
హడ్సన్ నదిపై నిర్మించనున్న పార్కు ఊహాచిత్ర
న్యూయార్క్‌లోని హడ్సన్ నదిపై నిర్మించనున్న పార్కు ఊహాచిత్రమిది. నీటిపై తేలియాడే పార్కు అన్నమాట. పుట్టగొడుగు షేపులో ఉండే 300 కాంక్రీట్ దిమ్మెలతో ఏర్పాటు చేసే ప్లాట్‌ఫాంపై ఈ పార్కును నిర్మించనున్నారు.
2.7 ఎకరాల్లోని ఈ పార్కులో మూడు ఓపెన్ ఎయిర్ థియేటర్లతోపాటు షాపింగ్ ప్లాజా ఉంటుంది. మొత్తం వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ పార్కు నిర్మాణం 2016లో ప్రారంభమవుతుంది.
**