పైథాగరస్‌గారి మతం
క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దానికి చెందిన పైథాగరస్ గణితవేత్తగా సుప్రసిద్ధుడు. ఆయన ప్రతిపాదించిన గణిత సూత్రాలను ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పటికీ చదువుకుంటున్నారు. ఖగోళ శాస్త్రంలోను, సంగీతంలోను అతడికి ఘనమైన ప్రావీణ్యమే ఉండేది. అరిస్టాటిల్, ప్లాటో వంటి తత్వవేత్తలపై ప్రభావం చూపిన పైథాగరన్, ఒక చిత్ర విచిత్ర విలక్షణ మతాన్ని కూడా స్థాపించాడు. అప్పట్లో ఈ మతాన్ని అనుసరించేవారు ఎందరుండే వారో తెలియదు గానీ, ఇప్పుడైతే ఇది ఉనికిలో లేదు. ఆయన ప్రతిపాదించిన ఆచారాల ప్రకారం.. ఎట్టి పరిస్థితుల్లోనూ బీన్స్ తినరాదు. రాచబాటలపై పాదచారులు నడవరాదు. పొయ్యిపై నుంచి పాత్రను తీసేశాక, దాని గుర్తు పొయ్యిబూడిదపై లేకుండా చూసుకోవాలి. ఇళ్ల పైకప్పుల కింద పక్షులు గూళ్లు పెట్టకుండా చూసుకోవాలి.. ఇలాంటి వింతాచారాలను తెలుసుకుంటే ఈ మతం ఎందుకు అంతరించిందో అర్థంకావడం లేదూ!