ఒక మహిళకు ఎదురైన వింత అనుభవం ఇప్పుడు వైరల్‌గా మారింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ తాను చికెన్ తింటున్న సమయంలో తన గొంతులో ఒక చిన్నపాటి ఎముక ఇరుక్కుపోయిందని తెలిపింది. దీంతో తనకు గొంతునొప్పి తలెత్తడంతో వైద్యుని దగ్గరకు వెళ్లానని, ఆయన సర్జరీ చేసేందుకు బదులు ఇచ్చిన ఒక సలహా అద్భుతంగా పనిచేసిందన్నారు. దీంతో తనకు నొప్పి నుంచి ఉపశమనం లభించిందని తెలిపారు. ఈ ఉదంతం న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది.
ఇచ్ మీడియా కంపెనీ స్టఫ్ తెలిపిన వివరాల ప్రకారం బెథ్ బ్రెష్ అనే మహిళ గత వారంలో వెల్లింగ్టన్‌లోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఆమె చికెట్ డిష్ ఆర్టర్ చేసింది. అప్పుడు వెయిటర్ ఆమెను ఎముకలతో కూడిన చికెన్ కావాలా లేదా బోన్‌లెస్ చికెన్ కావాలా అని అడిగాడు. దీనికి ఆమె బోన్‌తో కూడిన చికెన్ కావాలని తెలిపింది.
ఆ చికెన్ తింటున్న సమయంలో ఆమె గొంతులో చిన్నపాటి ఎముక ముక్క ఇరుక్కుపోయింది. ఆమెకు కొంచెం నొప్పిగా అనిపించినప్పటికీ, రెస్టారెంట్‌తో ఎటువంటి ఫిర్యాదు చేయకుండానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే రెండుమూడు రోజుల పాటు ఆ నొప్పి కొనసాగడంతో తన ఇంటికి సమీపంలోని వైద్యుని దగ్గరకు వెళ్లి, తన సమస్య వివరించింది. వైద్యుని పరీక్షలో ఆమె గొంతులో చిన్నపాటి బోన్ ముక్క ఉందని స్పష్టమయ్యింది. దీంతో ఆమె తనకు సర్జరీ చేస్తారని అనుకుంది. అయితే ఆ వైద్యుడు సర్జరీకి బదులుగా ఒక విచిత్ర ఉపాయం తెలిపారు.
వైద్యుని సలహా గురించి బెథ్ బ్రెష్ మాట్లాడుతూ ఆ వైద్యుడు తనను కొద్ది రోజులు కూల్‌డ్రింక్ తాగాలని, అప్పుడు తన గొంతులోని బోన్ పీస్ దానంతట అదే కరిగిపోతుందని తెలిపారన్నారు. ఆమెకు ఆ సలహా పనిచేయదేమోనని అనిపించినా దానిని అనుసరించింది. ఫలితంగా ఆమె గొంతు రెండు రోజులలో మునుపటి మాదిరిగా సవ్యంగా మారిపోయింది.
ఈ ఘటన గురించి డచ్ మెడికల్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ బ్రాయన్ బెట్టీ మాట్లాడుతూ గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోతే ఇది పరిష్కారం కాదన్నారు. ఎసిడిక్ డ్రింక్ కారణంగా ఎముక ముక్క కరిగిపోయే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విధంగా బాధితులకు కూల్ డ్రింక్ తాగాలంటూ సలహా ఇవ్వడం సరికాదన్నారు.
ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే రూ.72 కోట్లకు యజమాని.. బిజినెస్‌లో సక్సెస్.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ..
Comments
Please login to add a commentAdd a comment