స్విగ్గీలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ శాకాహారికి చేదు అనుభవం ఎదురైంది. పార్సిల్ ఓపెన్ చేసి తింటున్న ఆమెకు ఊహించని విధంగా బిర్యానీలో చికెన్ ముక్క కన్పించింది. దీంతో స్వచ్ఛమైన వెజిటేరియన్ అయిన ఆమె.. స్విగ్గీ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిర్యానీలో మాంసం ముక్క ఫొటో, ఆర్డర్ బిల్లు వంటి వివరాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి మండిపడింది.
ఈ కస్టమర్ పేరు నటాషా భరద్వాజ్. తన విశ్వాసాలకు విఘాతం కల్గించేలా చేసిన స్విగ్గీపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు ఎంతమాత్రము ఆమోదయోగ్యం కాదన్నారు. నిజమైన శాకాహారులు స్విగ్గీలో ఆర్డర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అని ఇతర కస్టమర్లకు సూచించారు.
If you’re a strict vegetarian (like me) think twice before ordering from @Swiggy !
— Natasha Bhardwaj (@bhardwajnat) April 11, 2023
I ordered biriyani rice with aloo which is clearly MARKED AS VEGETARIAN on the platform and I found a piece of meat (could be chicken, mutton or anything!) in the rice.
Such grave errors are… pic.twitter.com/h7K57CPML4
ఈ విషయంపై స్విగ్గీ ఎగ్జిక్యూటివ్స్‌కు ఫిర్యాదు చేస్తే వారికి అసలు బాధగా లేదని నటాషా అసహనం వ్యక్తం చేశారు. అది నాన్ వెజ్ రెస్టారెంట్ అని, అయినా స్విగ్గీలో వెజ్ రెస్టారెంట్‌గా ఎందుకు మార్క్ చేసుకున్నారో తెలియడం లేదని వారు బదులిచ్చారని చెప్పారు.
ఈ మహిళ ట్వీట్‌కు స్విగ్గీ కూడా బదులిచ్చింది. మా రెస్టారెంట్లలో ఇలాంటి మిక్స్‌ప్‌లు జరుతాయని ఊహించలేదని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆర్డర్ ఐడీ చెప్పాలని సూచించింది. దీంతో మహిళ ఆర్డర్ ఐడీని కూడా స్విగ్గీకి షేర్ చేసింది.
చదవండి: దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు.. మరో 7,830 మందికి పాజిటివ్..
Comments
Please login to add a commentAdd a comment