
సాక్షి, మెదక్ : చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాకు చెందిన సంతోషి(30) అనే మహిళ కూలి పనుల కోసం వలస వచ్చింది. ముసాయిపేట్ మండలం కొప్పులపల్లి గ్రామ శివారులో ని ఇటుక బట్టీలలో పని చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం తూప్రాన్ సంతకు వెళ్లిన మహిళ.. మద్యం సేవించి ఇంటికి వచ్చింది.
అనంతరం ఇంట్లో చికెన్ వండుకుని తింటున్న సమయంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తూప్రాన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహిళ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. వెల్దుర్తి ఎస్ఐ మధుసూదన్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
చదవండి: ‘సాక్షి’ చేతిలో సాత్విక్ సూసైడ్ నోట్.. నివ్వెరపోయే విషయాలు
Comments
Please login to add a commentAdd a comment