Boy Dies After Punugulu Gets Stuck In Throat Rajanna Sircilla - Sakshi
Sakshi News home page

చిన్నారి ప్రాణం తీసిన పునుగులు.. ఆసుపత్రికి తరలించేలోపే

Published Mon, Jul 24 2023 9:17 PM | Last Updated on Mon, Jul 24 2023 9:48 PM

Boy Died After Punugulu Gets Stuck In Throat Rajanna Siricilla - Sakshi

సాక్షి, సిరిసిల్ల: ఆ తల్లిదండ్రుల నిర్లక్ష్యం వారి ఇంటి దీపం ఆరిపోయేలా చేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ ఉసురుతీసింది. ఈ హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం కేంద్రంలో క్రాంతి కుమార్ అనే 13 నెలల బాలుడు మృతి చెందాడు. గొంతులో పునుగులు ఇరుక్కోవడంతో అతడిని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, శ్వాస ఆడకపోవడంతో అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన క్రాంతి.. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు.

కొమురం భీమ్ జిల్లా కౌటాల మండలం వెల్డండి గ్రామానికి చెందిన మారుతి, కవితల సంతానం క్రాంతి కుమార్. రెండేళ్ల నుంచి ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement