
గొంతులో కత్తితోనే పోలీస్‌స్టేషన్‌కు..
నంద్యాల(కర్నూలు): అత్యంత రద్దీగా ఉండే కర్నూలు జిల్లా నంద్యాల బొమ్మలసత్రం సెంటర్‌లో ఆటో డ్రైవర్ కిశోర్‌పై హత్యాయత్నం జరిగింది. కత్తి గొంతులోకి దిగడంతో గాయపడిన వ్యక్తి అలాగే స్టేషన్‌కు వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. నూనెపల్లెకు చెందిన కిశోర్‌గౌడ్‌కు కల్లుగీత కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా కొందరితో విభేదాలు తలెత్తాయి. మరికొందరితో ఆస్తి తగాదా కూడా ఉంది. ఆటో నడపడంతో పాటు అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం బొమ్మలసత్రంలో ఉండగా అతనిపై ఐదుగురు వ్యక్తులు ఘర్షణకు దిగారు. వీరిలో ఒకరు కత్తితో గొంతుపై పొడిచాడు. వెంటనే అందరూ పరారయ్యారు. రక్త మోడుతూనే కిశోర్‌గౌడ్ సమీపంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఘటనను వివరించాడు. వెంటనే అతన్ని ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గొంతులో కత్తితోనే కర్నూలుకు రెఫర్ చేశారు. అంతకు ముందు మేజిస్ట్రేట్ రామ్మోహన్ బాధితుని ఫిర్యాదు స్వీకరించారు. కిశోర్‌గౌడ్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల గుర్తింపునకు చర్యలు చేపట్టామని డీఎస్పీ హరినాథరెడ్డి తెలిపారు.