ స్టార్ కు ఇంతటి అవమానమా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. బ్రిట్నీ స్పియర్స్ డిన్నర్ చేయడానికి వెగాస్ లోని అరియా హోటల్ కి వెళ్ళింది. అక్కడ అనుకోకుండా ప్రముఖ స్పర్స్ ఆటగాడు విక్టర్ వెంబన్యామ కనపడటంతో అతడితో ఒక ఫోటో తీసుకోవాలని అతడి దగ్గరకు వెళ్ళింది. అప్పటికే ఎన్బీఏ స్టార్ చుట్టూ అభిమానులు మూగడంతో బ్రిట్నీ అతని వీపు మీద వెనుకనుండి చరిచింది. అక్కడే ఉన్న వెంబన్యామ సెక్యూరిటీ చీఫ్ డామియెన్ స్మిత్ ఇది గమనించి ఆమెను బలంగా తోసేశాడు. దీంతో బ్రిట్నీ స్పియర్స్ కింద పడిపోయింది. ఆమె కళ్లద్దాలు కూడా కింద పడిపోయాయి. తర్వాత బ్రిట్నీ లేచి తన టేబుల్ వద్దకు వెళ్లిపోగా కొద్దిసేపటికి సెక్యూరిటీ చీఫ్ స్మిత్ ఆమె దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాడు. ఆ సమయంలో స్మిత్ ను క్షమించినట్టే కనిపించిన బ్రిట్నీ స్పియర్స్ అతడితో కొద్దిసేపు నవ్వుతూ సంభాషించింది కూడా. కానీ డిన్నర్ పూర్తయిన తర్వాత నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి జరిగిందంతా నివేదించింది. ప్రస్తుతం ఈ సంఘటనపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో వెంబన్యామ మాట్లాడుతూ.. ఎవరో తనను వెనుక నుండి బలంగా హత్తుకున్నారని, సెక్యూరిటీ వారిని బలంగా నెట్టి వేశారని తెలుసు.. తర్వాత తెలిసింది వారు తోసింది బ్రిట్నీ స్పియర్స్ నని. కానీ ఆమె చెబుతున్నట్లుగా ఆమె మెల్లగా తట్టలేదు బలంగా హత్తుకుందని వివరణ ఇచ్చాడు. దీనికి మళ్ళీ బ్రిట్నీ స్పందిస్తూ.. తాను వెంబన్యామను బలంగా కొట్టలేదని సున్నితంగా పిలిచానని చెబుతూ విషయమంతా వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది కూడా చదవండి: భావప్రకటన అంటే.. హింసకు పాల్పడటం కాదు.. View this post on Instagram A post shared by Maria River Red (@britneyspears) -
బొద్దుగా ఉంటే ముద్దు కాదా?
పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్‌కి ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులున్నారు. మెరుపు తీగలా కనిపించే బ్రిట్నీ ఒకప్పుడు బొద్దుగా ఉండేవారు. ఇలా ఉంటే ముద్దుగా ఉండదనుకున్నారు. వ్యాయామాలూ, డైట్లతో తగ్గాలంటే కొన్ని నెలలు పడుతుంది. అదే, లైపో సక్షన్ అయితే ఈజీగా తగ్గేయొచ్చు కదా. అందుకే, ఆమె లైపో చేయించుకోవాలనుకున్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఆమె లైపో చేయించుకున్నారనే వార్త హాలీవుడ్లో ప్రచారమైంది. బ్రిట్నీ అవతారం ఆ ప్రచారానికి ఊతమిచ్చింది. నిన్న మొన్నటిదాకా బొద్దుగా కనిపించిన ఆమె హఠాత్తుగా స్లిమ్ సుందరి అయిపోయారు.