దుబాయ్‌లో భర్త.. కన్నుమూసిన ఏడు నెలల గర్భిణి | pregnancy woman died in jagtial | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో భర్త.. కన్నుమూసిన ఏడు నెలల గర్భిణి

Published Wed, Jul 24 2024 11:29 AM | Last Updated on Wed, Jul 24 2024 11:33 AM

pregnancy woman died in jagtial

ముస్తాబాద్‌(సిరిసిల్ల): కడుపులో పెరుగుతున్న బిడ్డను కళ్లారా చూడకుండానే ఓ గర్భిణి అనారోగ్యంతో మృతిచెందింది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం మేరకు.. ముస్తాబాద్‌ మండలం మద్దికుంటకు చెందిన ఝాన్సీ అలియాస్‌ ఐశ్వర్య (20)కు గూడెం గ్రామానికి చెందిన ఈడుగురాళ్ల అంజయ్య, విజయ దంపతుల కుమారుడు హరీశ్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. 

ఝాన్సీ ప్రస్తుతం 7 నెలల గర్భిణి. ఇటీవలే భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లాడు. ఝాన్నీ అనారోగ్యానికి గురికాగా నెల రోజులుగా వైద్యం చేయిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పెళ్లయిన ఏడాదిన్నరకే ఝాన్సీ మృతిచెందడంతో రెండు కుటుంబాలు దుఃఖంలో మునిగాయి. ఆమె కడసారి చూపునకు భర్త  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement