
సాక్షి, సూర్యాపేట: ప్రేమించలేదని ఓ దుండగుడు బాలిక గొంత కోసిన దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నేరెడుచర్లలో ఓ బాలికతో తనను ప్రేమిస్తున్నట్లు బాల సైదులు అనే వ్యక్తి తెలిపాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో గత కొంత కాలంగా ప్రేమ పేరుతో తనని వేధిస్తూ వచ్చాడు. ఎంతకీ తాను ఒప్పుకోలేదనే కోపంతో బాలిక గొంతు కోసేశాడు. ఈ ఘటన అరబిందో కాలేజ్ సమీపంలో జరిగింది. దాడిలో బాలికకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.